S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 23:49

యాదగిరిగుట్ట,జూలై 3:సి ఎం కేసి ఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అ ప్రజాస్వామికమని సి ఎల్ పి నేత జానారెడ్డి అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మనవడికి అన్న ప్రాసన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం విలేఖరులతో మాట్లాడారు.

07/03/2016 - 23:49

దేవరకొండ, జూలై 3: దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసే డిండి ఎత్తిపోతల పధకం పనులకు ప్రభుత్వం పది రోజుల్లో టెండర్‌లను ఆహ్వానించనుందని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. ఆదివారం స్ధానిక జడ్పీటీసి ఆలంపల్లి నర్సింహ్మ నివాసగృహంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

07/03/2016 - 23:48

నల్లగొండ టౌన్, జూలై 3: నాగార్జున సాగర్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటు కోరుతు ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి సీఎం కెసిఆర్‌కు లేఖ రాసినట్లుగా ఆదివారం తెలిపారు. ఏపిలో కేంద్రం రెండు సైనిక్ స్కూల్స్‌ను మంజూరు చేసిందని, కొత్త రాష్ట్రం తెలంగాణలో తెలంగాణలో నాగార్జున సాగర్‌లో సైనిక్ స్కూల్‌ను మంజూరు చేయాలని గతంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్‌లను కోరడం జరిగిందన్నారు.

07/03/2016 - 23:47

కౌటాల, జూలై 3: వార్దా, వైన్‌గంగల సంగమ స్థానం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు రావడంపై సర్వత్రా హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి.

07/03/2016 - 23:46

భైంసా రూరల్, జూలై 3: బిజెపి బలోపేతానికి ఐక్యంగా కృషిచేద్దామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి అన్నారు. ఆదివారం భైంసాలోని డాక్టర్స్ అసోసియేష్ భవనంలో జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యం లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజావ్యతిరేక విధానాలు ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేసేందుకు కార్యకర్తలు సన్నద్దులు కావాలన్నారు.

07/03/2016 - 23:46

కడెం, జూలై 3: కడెం జలాశయంలో మత్స్యకారుల ఉపాధి కోసం ఏర్పాటుచేసిన కేజి కల్చర్‌ను మరింత అభివృద్ధి పర్చడానికి తమవంతు కృషిచేస్తామని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదివారం కడెం జలాశయంలో కేజి కల్చర్‌ను ఎమ్మెల్యే సందర్శించారు. జలాశయంలో కేజి కల్చర్ తీరును బోటులో ప్రయాణించి పరిశీలించారు. కేజి కల్చర్‌లో పెంపకంలో చేపడుతున్న పలు రకాల చేపలను ఆమె పరిశీలించారు.

07/03/2016 - 23:46

వాంకిడి, జూలై 3: మండలంలోని బంబార గ్రామంలో 2010లో నిర్మించిన చెరువుకు దాదాపు 1.70కోట్లతో నిర్మించిన ప్రధాన కాల్వ నిర్మాణ పనులు గాలికివదిలి ఇఎండి డబ్బుల కోసం సదరు కాంట్రాక్టర్ ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసిందని ఆ డబ్బులు ఇవ్వకుండా అధికారులు ముందుగా కాల్వను బాగు చేయించి తర్వాతనే ఆ సొమ్ములను ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

07/03/2016 - 23:45

మంచిర్యాల, జూలై 3: ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని ఎఎస్పీ విజయ్‌కుమార్ అన్నారు. జనమైత్రి కార్యక్రమంలో భాగంగా ఆదివారం మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ, గోపాల్‌వాడల్లోని వార్డుల్లో పర్యటిస్తూ వార్డు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ మనిషి ఎలాంటి సమస్యలున్నా, అభ్యంతరాలున్నా స్వచ్ఛందంగా వచ్చి జనమైత్రి అధికారి ద్వారా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు.

07/03/2016 - 23:44

ఆదిలాబాద్, జూలై 3: కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట్రం కుంటిసాకులుచూపి కేంద్రంపై నిందలు మోపడం సరికాదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయ్యనగారి భూమయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని బిసి భవనంలో మండల బిజెపి కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైనారు.

07/03/2016 - 23:44

మంచిర్యాల అర్బన్, జూలై 3: శనివారం బైంసాలో యువతి సంధ్యపై జరిగిన పైశాచిక దాడులను ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తోందని నాయకురాలు జ్యోతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత దేశంలో మహిళలను పట్టపగలు హత్య చేయడమంటే ఈ ప్రజాస్వామ్య దేశమా లేక ఉన్మాదుల దేశమా అని ఆశ్చర్యపడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నిర్భయ చట్టం వచ్చినప్పటికీ స్ర్తిలకు ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉందన్నారు.

Pages