S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 01:53

షీలా దీక్షిత్ న్యూఢిల్లీ ముఖ్యమంత్రిణిగా ఉన్నప్పుడు నాల్గువందల కోట్ల వాటర్ ట్యాంక్ కుంభకోణం జరిగింది. కొత్త ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ గత సంవత్సరానికి పైగా ఈ అవినీతిని వెలుగులోకి రానీయకుండా కాపాడాడు. దీనిపై ముందు పోలీసులు ఎఫ్ ఐఆర్ దాఖలు చేశారు. ఇక రాబర్ట్ వాద్రా భూముల కుంభకోణానికి సంబంధించి ఏక సభ్య కమిషన్ నియమింపబడింది. దానికి హైకోర్టు జడ్జి డింగ్రా నాయకుడు.

07/03/2016 - 01:50

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి , పగలు, నిన్న, నేడు రేపు అనే తేడా లేకుండా పని చేస్తుండడం వల్ల నిద్రా దేవి ఆయన ఎప్పుడు నిద్ర పోతాడా? అని ఎదురు చూసి బాబు నిద్ర పోక పోవడంతో నిద్రా దేవి తానే నిద్ర పోయిందట! ఇది ఫేస్‌బుక్‌లో టిడిపి అధికారిక పేజీలో బాబు విదేశీ ప్రయాణంపై రాసిన పోస్ట్. బాబు ఇమేజ్ పెంచాలనే ఉద్దేశం బాగానే ఉంది. అభిమానం బాగానే ఉంది కానీ ఇది ఫేస్‌బుక్‌కు మంచి మసాలా ఐటంగా మారింది.

07/03/2016 - 01:16

జ్ఞానం, యోగం, సిద్ధి మానవ జీవితంలో పరిపూర్ణతను సాధించడానికి కావలసిన సాధనాలు. లౌకిక జీవనాన్ని సాగించే క్రమంలో మనస్సు, బుద్ధి చాంచల్యంతో ఐహిక, సుఖ భోగాదులు వాంఛించి ప్రాపంచిక సుఖాలపై మోజుతో తాత్కాలిక తృప్తినిచ్చే వాంఛల్ని తీర్చుకోవాలనే ఆరాటాన్ని పెంచుతాయి. ఈ అశాశ్వత భోగాలను అనుభవించిన తర్వాత మనిషి తనకు నిజమైన ఆత్మతృప్తి, మానసిక శాంతి లభ్యం కాలేదు అని పరితపిస్తాడు.

07/03/2016 - 01:14

దంష్ట్రాకరాళ దారుణ వక్త్రంతో అగ్నికీలలు వెలిగ్రక్కుతూ కృష్ణుడేడీ?! ఎక్కడ ఎక్కడ? అంటూ ఆకృత్య ద్వారాకానగరంలో ప్రవేశించి బీభత్సం సృష్టించింది. ద్వారకావాసులు ఎంతో సంక్షోభం పాలైనారు. కృష్ణ కృష్ణా! రక్షిం

07/03/2016 - 01:12

‘‘్భరణికి చాలా పెద్ద మిత్ర బృందమే ఉంది. ఎక్కువగా అతడితోపాటూ తిరిగేది మాత్రం రాజు, శ్రీను. వాళ్ళిద్దరూ భరణి క్లాస్‌మేట్లు. ముగ్గురూ కాలేజీలో ఒకరోజే జాయినయ్యారని చెప్పుకుంటుంటే విన్నాను. భరణి ఏం చేస్తున్నా, ఎక్కడికెళ్లినా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పక్కనే ఉంటారు’’.
‘‘ప్రస్తుతం వాళ్ళెక్కడ ఉన్నారో తెలుసా?’’

07/03/2016 - 00:59

క. మఱచినఁ దలఁ పెండఁగ నగు
నెఱుఁగని నాఁ డెల్లపాట నెఱిఁగింప నగున్
మఱి యెఱిఁగి యెఱుఁగ నొల్లని
కఱటిం దెలుపంగ ఁ గమల గర్భుని వశమే

07/03/2016 - 00:50

ఒక చాకలి ఒక్కొక్క షర్ట్, దుప్పటి, జీన్స్, చీరని ఉతకాలి. ప్రతీది ఉతికి ఆరేయటానికి పధ్నాలుగు నిమిషాలు పడుతుంది. షర్ట్ ఆరటానికి ఒక గంట పదకొండు నిమిషాలు పడుతుంది. దుప్పటి ఆరటానికి రెండు గంటల ఇరవై నిమిషాలు పడుతుంది. జీన్స్ ఆరటానికి మూడు గంటల ఆరు నిమిషాలు పడుతుంది. చీర ఆరటానికి ఇరవై ఏడు నిమిషాలు చాలు. ఒకేసారి అన్నీ బట్టలు ఆరిన తరువాత తీసుకొని ఎటువంటి జాప్యం లేకుండా ఇంటికి వెళ్లాలి అనుకున్నాడు.

07/03/2016 - 00:47

నిలువు
2.కుజుడు, బుధుడు, గురువు వీరిలో ఎవరైనా ఇదే! (2)
3.తిరగేసుకున్న నగ (3)
4.ఇదీ భూమే! (4)
5.ఇది గూడా భూమే! (3)
7.సముద్రము (4)
8.సమయము (2)
9.పూర్వం దీనిమీదే ఓనమాలు దిద్దబెట్టేవారు (3)
13.రాత్రి. సగం 19 అడ్డంలోదే! (4)
14.ఇల్లు కట్టాలంటే ఇటుకల పనీ ఉంది,
దీని పనీ ఉంది (3)
17.ఈ నాథుడికే తిక్కనగారు భారతం

07/03/2016 - 00:40

స్కూల్ నుంచి తిరిగి వచ్చిన సంచలన తను తెచ్చిన అయస్కాంతాన్ని తల్లికి చూపించి ఉత్సాహంగా చెప్పింది.
‘మా సైన్స్ టీచర్ ఇవాళ అయస్కాంతం పాఠం చెప్పింది. అది చాలా ఆసక్తిగా ఉంది. హోంవర్క్ చేయడానికి సైన్స్ లేబొరేటరీ నించి అందరికీ తలో అయస్కాంతాన్ని ఇచ్చింది. మళ్లీ రేపు తిరిగి ఇచ్చేయాలి. నేను హోంవర్క్ అయ్యాక టిఫిన్ తింటాను’
సంచలన డ్రాయర్లు వెదికి ఓ ఇనుప మేకుని, కొన్ని గుండు సూదులని తీసింది.

07/03/2016 - 00:36

కావాల్సిన పదార్థాలు

క్యాప్సికం - 4
ఉప్మా - రెండు కప్పులు
శెనగపిండి - 250 గ్రా.
బేకింగ్ సోడా పౌడర్ - 1 టీ స్పూను
వాము - పావు టీ స్పూను
మిరపపొడి - పావు టీ స్పూను
ఉప్పు - రుచికి సరిపడినంత
లెమన్ జ్యూసు - ఒక టేబుల్ స్పూను
నూనె - బజ్జీలు వేగడానికి సరిపడినంత

Pages