S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 02:53

విజయవాడ (కార్పొరేషన్), మే 17: 25వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) మంచివాడన్న విషయం నగర ప్రజలందరికీ తెలిసిందేనని, విమాన ప్రయాణికురాలు చంటిపై చేసిన ఫిర్యాదు శోచనీయమంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు మరో కొత్త వాదనను తెర మీదకు తీసుకువచ్చారు.

05/18/2016 - 02:52

విజయవాడ, మే 17: వెనుకబడిన తరగతులలో 139 కులాలుండగా కేవలం 13 కులాలకే కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తున్నారని మిగతా కులాలకు సరైన ప్రాతినిధ్యం లేదని, అందరికీ ఉపయోగపడేలా బిసి సబ్ ప్లాన్‌కు నిధులు కేటాయించాలని మాజీ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్ కోరారు. భారతీయ జనతా ఒబిసి మోర్చా నగర కార్యవర్గం బిజెపి నగర కార్యాలయంలో మంగళవారం నియామక పత్రాలను అందుకొని ప్రమాణ స్వీకారం చేసింది.

05/18/2016 - 02:51

విజయవాడ, మే 17: చారిత్రక కలిగిన స్వరాజ్యమైదానాన్ని కాపాడుకోవటానికి అన్ని రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజా సంఘాలు కలిసి రావాలని సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్, కాశీనాథ్‌లు పిలుపునిచ్చారు. ‘సేవ్ పిడబ్ల్యుడి గ్రౌండ్స్’ నినాదంతో సిపిఐ, సిపిఎం నగర కమిటీల ఆధ్వర్యాన మంగళవారం స్థానిక గ్రౌండ్స్‌లో నిరసన ధర్నా జరిగింది.

05/18/2016 - 02:51

విజయవాడ, మే 17: ఉపాధి అవకాశాల విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికిగాను సరళీకృత విధానాలను అమలు చేస్తున్నామని స్థానిక మురళీఫార్చ్యున్ హోటల్‌లో మంగళవారం దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (డిఐసిసిఐ) సమన్వయ కర్తలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి రావెల కిషోర్ కిషోర్‌బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

05/18/2016 - 02:48

శ్రీకాకుళం, మే 17: అణువిద్యుత్ కేంద్రం నిర్మాణానికి చేయాల్సిన సర్వేకు మత్స్యకారులు అంగీకరించారు. అమరావతి కంటే మెరుగైన ప్యాకేజీకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు సుముఖత వ్యక్తం చేయడంతో అణువణువూ సర్వేకు గంగపుత్రులు సహకరిస్తామని భరోసా ఇచ్చారు.

05/18/2016 - 02:47

పాలకొండ (టౌన్), మే 17: ప్రత్యేక హోదా నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రజల హక్కని, సాధించి తీరుతామని తెలుగు దేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు స్పష్టం చేశారు. మంగళవారం ఒక ప్రైవేటు కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు.

05/18/2016 - 02:48

శ్రీకాకుళం(టౌన్), మే 17: కృష్ణా, గోదావరి నదులపైన తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేపట్టిన జలదీక్షకు మద్దతుగా మంగళవారం స్థానిక ఏడురోడ్ల కూడలిలో వైకాపా శ్రేణులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.

05/18/2016 - 02:46

శ్రీకాకుళం, మే 17: స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కొరకు దత్తత తీసుకున్న స్వచ్ఛంద సంస్థలు ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో స్మార్ట్‌విలేజ్‌ల నిర్మాణంపై అధికారులు, స్వచ్చందసంస్థలతో ఆయన సమీక్షించారు.

05/18/2016 - 02:45

ఎచ్చెర్ల, మే 17: గత విద్యా సంవత్సరంలో పీజీ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన పలువురు అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా అవార్డులతో పురస్కరించింది. ఈ అవార్డులు అందుకున్న అభ్యర్థులకు రూ.20వేలు చెక్కులను అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఇంచార్జ్ వైస్ చాన్సలర్ ఎం.చంద్రయ్య మంగళవారం ఆయన ఛాంబర్‌లో అందజేశారు. ఇదే స్ఫూర్తితో ఉజ్వల భవిత సాధించాలని ఆయన సూచించారు.

05/18/2016 - 02:45

రాజాం, మే 17: మండలం దోసరి రామినాయుడు వలసకు చెందిన బిఎస్‌ఎఫ్ జవాన్ జి.రామకృష్ణ (28) మృతి చెందినట్లు సమాచారం అందటంతో గ్రామంలో విషాదం నెలకొంది. అసొం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ తుపాకి మిస్ ఫైర్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగి మృతి చెందినట్లు అధికారులు సమాచారమిచ్చారు. తల్లిదండ్రులు తవిటినాయుడు, కామేశ్వరమ్మ, సోదరి హైమా బోరున విలపించారు.

Pages