S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2016 - 21:06

రవి గాంచని చోట కవి గాంచునన్నది కవిత్వ విస్తృతికి, గాఢతకు,
కాలాతీతమైన సమకాలీనతకు దర్పణం. వర్తమానంలో భవితను చూసే
దూరదృష్టి కవికి ఉంటుంది. సమాజాన్ని భిన్న కోణాల్లో స్పృశించి దాని
స్వభావాలను భిన్న పాత్రలతో చిత్రీకరించగలిగే సృజన కూడా కవి సొంతమే. కవి కలానికి ఉండే ఆలోచనల బలం విశ్వజనీన పాత్రలకు జీవం పోస్తుంది. కాలమేదైనా, ప్రాంతమేదైనా... భాష ఏదైనా ఆ పాత్రలు అజరామరంగా,

05/01/2016 - 21:02

సాంకేతికత అభివృద్ధి చెందని రోజుల్లో కవిత్వ పుస్తకాలని గ్రంథాలయాల్లో చదువుకునేవారు. ప్రతి గ్రామము, పట్టణం, మండలంలో విరివిగా గ్రంథాలయాలు ఉండేవి కాబట్టి వారంలో ఒక రోజు కవిత్వ పుస్తకాన్ని చదవడానికి కేటాయించేవారు. ఔత్సాహిక కవులు తమ కవితలను ఆయా పత్రికలకు తమ చిరునామాతో రాసి పంపేవారు. అవి వచ్చేదాకా రోజుల తరబడి ఎదురుచూసేవారు.

05/01/2016 - 20:59

ట్రాజెడీ, కామెడీ అన్నింటా షేక్స్‌పియర్‌ది అందెవేసిన చెయ్యి.
శతాబ్దాల నాటి పరిణామాలను కళ్లకు కట్టి.. భవిష్యత్ కళ్లు
తెరిపించిన నాటకాలివి. వేటికవే సాటి. మానవ నైజాన్ని
నిగ్గుదేల్చిన రంగస్థల దృశ్యకావ్యాలు.

05/01/2016 - 20:55

మానవ జాతి మనుగడ ప్రారంభించిన క్షణం నుంచీ - ఎన్ని సిద్ధాంతాలు ఎన్ని విధాలుగా తలెత్తాయో - ఎన్ని రకాలుగా తల వాల్చాయో; ఏ సిద్ధాంతాలు యుద్ధాలు - ఉత్పాతాలు సృష్టించి ఎంత రక్తపాత కారకాలయ్యాయో - ప్రజలే పాత్రధారులు. ప్రజలే కార్యకారణ సంబంధ వస్తుకాండము. పరిణామం కూడా పరిణామగ్రస్తమనే యదార్థ జ్ఞానం లేని మూర్ఖుల చేతుల్లోబడి ఎన్ని విలువలు నాశనమయ్యాయో మళ్ళీ ప్రజలే కారణం.

05/01/2016 - 20:53

మనమంతే..
భూమిని ఇచ్చేసి
భుక్తిని అడుక్కుంటాం.
చెట్టుని కొట్టేసి
నీడని కొనుక్కుంటాం.
చెరువుని అమ్మేసి
నీటిని వెదుక్కుంటాం.
మనమంతే..
తలని తాకట్టుపెట్టి
ముఖాన్ని వడ్డీకి తిప్పుతాం
దరిద్రాన్ని నెత్తికెత్తుకుని
తలరాతని తిట్టుకుంటాం.
వౌనంగా ఉన్నవాడిని
మాట్లాడమంటాం
మాటలాడే వాడితో
పోట్లాటలకి దిగుతాం.

05/01/2016 - 20:50

ఆతడి వాడి వేడి వ్రేళ్లు నిప్పులతో ఆటలాడతాయ
ఎగసిపడే మంటల్ని పొదివి పట్టుకుంటాయ
ఆతడి మరిగిన రక్తం కరిగిన లోహద్రవంతో
పోటీపడి ఉరకలెత్తుతుంది

05/01/2016 - 20:48

ద్రవ్యోల్బణం ‘జాతీయం’ చేయబడింది!
ధరలు అభివృద్ధిపథంలో...
కరెన్సీ ఖరీదు దినదినం తగ్గు
ప్రజల జీవన ప్రమాణం
ధర్మాసుపత్రిలో జీవనరేఖ
భూకంప లేఖిని గీస్తున్న గీతలా
పైకీ కిందకు ఊగిసలాడుతోంది
ఎక్కువ ఓట్లు పొందినవారు
ఎక్కువ ధరలు చెల్లించే స్థితిలో ఉన్నారు
పాపం పేదవాడు
ఓటుకు రేటు తగ్గింది
తప్పు చేశానేమోననీ
తప్పటడుగు వేశానేమోననీ

05/01/2016 - 20:47

అక్షరమా....!!
నా మదిలో మొలిచిన లక్షణమా
ఏకాంత హృదయాన
పంజరాలు పగలగొట్టిన స్వేచ్ఛా విహంగం

జన పథాన అడుగుజాడ
జయ పథాన మువ్వల సవ్వడి సంగీతం
రక్తసిక్త చరిత్రలోన
రాతి గుండె శాసనం
స్వేదమే వేదమై ఎగసిన జయ కేతనం!

05/01/2016 - 17:19

న్యూదిల్లి:అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇచ్చిన ‘కరస్పాండెంట్ డిన్నర్’కు బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా హాజరయ్యారు. మరికొద్ది రోజుల్లో పదవీకాలం పూర్తికానున్న సందర్భంలో అధ్యక్షుడిగా ఇచ్చిన చివరి విందు కార్యక్రమానికి ఒబామా, మిషెల్ దంపతులు ప్రియాంకను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఏటా జర్నలిస్టులు, ప్రొడ్యూసర్లు, కెమెరామెన్‌కు ఇచ్చే ఈ విందుకు విశేష ప్రాధాన్యం ఉంది.

05/01/2016 - 17:16

న్యూదిల్లి:అథోజగత్తు నాయకుడు చోటా రాజన్‌ను చంపేస్తామంటూ ఆయన బందీగా ఉన్న తీహార్ జైలు అధికారికి ఓ బెదరింపు ఎస్‌ఎమ్‌ఎస్ వచ్చింది. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ రాజన్‌ను హతమార్చేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తుండగా ఆయన తప్పించుకుంటూ వచ్చాడు. కొన్ని నెలల క్రితం ఇండోనేషియాలని బాలిలో పోలీసులకు పట్టుబడ్డ రాజన్‌ను తీహార్ జైలులో ఉంచారు. కాగా ఆయనపై నమోదైన పలు కేసుల్లో విచారణ కొనసాగుతోంది.

Pages