S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/20/2016 - 05:49

కర్నూలు, జులై 19:కృష్ణానది పుష్కరాల వేదిక విజయవాడ నుంచి కర్నూలు జిల్లాకు మారినట్లు విశ్వసనీయ సమాచారం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదీ సంగమేశ్వరం వద్ద కృష్ణా పుష్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారని జిల్లా అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

07/20/2016 - 05:48

విజయవాడ, జూలై 19: కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ నగరంలో భిక్షగాళ్లను తరిమివేయడానికి ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆటోలపైనా నిషేధం విధించే విషయమై ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. విజయవాడ నగరంలోనే కాకుండా శివారు ఇబ్రహీంపట్నం వరకు కూడా కృష్ణానదీ తీరాన కోట్లాది రూపాయల వ్యయంతో స్నానఘాట్ల నిర్మాణం జరిగింది.

07/20/2016 - 05:46

న్యూఢిల్లీ, జూలై 19: జాతిపిత మహాత్మాగాంధీ హత్య వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తముందని రాహుల్ గాంధీ ఆరోపించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీపై ఆర్‌ఎస్‌ఎస్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ‘మొత్తం ఆర్‌ఎస్‌ఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పండి.. లేదంటే విచారణను ఎదుర్కోండి’ అంటూ అల్టిమేటం జారీ చేసింది.

07/20/2016 - 05:43

న్యూఢిల్లీ, జూలై 19: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని తుడిచిపెట్టాలని, నిస్సహన వైఖరితో తరిమికొట్టాలని భారత లోక్‌సభ మంగళవారం ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఉగ్రవాద మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ఎవరికి వారుగా కాకుండా ఉమ్మడి వ్యూహంతో సంఘటితంగామే ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు ఘన నివాళులర్పించింది.

07/20/2016 - 05:40

న్యూఢిల్లీ, జూలై 19: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రత్యేక హోదా బిల్లును రాజ్యసభలో గెలిపించుకోవటం ద్వారా తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పడేసేందుకు కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేస్తోంది. బిల్లును పాస్ చేయించుకోవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ తమ ఎంపిలకు విప్ జారీ చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు విపక్షాల మద్దతు సంపాదించేందుకూ ప్రయత్నాలు ప్రారంభించింది.

07/20/2016 - 05:23

న్యూఢిల్లీ, జూలై 19: రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్రరరావు ప్రతిపదించిన ప్రయవేట్ బిల్లుకు అంశాలవారీగా తెరాస మద్దతిస్తుందని ఐటి మంత్రి తారక రామారావు వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో తనను కలిసిన విలేఖర్లతోతో మాట్లాడుతూ హైకోర్టు విభజనకు అనుకూలంగా ఉన్న అంశాలకు సంబంధించి బిల్లు ఎవరు ప్రతిపదించినా మద్దతిస్తామన్నారు.

07/20/2016 - 05:21

హైదరాబాద్, జూలై 19: మెడికల్ ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీక్ అయ్యందనే వార్తలను తెలంగాణ ఉన్నత విద్యా శాఖ, ఉన్నత విద్యామండలి అధికారులతోపాటు పరీక్ష నిర్వాహక యూనివర్శిటీ జెఎన్‌టియు అధికారులు తేలికగా కొట్టిపారేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సైతం వేర్వేరు ప్రకటనల్లో ప్రశ్నాపత్రం లీక్ కాలేదని స్పష్టం చేశారు.

07/20/2016 - 04:49

ఎన్నికల తరువాత ఎవరు ముఖ్యమంత్రి పదవి చేపట్టినా సచివాలయ ఉద్యోగులు తొలి రోజు స్వాగతం పలకడం, వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడడం ఆనవాయితీ. అదే విధంగా 2014 జూలై 2న ముఖ్యమంత్రిగా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసి పరెడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన తరువాత కెసిఆర్ నేరుగా సచివాలయానికి వచ్చి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.

07/20/2016 - 04:44

భారత క్రికెట్ వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. క్రికెట్‌లో సమూల మార్పులను సూచిస్తూ సు ప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. లోధా కమిటీ చేసిన సిఫారసులను సుప్రీంకోర్టు ఆమోదించింది. లోధా కమిటీ తీర్పుతో పూర్తిగా ఏకీభవిస్తున్నామని, ఆరునెలల్లోగా భారత క్రికెట్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని పేర్కొంది.

07/20/2016 - 04:43

మహిళా వివక్ష మత ఛాందసవాదులకు వెన్నతో పెట్టిన విద్య.

Pages