S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2016 - 08:13

ఉహాన్ (చైనా), ఏప్రిల్ 29: ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో స్థిరంగా ముందుకు సాగుతున్న ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చైనాలోని ఉహాన్‌లో జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో ఆమె చైనాకు చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ షిగ్జియాన్ వాంగ్‌పై వరుస గేముల తేడాతో విజయం సాధించింది.

04/30/2016 - 08:09

హైదరాబాద్, ఏప్రిల్ 29: భాగవతాన్ని తెలుగులో రచించిన బమ్మెర పోతన్న గ్రామమైన బమ్మెర, బసవ పురాణం వంటి ప్రసిద్ధ గ్రంధాలను రచించిన పాల్కురికి సోమనాథుడి గ్రామమైన పాలకుర్తి, వాల్మిడి గ్రామాలను కల్చరల్ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి పర్చాలని నిర్ణయించినట్టు పర్యాటకశాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ తెలిపారు. ఈ మూడు గ్రామాలు కూడా వరంగల్ జిల్లాలోనే ఉన్నాయి.

04/30/2016 - 08:08

హైదరాబాద్, ఏప్రిల్ 29: వైద్యం కోసం వెళ్లిన ఓ సినీ నిర్మాతపై ఔషధ ప్రయోగం జరిగింది. కోమాలోకి వెళ్లిన ఆ నిర్మాత మరుసటి రోజు తేరుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. ‘హార్మోన్స్’ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ఎస్‌ఎస్ నాయక్ ఇటీవల వైద్యం కోసం మంథన్ డయాబెటిస్ సెంటర్‌కు వెళ్లారు.

04/30/2016 - 08:07

హైదరాబాద్, ఏప్రిల్ 29: సచివాలయంలో పదవీ బాధ్యతల స్వీకరణలతో శుక్రవారం సందడి నెలకొంది. మంత్రుల శాఖలలో ఇటీవల జరిగిన చేర్పులు, మార్పుల మేరకు కొత్తగా అప్పగించిన శాఖల బాధ్యతలను మంత్రులు చేపట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్, సహకారశాఖ మంత్రిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి పదవీ బాధ్యతలను చేపట్టారు.

04/30/2016 - 08:07

హైదరాబాద్, ఏప్రిల్ 29: ఈ ఏడాది జూన్ వరకు దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలోని దత్తాత్రేయ నవగ్రహ ఆలయం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జునరెడ్డి ఈ మేరకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిందిగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.

04/30/2016 - 08:06

హైదరాబాద్, ఏప్రిల్ 29: జూనియర్ సివిల్ జడ్జీల నియామకానికి 2014లో జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు ఎంపికైన అభ్యర్థుల నియామకానికి హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీనియర్ న్యాయవాది ఎస్ సత్యంరెడ్డి మరో ఇద్దరు దాఖలు చేసిన మూడు వేర్వేరు పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి బోసలె, జస్టిస్ పి నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.

04/30/2016 - 08:06

హైదరాబాద్, ఏప్రిల్ 29: రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన లాకప్ డెత్‌పై జుడిషియల్ మెజిస్ట్రేట్‌చే విచారణ జరిపించాలని హైకోర్టు జస్టిస్ రామలింగేశ్వర రావు శుక్రవారం ఆదేశించారు. 2007లో మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఇబ్రహీం అనే వ్యక్తి లాకప్‌లో మృతి చెందాడు. ఈ మేరకు న్యాయ విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని కోరుతూ ఇబ్రహీం భార్య నజ్మా కోర్టును ఆశ్రయించింది.

04/30/2016 - 08:05

హైదరాబాద్, ఏప్రిల్ 29: వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశపరీక్షలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సేవకుల వంశీ మొదటి ర్యాంకు సాధించారు. ఏప్రిల్ 6 నుండి 17వ తేదీ వరకూ భారతదేశంలో 118 నగరాలతో పాటు దుబై, కువైట్, మస్కట్‌లలో కూడా ఈ ప్రవేశపరీక్షను నిర్వహించారుస. విట్ ఫలితాలను గురువారం నాడు ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాధ్ ప్రకటించారు.

04/30/2016 - 08:04

హైదరాబాద్, ఏప్రిల్ 29: ‘పాలేరు అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికల్లో మాకు పరోక్షంగా మద్దతు ఇచ్చారు సంతోషం...అలాగే ప్రచారమూ చేయండి..’ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ అధినేతలను కోరనున్నది.

04/30/2016 - 08:04

హైదరాబాద్, ఏప్రిల్ 29: ప్రైవేటు విద్యాసంస్థల్లో తనిఖీలు విద్యాశాఖ అధికారులే చేపట్టాలి తప్ప పోలీసులతో కాదని టిపిసిసి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.టి.పాపిరెడ్డిని కోరింది. ఎంతోమందిని విద్యావంతులు చేసి ఉన్నత స్థానానికి పంపిన ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయవద్దని కోవద్దని కోరింది.

Pages