S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 06:53

తణుకు, జూన్ 17: గోవులను వధించేందుకు శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం నుండి తమిళనాడు పుల్లాసి పట్టణానికి లారీలో అక్రమంగా తరలిస్తున్న గోవులను శుక్రవారం స్థానిక గోసంరక్షణ సమితి సభ్యులు పట్టుకున్నారు. ఈమేరకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

06/18/2016 - 06:53

లక్నో, జూన్ 17: ఉత్తరప్రదేశ్‌లోని కైరానాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పట్టణం నుంచి వలస వెళ్లిపోయిన హిందూ కుటుంబాలను తిరిగి వెనక్కి రప్పించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని బిజెపి ఎమ్మెల్యే సంగీత్ సోమ్ యూపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో దీనే్న ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని ఎండగతామని ఆయన వెల్లడించారు.

06/18/2016 - 06:53

ఏలూరు, జూన్ 17 : బదిలీల బండి కదిలింది. కదలడమే కాకుండా పోస్టింగ్‌ల మంజూర్లతో పరుగులు మొదలెట్టింది. శనివారం నాటికి మొత్తం ప్రక్రియ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. శుక్రవారం నాటి పరిణామాల్లో బదిలీల జాతరలో దాదాపు నాలుగు శాఖల్లో పూర్తిస్థాయి పోస్టింగ్‌లు విడుదలయ్యాయి. మరో 32 శాఖల్లో ఈ బదిలీల ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగుతోంది.

06/18/2016 - 06:52

జంగారెడ్డిగూడెం, జూన్ 17: జిల్లాలో ప్రతిష్ఠాత్మక స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం ఛైర్మన్‌గా తాడేపల్లిగూడెంకు చెందిన ఇందుకూరి రంగరాజు (చంటిరాజు)ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

06/18/2016 - 06:52

అహ్మదాబాద్, జూన్ 17: గుల్బర్గ్ సొసైటీ మారణ కాండ సభ్య సమాజం చరిత్రతలోనే చీకటి రోజుగా అభివర్ణించిన ఇక్కడి సిట్ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మంది దోషులు జీవిత ఖైదు విధించింది. 2002 గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సందర్భంగా అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీపై దాడి చేసిన దుండగులు కాంగ్రెస్ ఎంపీ ఎహ్‌సాన్ జాఫ్రీ సహా 69 మందిని సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే.

06/18/2016 - 06:51

జంగారెడ్డిగూడెం, జూన్ 17: మోసాలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలవాటైపోయిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సిపి గిరిజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు విమర్శించారు. స్థానిక 2వ వార్డులో కాపు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం నాలుగోరోజుకు చేరాయి. ఈ దీక్షలను పిసిసి అధికార ప్రతినిధి జెట్టి గురునాధరావుతో కలసి బాలరాజు ప్రారంభించారు.

06/18/2016 - 06:51

ఏలూరు, జూన్ 17 : రాష్ట్రంలో తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు కుట్ర రాజకీయాలు చేయడం కూడదని టిడిపి జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్‌లు పేర్కొన్నారు. కాపు వర్గానికి తగిన న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.

06/18/2016 - 06:50

భీమవరం, జూన్ 17 : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో వెంటనే స్పందించకపోతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు హెచ్చరించారు. ఆచంట నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం శుక్రవారం మార్టేరులోని రెడ్డి కల్యాణ మండపంలో జరిగింది.

06/18/2016 - 06:50

ఏలూరు, జూన్ 17 : జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఇళ్ల పన్ను పెంచలేదని, సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఇళ్ల నిర్మాణాన్ని బట్టి పన్నుల విధానం అమలుచేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని ఇవోఆర్‌డిల సమావేశంలో గ్రామ పంచాయతీలలో అభివృద్ది కార్యక్రమాల అమలు తీరు, పంచాయితీలలో పన్నుల వసూలు, తదితర అంశాలపై కలెక్టరు సమీక్షించారు.

06/18/2016 - 06:44

తాళ్లపూడి, జూన్ 17: ఇసుక రవాణా చేస్తున్న క్వారీ లారీలు తమ గ్రామం మీదుగా వెళ్లడాన్ని రావూరిపాడు గ్రామస్థులు అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం గ్రామం మీదుగా ఇసుక లారీలు అధిక సంఖ్యలో రావడాన్ని చూసి లారీ రవాణాకు అభ్యంతరం తెలిపారు. అధిక లోడు ఉన్న లారీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనికితోడు ప్రధానంగా రహదారులు గోతులుపడి ఇబ్బందులెదురయ్యే అవకాశం ఉందని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.

Pages