S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 04:54

కాల్గరీ (కెనడా), జూలై 4: భారత ఆటగాడు సాయి ప్రణీత్ ఇక్కడ జరిగిన కెనడా ఓపెన్ బాడ్మింటన్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో 23 ఏళ్ల ప్రణీత్ 21-12, 21-10 ఆధిక్యంతో దక్షిణ కొరియాకు చెందిన లీ హ్యున్‌ను ఓడించాడు.

07/05/2016 - 04:53

హైదరాబాద్, జూలై 4: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో తెలుగు టైటాన్స్ తొలి విజయా న్ని నమోదు చేసింది. వరుసగా మూడు పరాజయాలను ఎదుర్కొన్న టైటాన్స్ సోమ వారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌ను ఏకంగా 17 పాయంట్ల తేడాతో చిత్తు చేసింది. టైటాన్స్ 35 పాయంట్లు సాధించగా, బెంగాల్ 18 పాయంట్లు మాత్రమే చేయ గలిగింది. మొదటి నుంచి చివరి వరకూ టైటాన్స్ ఆధిపత్యం కొనసాగడం విశేషం.

07/05/2016 - 04:52

పారిస్, జూలై 4: ఆలివర్ గిరాడ్ రెండు గోల్స్‌తో రాణించగా ఐస్‌లాండ్‌తో జరిగిన యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్స్‌లో 5-2 తేడాతో నెగ్గిన ఫ్రాన్స్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్

07/05/2016 - 04:44

హైదరాబాద్ మహానగరంలోని రోడ్లు నరకాన్ని తలపింపజేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ అడుగడుతునా ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు స్పీడ్ బ్రేకర్లతో నింపివేశారు. ఇక రోడ్లు ఎక్కడెక్కడ బాగుంటాయో ఎక్కడ గుంతల మయమై ఉంటాయో తెలియని పరిస్థితి. చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయమై ఈ నీళ్ళలో స్పీడ్ బ్రేకర్లు, గుంటలు అర్ధంకాక వాహనాలు పల్టీ గొట్టడంవంటి సంఘటనలు కోకొల్లలు.

07/05/2016 - 04:42

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారి కేంద్ర ప్రభుత్వం ఉరుకులు, పరుగులపై పని చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను కష్టపడి పని చేయటంతోపాటు మంత్రులు, అధికారుల చేత పని చేయిస్తున్నారు. దేశానికి ఇది శుభ పరిణామమని చెప్పకతప్పదు. నరేంద్ర మోదీ మంత్రుల పని తీరును ఎప్పటికప్పుడు సమీక్షించటంతోపాటు అధికారుల పని తీరును కూడా సమీక్షించటం హర్షణీయం.

07/05/2016 - 04:40

తమ తప్పిదాలను ఇతరుల పైకి నెట్టివేసి, తాము సచ్చీలురమని చెప్పుకొనే సంస్కృతి సమాజంలో నానాటికి పెరిగిపోతున్నది. అంతే తప్ప, ఆత్మవిమర్శ చేసుకొని, జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించే నాథుడే కరవయ్యారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మన రాష్ట్రంలోని విద్యావ్యవస్థను చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో నానాటికీ విద్యారంగంలో ప్రైవేటు సంస్థల (కార్పొరేట్) ప్రాబల్యం పెరిగిపోతున్నది.

07/05/2016 - 04:39

హైదరాబాద్ నగరం ఐసిస్ గుప్పెట్లోకి వెళ్లిందనే విషయం ఇవ్వాళ కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వచ్చిందని అనుకోవటం పొరపాటు. 2015వ సంవత్సరం నిక్కీ జోసఫ్ అనే ఐసిస్ ఉగ్రవాద నాయకురాలిని అరెస్టుచేసినప్పుడే ఈ విషయం బహిర్గతమయింది. ఇంటిలిజెన్స్ వర్గాలు హైదరాబాద్ పాతబస్తీలో ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్ సెంటర్ ఉందని హెచ్చరించినా కాంగ్రెసు ప్రభుత్వాలు పట్టించుకోలేదు.

07/05/2016 - 04:37

వర్షాలు రాలేదన్న ఆందోళన ఎంత తీవ్రంగా యావద్భారతాన్ని కుదిపేస్తుందో..తీరా వర్షాలు పడితే దాని బీభత్సం కూడా అంతగానూ కకావికలం చేస్తుంది. చినుకు పడితే చాలు చిత్తడైపోయే రాష్ట్రాల్లో ప్రథమస్థానం ఉత్తరాఖండ్‌ది. ఇప్పుడా చిరు రాష్ట్రం తల్లడిల్లిపోతోంది. వర్షాలు లేక కాదు, కురిసిన వాన కుంభవృష్టిని తలపించడం వల్ల..

07/05/2016 - 03:21

టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్న హీరోయిన్లు సైతం మొహమాటానికో, క్రేజ్ కోసమే -ఐటెమ్స్ చేస్తూ పాపులార్టీని ఒకపక్క, కమర్షియాలిటీని మరోపక్క ఒడిసి పట్టుకుంటున్న రోజులివి. బాలీవుడ్ హీరోయిన్లలో ఈ కోణం కాస్త ఎక్కువే. కొందరు సౌత్ హీరోయిన్లు కూడా బాలీవుడ్ బాటపట్టి ఐటెమ్స్ చేస్తున్నారు. కానీ, రెజీనా అందుకు విరుద్ధమట. కొద్దిరోజులు క్రితం రెజీనా ఐటెంసాంగ్ చేస్తోందన్న కథనాలు వెలువడ్డాయి.

07/05/2016 - 03:19

బాగోలేదు..రోజులు మారాయి
**
తారాగణం: తేజస్వి మదివాడ, కృతికా జయకుమార్, పార్వతీశం, చేతన్ మద్దినేని, వాసు ఇంటూరి, రాజా రవీంద్ర, అలీ, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: జెబి
ఛాయాగ్రహణం: పి బాల్‌రెడ్డి
మాటలు: రవి నంబూరి
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: జి శ్రీనివాసరావు
దర్శకత్వం: మురళీకృష్ణ ఎం
**

Pages