S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/04/2016 - 00:36

హైదరాబాద్, మే 3: నీటి సంరక్షణ కోసం చేపడుతున్న ఇంకుడు గుంతల తవ్వకాల కార్యక్రమాలను ప్రతి ఒక్కరు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం కలెక్టరేటు నుండి ఎంపిడిఓలు, తహసిల్దార్లు, ఓఎస్‌డిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై సమీక్షించారు.

05/04/2016 - 00:35

హైదరాబాద్, మే 3: నగరంలోని లక్డికాపూల్‌లో గల అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో (ఏజి ఆఫీస్) భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైన మంటలు మంగళవారం మధ్యాహ్నం వరకు ఎగసిపడ్డాయి.

05/04/2016 - 00:33

హైదరాబాద్, బేగంపేట, మే 3: మహానగరాల్లో రోజురోజుకీ పెరుగుతున్న పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు నగరవాసులు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందని వక్తలు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హిమాయత్‌నగర్‌లోని అశ్విని ఎలర్జీ సెంటర్, నగర ట్రాఫిక్ పోలీసు శాఖ సంయుక్త్ధ్వార్యంలో ఉదయం నెక్లెస్‌రోడ్డులో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.

05/04/2016 - 00:32

హైదరాబాద్, మే 3: మహానగర ప్రజలకు జిహెచ్‌ఎంసి అందిస్తోన్న పారిశుద్ధ్య సేవలు మున్ముందు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే ఇంటింటి నుంచి చెత్తను సేకరించేందుకు సమకూర్చిన ఆటో టిప్పర్ల డ్రైవర్లు, సహాయకులు ప్రతి ఇంటి నుంచి రూ. 50 చెత్త ఛార్జీలుగా వసూలు చేసుకోవాలని వౌఖిక ఆదేశాలు జారీ చేసిన జిహెచ్‌ఎంసి అధికారులు దశల వారీగా రాంకీ ఒప్పందాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

05/04/2016 - 00:31

హైదరాబాద్, మే 3: మహానగరంలో వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, అభివృద్ధి పనుల కారణంగా అనివార్యమైన స్థల సేకరణలో పచ్చదనం కనుమరుగవుతోంది. చెట్ల నరికివేతను నియంత్రించటంతో పాటు అయిదు అడుగుల ఎత్తు కల్గిన చెట్లను తప్పని పరిస్థితుల్లో నరికివేయాల్సి వస్తే వాటిని మరో చోట మళ్లీ ఏర్పాటు చేసే దిశగా జిహెచ్‌ఎంసి అధికారులు దృష్టి సారించారు.

05/04/2016 - 00:27

దేవరకొండ, మే 3: దేవరకొండ మండలం పడ్మట్‌పల్లి గ్రామంలో సోమవారం రాత్రి టి ఆర్ ఎస్, సిపి ఐ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామపంచాయతి నల్లా విషయంలో చోటు చేసుకున్న వివాదం చిలికిచిలికి గాలివానగా మారడంతో టి ఆర్ ఎస్, సిపి ఐ కార్యకర్తలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో టి ఆర్ ఎస్ కు చెందిన ముగ్గురు, సిపి ఐ కి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

05/04/2016 - 00:26

సూర్యాపేట టౌన్, మే 3: రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తున్నా కరవు సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. కరవు పర్యటనలో భాగంగా మంగళవారం మండలపరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో ఎండిపోయిన తోటలను ఆయన పరిశీలించారు.

05/04/2016 - 00:25

నల్లగొండ, మే 3: మెదక్ జిల్లాలో అమలవుతున్న మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్, స్వచ్ఛ భారత్ పథకాల పురోగతిని మంగళవారం ప్రభుత్వ విప్ గొంగిడి సునిత ఆధ్వర్యంలోని జిల్లా అధికారుల బృందం పరిశీలించింది.

05/04/2016 - 00:24

నల్లగొండ టౌన్, మే 3: నల్లగొండ మున్సిపాల్టీలో జరుగుతున్న వరుస అక్రమాలు, రికార్డులు, పన్ను వసూళ్ల రశీద్ పుస్తకాల మాయం విచారణ నేపధ్యంలో సిసిఎస్ పోలీసులు మంగళవారం మున్సిపాల్టీలో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ రాములు నేతృత్వంలోని విచారణ బృందం రికార్డు పుస్తకాలను, రశీద్ పుస్తకాలన్నింటిని స్వాధీనం చేసుకుని వ్యాన్‌లో తరలించుకుపోయారు.

05/04/2016 - 00:24

యాదగిరిగుట్ట,మే 3:యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవస్దానం కొండపైన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం శ్రీ స్వామి వారికి అమ్మవారికి ఆచార్యులు విషేశ పూజలు నిర్వహించారు. శ్రీ స్వామి వారికి అభిషేఖం నిర్వహించి శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు స్వామి వారికి అమ్మవారికి ఘనంగా లక్షపుష్పార్చన నిర్వహించారు.

Pages