S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 02:44

సంతబొమ్మాళి, మే 17: దేశంలో సోలార్ విద్యుత్ సరఫరాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండోస్థానానికి తీసుకువెళ్లేందుకు సిఎం చంద్రబాబునాయుడుతోపాటు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని ఎపి ఇపిడిసి ఎల్ చీఫ్ మేనేజరు కె ఎస్ ఎన్ మూర్తి అన్నారు. మంగళవారం ఆయన సంతబొమ్మాళి విద్యుత్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. ప్రస్తుతం దేశ ప్రధాని సొంత రాష్టమ్రైన గుజరాత్‌కు సోలారు వెలుగులతో ప్రథమ స్థానంలో ఉందన్నారు.

05/18/2016 - 02:44

శ్రీకాకుళం, మే 17: గృహానిర్మాణశాఖ ఇంజనీరింగ్ అధికారుల పనితీరు బాగాలేదంటూ కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం మండిపడ్డారు. ఎ.ఇ., డి.ఇ.లు రోజువారీ ప్రగతి నివేదికను తు.చ.తప్పకుండా పంపాలని అలా పంపని వారు సెలవుపై వెళ్ళిపోవచ్చునంటూ హుకుం జారీ చేశారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద పట్టణ ప్రాంతాల్లో గృహాలు నిర్మించడానికి స్థలాలను పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఇంజనీర్లును ఆదేశించారు.

05/18/2016 - 02:43

ఎచ్చెర్ల, మే 17: డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫలితాలను మంగళవారం అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఇంచార్జ్ వైస్ చాన్సలర్ ఎం.చంద్రయ్య విడుదల చేసారు. 36.34శాతం ఉత్తీర్ణత సాధించారు. బి ఏ గ్రూపు నుండి 1609మంది హాజరు కాగా 494మంది ఉత్తీర్ణులయ్యారు. బీ ఎస్సీ నుంచి 5146మంది హాజరు కాగా 1732మంది ఉత్తీర్ణులయ్యారు. బీ కాం. కు చెందిన అభ్యర్థులు 2234మంది పరీక్షలు రాయగా 945మంది ఉత్తీర్ణతసాధించారు.

05/18/2016 - 02:43

శ్రీకాకుళం(కల్చరల్), మే 17: పట్టణంలోని పిఎన్ కాలనీలోని నారాయణతిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక కల్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం శ్రీవారు స్వర్ణకవచం ధరించి భక్తులకు ఆరుదైన దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రధానార్చకుడు జి.శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

05/18/2016 - 02:42

గార, మే 17: మండలం బూరవెల్లి గ్రామం వద్ద వంశధార నదిలోపడి మార్పు ఉదయ్‌కుమార్(4) మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలియజేసిన వివరాల మేరకు కొత్తూరు సవిడిగాం గ్రామానికి చెందిన ఉదయకుమార్ తన తాతగారు ఇంటికి గ్రామదేవత ఉత్సవం సందర్భంగా బూరవెల్లి వచ్చాడు. నదీ స్నానంకై మంగళవారం సాయంత్రం వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు.

05/18/2016 - 02:42

లావేరు, మే 17: వైసిపి అధినేత జగన్ చేపట్టిన జలదీక్షకు మండల వైసిపి మద్దతు తెలిపింది. సుభద్రాపురం జంక్షన్‌లో మంగళవారం పార్టీ నేతలు జలదీక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగాలని ఆక్షాంక్షిస్తూ మద్దతు కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రప్రభుత్వం స్పందించి వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా సజావుగా విడుదలయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

05/18/2016 - 02:40

మద్దిపాడు, మే 17 : మల్లవరం కొండపై వేంచేసి ఉన్న శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం ఆలయ పురోహితులు రవికుమార్, రాజశేఖరాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చల్లని మల్లువస్త్రంపై గరుత్‌మంతుని చిత్రాన్ని గీసి పూలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.

05/18/2016 - 02:40

ఒంగోలు, మే 17 : బ్యాంకు అధికారులు వివిధ కార్పొరేషన్ల ద్వారా వారికి నిర్దేశించిన రుణ లక్ష్యాలను శనివారం లోగా పూర్తి చేయాలని కలెక్టర్ సుజాత శర్మ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం ఉదయం స్థానిక సిపివో సమావేశ మందిరంలో జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. బ్యాంకర్లు రైతులకు పంటరుణాలు అందించేందుకు చొరవ చూపాలన్నారు.

05/18/2016 - 02:39

ఒంగోలు,మే 17: అధికారాలు లేవు, నిధులు లేవంటూ జిల్లాలోని పాలక, ప్రతిపక్ష పార్టీలకు చెందిన జడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. మేం వున్నామనే సంగతి ఎవరికైనా అసలు గుర్తుందా అంటూ వాపోయారు. జడ్‌పిటిసి సభ్యులకు జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు సైతం వంతపలికి వారికి మద్దతు ప్రకటించారు.

05/18/2016 - 02:38

ముండ్లమూరు, మే 17 : అందరూ హాయిగా ఆరుబయట నిద్రించారు.. దొంగలు కూడా గుట్టుచప్పుడు కాకుండా తమ పని కానిచ్చేశారు. ఓ ఇంట్లో దొంగలు పడి ఐదులక్షల మేర వస్తువులు, నగదును దోచుకెళ్ళిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మండలంలోని శంకరాపురం గ్రామంలో మేడికొండ శివశంకర్‌రావు ఇంట్లో సుమారు మూడు లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలు, రెండు లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు.

Pages