S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2016 - 04:23

గుంటూరు, జూన్ 16: చిత్తూరు జిల్లా పలమనేరు వైసిపి ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి, గురువారం రాత్రి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. సిఎం చంద్రబాబు అమరనాథ్‌రెడ్డికి పచ్చకండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ టిడిపి ఆవిర్భావం నుంచి తాను పార్టీలో పనిచేసినట్లు గుర్తుచేశారు.

06/17/2016 - 04:21

రాజమహేంద్రవరం/కాకినాడ, జూన్ 16: దాదాపు పరిష్కారమైనట్టు కనిపించిన కాపు ఉద్యమనేత ముద్రగడ ఆమరణ దీక్ష వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. బుధవారం అధికారులు, కాపుజెఎసి నేతల ఆధ్వర్యంలో జరిగిన చర్చల అనంతరం వైద్యసేవలకు ముద్రగడ అంగీకరించిన సంగతి విదితమే.

06/17/2016 - 04:19

విజయవాడ, జూన్ 16: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలను క్రమశిక్షణతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఉంగుటూరు మండలం, ఆత్కూరు గ్రామంలో స్వర్ణ్భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం జిల్లాలోని అన్ని మండలాల్లో పదవ తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు ప్రతిభకు పురస్కార ప్రదాన కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

06/17/2016 - 04:17

పాడేరు, జూన్ 16: విశాఖ జిల్లా పాడేరు అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎఎస్‌పి) కె.శశికుమార్ (28) గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్‌తో తలపై కుడిభాగాన చెవివద్ద కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎఎస్పీ ఆత్మహత్య ఘటన విశాఖ గిరిజన ప్రాంతంలో తీవ్ర సంచలనం రెక్కిత్తించగా పోలీసు అధికారుల్లో అలజడి సృష్టించింది.

06/17/2016 - 04:13

న్యూఢిల్లీ, జూన్ 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెలాఖరులో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయనున్నట్టు తెలిసింది. అయితే ఈ మార్పులు ఏ స్థాయిలో ఉంటాయనేది స్పష్టం కావడం లేదు. పునర్‌వ్యవస్థీకరణ చేపట్టినా ఆశ్చర్యపడాల్సింది లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో మార్పులపై నాలుగైదు నెలల నుంచే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

06/17/2016 - 01:46

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 16: రాబోయే పుష్కరాల సందర్భంగా నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఈనెల 22నాటి కల్లా 90శాతం పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు.

06/17/2016 - 01:38

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 16: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలన వేగవంతమైన పాలనే కాకుండా అభివృద్ధిలో కూడా వేగం ఉందని, దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పిస్తున్నామన్నారు. కేంద్రంలోని బిజెపి పాలన గ్రామీణ, పేదల, మహిళా, యువకుల, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత కల్పిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడే ప్రభుత్వమని తెలిపారు.

06/17/2016 - 01:38

విజయవాడ, జూన్ 16: ప్రతి స్కూలు మంచి వాతావరణం, ఉన్నతమైన విద్య అందిస్తుందనే భావన తల్లిదండ్రుల్లో వచ్చే విధంగా పనిచేయాలని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిఇఓ, ఎంఇఓ, హెచ్‌ఎంలకు సూచించారు.

06/17/2016 - 01:35

పెనమలూరు, జూన్ 16: మత్స్య రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోందని, రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో హైజెనిక్ ఫిష్ మార్కెట్‌లు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే కోటి రూపాయలు మంజూరు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

06/17/2016 - 01:35

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 16: నాడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సపోర్టు చేసి నేడు సిగ్గుతో తలొంచుకుంటున్నామని, ఇంటి నుంచి బయటకు సైతం రాలేకపోతున్నామంటూ రాష్ట్రంలోని కాపు సామాజిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, కాపు రిజర్వేషన్ల అమలుపై ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిరసన దీక్ష నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులలో దీక్షాపరులు, ఇతర కాపు సామాజిక నేతలపై అధికార తెలుగుదేశం పార్టీ ప్రభు

Pages