S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/19/2016 - 12:01

హైదరాబాద్: గురుపూర్ణిమ సందర్భంగా మహారాష్టల్రోని షిర్డీతో పాటు తెలుగురాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాల్లో మంగళవారం నాడు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రావడంతో షిర్డీ సాయి ఆలయం వద్ద తెల్లవారు జాము నుంచే కోలాహలం నెలకొంది. ఇక, హైదరాబాద్‌లోని పంజగుట్ట, దిల్‌సుఖ్‌నగర్, ఫిల్మ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయాల్లో భక్తులు బారులు తీరారు.

07/19/2016 - 11:58

హైదరాబాద్‌: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఆల్పపీడన ద్రోణి ఫలితంగా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పలు చోట్ల వానలు, ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. జంట నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మరో 3, 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వెల్లడించారు.

07/19/2016 - 11:50

ఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బంగ్లాదేశ్‌, ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి మృతులకు సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై లోక్‌సభలో టీడీపీ నోటీస్‌ ఇచ్చింది. భారత వైద్య మండలి చట్టసవరణ బిల్లు, దంత వైద్యులచట్ట సవరణ బిల్లుపై లోక్‌సభ‌లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

07/19/2016 - 11:25

ఖమ్మం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో దమ్మక్క ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు, సీతారామానుజాచార్యులు దమ్మక్క చిత్రపటానికి పూల మాలలు వేసి ఉత్సవాలను ప్రారంభించారు. పండ్లతో గిరిజనులు స్వామివారికి నైవేద్యం సమర్పించారు.

07/19/2016 - 11:16

మంగళూరు: బంగారంస్మగ్లర్లకు సాయం చేస్తున్న ఇద్దరు స్పైస్‌జెట్‌ ఉద్యోగులను మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ అంతర్జాతీయ విమానంలో సీటు కింద దాచి ఉంచిన బంగారాన్ని గుర్తించారు. స్మగ్లర్లకు సాయం చేస్తున్న మంగళూరు ఎయిర్‌పోర్టులో పనిచేసే మహ్మద్‌ హనీఫ్‌, ముద్దయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేసినట్లు స్పైస్‌జెట్‌ తెలిపింది.

07/19/2016 - 11:11

దిల్లీ: జపాన్‌ రాయబారి యూపాక కికుటుతో తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఉదయం సమావేశమై మేకిన్‌ తెలగాణ అంశంపై చర్చించారు. మంత్రి కేటీఆర్‌ మలేసియా ఉప ప్రధానితో, తైవాన్‌ రాయబారి తుంగ్‌కవాంగ్‌తో, దక్షిణ కొరియా రాయబారి హ్యున్‌చావ్‌తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనున్నారు.

07/19/2016 - 07:29

గోపాలపురం, జూలై 18: నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనించాలని రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్ కోడలు రూపాదేవి అన్నారు. గోపాలపురంలో కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఆమె సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా రూపాదేవి మాట్లాడుతూ మహిళలు స్వశక్తిపై ఆధారపడి జీవించేందుకు ఇటువంటి శిక్షణలు ఎంతో అవసరమన్నారు.

07/19/2016 - 07:29

ఏలూరు, జూలై 18: మోడి-చంద్రబాబుల జోడి ధరలు తగ్గిస్తామని, ఉద్యోగాలు ఇస్తామని అందుకోసం నల్లధనం తెచ్చి ఖర్చుచేస్తామన్న వాగ్ధానాలు గాలికొదిలేశారని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం విమర్శించారు. స్ధానిక కలెక్టరేట్ వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా బలరాం మాట్లాడుతూ అధికధరలు, నిరుద్యోగం పెంచే విధానాలు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అమలుచేస్తున్నాయన్నారు.

07/19/2016 - 07:28

ఏలూరు, జూలై 18: చిన్నచిన్న సమస్యల పరిష్కారం కోసం శ్రమపడి మీకోసం కార్యక్రమానికి రాకుండా స్ధానికంగా ఉన్న అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ సూచించారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం మీకోసం కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు.

07/19/2016 - 07:26

ఏలూరు, జూలై 18 : జిల్లాలోని మెట్ట ప్రాంతంలో భూగర్భ జల నీటిమట్టం పెరుగుతోందని, గత పది రోజుల్లో 1.32 మీటర్ల ఎత్తులోకి నీరు పెరిగిందని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.

Pages