S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/20/2016 - 07:16

న్యూఢిల్లీ, జూలై 19: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం, బిజెపి, వైకాపాలకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు, మాజీ ఎంపీ జెడి శీలం మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రప్రదేశ్‌కు వెనె్నముక లాంటిదని అభిప్రాయపడ్డారు.

07/20/2016 - 07:16

న్యూఢిల్లీ, జూలై 19: కాశ్మీర్ లోయలో మీడియాపై ప్రభుత్వం దాడులు చేస్తోందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కాశ్మీర్‌లో వార్తాపత్రికల ప్రచురణలపై ఎలాంటి నిషేధం లేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయడు సోమవారం రాత్రి జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి ఫోన్ చేసి ఈ విషయంపై వివరాలు అడిగారు.

07/20/2016 - 07:15

పాట్నా, జూలై 19: బిహార్‌లోని గయ, ఔరంగాబాద్ జిల్లాల సరిహద్దుల్లో సోమవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో పదిమంది సిఆర్‌పిఎఫ్ కమాండోలు మృతి చెందడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు నష్టపరిహారాన్ని ప్రకటించారు.

07/20/2016 - 07:15

ఇస్తాంబుల్, జూలై 19: టర్కీలో ఎర్డోగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఆర్మీ, ఇతర ప్రభుత్వ అధికారులపై ప్రభుత్వం ఉక్కుపాదం కొనసాగుతోంది. తిరుగుబాటుకు కుట్రపన్నిన వారుగా భావిస్తున్న వేలాది మంది అధికారులను అరెస్టు చేసిన ఎర్డోగన్ ప్రభుత్వం మరో 9 వేల మంది అధికారులను బర్తరఫ్ చేసింది.

07/20/2016 - 07:14

న్యూఢిల్లీ, జూలై 19: భారత్‌లో వైద్యుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం సంచలన ప్రకటన చేసింది. భారత్‌లో వైద్యులుగా చెలామణి అవుతున్న అల్లోపతి వైద్యుల్లో 57శాతం మందికి ఎలాంటి వైద్యపరమైన అర్హతలు లేవని స్పష్టం చేసింది.

07/20/2016 - 07:13

క్లీవ్‌లాండ్, జూలై 19: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలనాలు, వివాదాలకు మారుపేరైన డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా కూడా ఆయన బాటలోనే పయనిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రచారంలో చాలా తక్కువగా ప్రజల్లోకి వచ్చిన మెలానియా రిపబ్లికన్ జాతీయ కనె్వన్షన్‌లో ఓ అద్భుతమైన ప్రసంగం చేశారు. విచిత్రమేమంటే ఈ మొత్తం ప్రసంగంలో ఏ ఒక్క అక్షరమూ ఆమె సొంతం కాదు. ఆమె అనుచరులు రాసింది కాదు..

07/20/2016 - 07:13

న్యూఢిల్లీ, జూలై 19: వస్తుసేవల పన్ను బిల్లు రాజ్యసభలో ఎంత తొందరగా ఆమోదం పొందితే రాష్ట్రాలకు అంత మంచిదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. జీయస్టీ బిల్లును ఆమోదించాలని రాజ్యసభలో మంగళవారం ఆయన అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ‘‘14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు సర్వీసు టాక్స్‌లో రాష్ట్రాలకు వాటా ఇచ్చే అవకాశం లేదు.

07/20/2016 - 07:13

ముంబై, జూలై 19: ముంబైలో సంచలనం రేపిన షీనా బోరా హత్యకు కుట్ర చేసింది తల్లి ఇంద్రాణీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీయేనని సిబిఐ ముంబై హైకోర్టుకు తెలియజేసింది. పీటర్ కుమారుడు రాహుల్‌తో ఆమె ప్రేమ సంబంధం వీరిద్దరికీ నచ్చలేదని, అందువల్లే హత్యకు పథకం రచించారని స్పష్టం చేసింది.

07/20/2016 - 07:12

న్యూఢిల్లీ, జూలై 19: లంచం తీసుకుంటూ సిబిఐ అధికారులకు చిక్కిన ఐఎఎస్ అధికారి బి.కె.బన్సాల్ భార్య, కుమార్తె మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మధువిహార్ ప్రాంతంలోని నీలకంఠ అపార్ట్‌మెంట్స్‌లోని తమ ఫ్లాట్‌లో బన్సాల్ భార్య సత్యబాల (58), నేహ (27) వేర్వేరు గదుల్లో ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖలో డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న బి.కె.

07/20/2016 - 07:09

న్యూఢిల్లీ, జూలై 19: తెలంగాణలో ఐటీ, హార్డ్‌వేర్ రంగాలకు పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు ఢిల్లీలో మంగళవారం పలు దేశాల రాయబారులతో చర్చలు జరిపారు. కె.టి.రామారావు జపాన్, తైవాన్, దక్షిణ కొరియా దేశాల ప్రతినిధులతో పాటు కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖమంత్రి కల్‌రాజ్ మిశ్రా, హడ్కో సీఎండి, గృహనిర్మాణ బోర్డు డైరెక్టర్ జనరల్‌తో సమావేశమయ్యారు.

Pages