S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 01:20

కడప,జూలై 4: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం జిల్లాలో మండల, గ్రామపంచాయతీల వారీగా ఉద్యోగ భర్తీలకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో అధికారపార్టీ నేతల భర్తీకే పెద్దపీటవేయనున్నారు. అంతేగాకుండా జన్మభూమి కమిటీలకు గిరాకీ పెరిగి వారు నిర్ణయించిందే ఈ ఉద్యోగాల భర్తీ ఉండదు.

07/05/2016 - 01:19

రాజంపేట, జూలై 4:రాజంపేట మున్సిపాలిటీలోని 6వ వార్డు రామ్‌నగర్ ఏరియాలో సోమవారం ఉదయం కమిషనర్ ఎన్‌వి రమణారెడ్డి, మున్సిపల్ సిబ్బంది మార్నింగ్ వాక్ నిర్వహించి, ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలను గుర్తించడంతో పాటు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను విచారించారు. ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీటి పథకాలను ఆయన పరిశీలించారు.

07/05/2016 - 01:19

ప్రొద్దుటూరు టౌన్, జులై 4: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ ప్రాంతంపై వివక్షత చూపుతున్నాడని ఉక్క్ఫ్యుక్టరీ సాధనసమితి అధ్యక్షుడు జివి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక శ్రీవిద్యా, భావనా జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు.

07/05/2016 - 01:18

రాయచోటి, జూలై 4: రాష్ట్రంలోని ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా కార్యదర్శి సుజాత పేర్కొన్నారు.

07/05/2016 - 01:17

కడప,జూలై 4: విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు నిరక్ష్యరాస్యత, నిరుద్యోగం, పేదరికం, హింసలపై పోరాటం చేయాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కళాక్షేత్రంలో 120వ అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవం నిర్వహించారు.

07/05/2016 - 01:20

కడప,(కల్చరల్)జూలై 4: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం హిందూ దేవాలయాలను కూల్చివేసి అభివృద్ధి పనులు చేయాలనుకోవడం హిందువుల మనోభావాలతో ప్రభుత్వం చెలగాటం ఆడటమేనని హిందు దేవస్థాన 108 ఆలయాల కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు జికె మునెయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాజధాని విజయవాడలో హిందువులు పూజించే పురాతన దేవాలయాలు కూల్చడం హిందు మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు.

07/05/2016 - 01:17

కడప,(కల్చరల్)జూలై 4: మీకోసంలో ప్రజలు సమర్పించిన సమస్యలను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్త కలెక్టరేట్‌లోని మీ కోసం భవనంలో జరిగిన మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి సమస్యల వినతులు స్వీకరించారు.

07/05/2016 - 01:16

రాజుపాళెం, జూలై 4: వెలవలి-తొండలదినె్న గ్రామాల మధ్య నుండి కుందూనది మీదుగా పెద్దజొన్నవరం, ఎంకుపల్లె నుండి జాతీయ రహదారికి అనుసంధానం చేసిన రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. గతంలో ఎప్పుడో కుందూనదిపై బ్రిడ్జి నిర్మించాక ఈ గ్రామాల మధ్య నుండి కడప-కర్నూలు జాతీయ రహదారి వరకు తారురోడ్డు నిర్మించారు. ఆ తర్వాత ఆ రోడ్డు స్థితిగతుల గురించి పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకోలేదు.

07/05/2016 - 01:16

బుక్కరాయసముద్రం, జూలై 4: అనంతపురం-తాడపత్రి రహదారిలో బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కౌలు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొర్రపాడు గ్రామానికి చెందిన రాధాకృష్ణ(45), వడ్డే పెద్దన్న(46)లు మృత్యువాతపడ్డారు.

07/05/2016 - 01:13

అనంతపురం కల్చరల్, జూలై 4: ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్‌ను ఆధ్యాత్మికతకు, సోదర భావానికి ప్రతీకగా మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఈమేరకు జడ్పీ చైర్మన్ చమన్ తన స్వగృహంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్ణయించిందన్నారు.

Pages