S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 04:52

హైదరాబాద్, జూలై 17: న్యాయస్థానాల్లో వేగంగా తీర్పులిచ్చేందుకు ఈ-కోర్టు ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ అభిప్రాయపడ్డారు. దేశంలో మొట్టమొదటి ఈ-కోర్టును హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టులో ఆదివారం ప్రారంభించారు. సుప్రీంకోర్టులో ఈ-కమిటీకి లోకూర్ నాయకత్వం వహిస్తున్నారు.

07/18/2016 - 04:49

హైదరాబాద్, జూలై 17: కృష్ణా జలాల పంపకంపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న తగాదాల పరిష్కారానికి టెలిమెట్రీ వ్యవస్ధ ఏర్పాటు చేస్తామని కృష్ణా జలాల యాజమాన్య బోర్డు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను అమలు చేస్తున్నట్టు రెండు రాష్ట్రాలకూ బోర్డు లేఖ రాసింది. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుపై తమకు అభ్యంతరం లేదని రెండు రాష్ట్రాలూ సూత్రప్రాయంగా అంగీకారం తెలపనున్నట్టు సమాచారం.

07/18/2016 - 04:47

న్యూఢిల్లీ, జూలై 17: సాదారణంగా పరస్పరం దుమ్మెత్తి పోసుకునే రాజకీయ పార్టీలు జమ్మూ, కాశ్మీర్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై మాత్రం ఒకే గొంతుతో మాట్లాడాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇలా అన్ని పార్టీలు ఒకే మాట వినిపించడం ప్రపంచ దేశాలకు ఓ మంచి సందేశాన్ని పంపించడమే కాక, దేశానికి సైతం మేలు చేసిందని మోదీ అన్నారు.

07/18/2016 - 04:46

న్యూఢిల్లీ, జూలై 17: నేటినుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు, కాశ్మీర్ ఉద్రిక్తతలు, ఎన్డీయే విధించిన రాష్టప్రతి పాలనను సుప్రీంకోర్టు కొట్టివేయడం, ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం లభించకపోవటం, గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలపై ఘాటుగానే చర్చ జరగనుంది.

07/18/2016 - 04:45

న్యూఢిల్లీ, జూలై 17: లైంగిక వేధింపులకు గురైన కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఇకపై మూడు నెలలు వేతనంతోకూడిన సెలవు తీసుకోవచ్చు.

07/18/2016 - 04:16

ఇంద్రకీలాద్రి, జూలై 17: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయం ముందు ఉన్న రావిచెట్టు, రాజగోపురం ఎదుట, రెండు ప్రదేశాల్లో కూరగాయలతో ఏర్పాటు చేసిన దుర్గమ్మ అలంకారాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

07/18/2016 - 04:15

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 17: నందిగామ కెవిఆర్ కళాశాల ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న పసుపులేటి లక్ష్మీ మెమోరియల్ మూడవ రాష్టస్థ్రాయి సీనియర్ పురుషుల, మహిళల పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో విశాఖపట్నం, కృష్ణా క్రీడాకారులు పోటీపోటీగా ఒకరికొకరు పోటీపడుతున్నారు. చాంపియన్‌షిప్ కోసం బరువులను ఎత్తే క్రమంలో పోటీపడుతూ తమ స త్తాను చాటుకుంటున్నారు.

07/18/2016 - 04:15

విజయవాడ, జూలై 17: పుష్కర యాత్రికులు ప్రధాన అతిధులుగా భా వించి వారికి సౌకర్యవంతమైన సేవలు లభించే విధంగా సమగ్రమైన సౌకర్యాల వేదికగా పుష్కరనగర్‌లను తీర్చిదిద్దుతున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. యాత్రికుల కోసం పుష్కరనగర్‌లు, శాటిలైట్ బస్ స్టేషన్లు, వెబ్‌సైట్, యాప్ సిద్ధం చేస్తున్నామన్నారు. కలెక్టర్ అందించిన సమాచారం ప్రకారం...

07/18/2016 - 04:14

విజయవాడ, జూలై 17: మోదీ, బాబుల జోడీ పాలన ధరలను అదుపుచేయలేక మధ్యతరగతి ప్రజల నోట్లో మట్టికొట్టి బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నారని సిపిఎం రాష్ట్ర నేత సిహెచ్ బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలు అరికట్టాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం జక్కంపూడి కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక గవర్నమెంట్ హాస్పటల్ వద్ద జరిగింది.

07/18/2016 - 04:14

విజయవాడ, జూలై 17: పట్టిసీమ పథకం ద్వారా పోలవరం కుడి ప్రధాన కాలువకు రెండురోజులుగా 1500 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. నీటిమట్టం క్రమేణా పెరిగే అవకాశాలు కన్పిస్తుండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాలకు మంచినీటి కో సం సోమవారం ఉదయం ఆరు గంటలకు తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు.

Pages