S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2016 - 08:03

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ ఆర్టీసిని లాభాల బాటలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా పని చేస్తానని ఆ సంస్థకు తొలి చైర్మన్‌గా నియమితులైన సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తనపై ఉంచి అప్పగించిన బాధ్యతను తూచా తప్పకుండా నిర్వహిస్తానని అన్నారు. శుక్రవారం నాడిక్కడ బస్‌భవన్‌లో టిఎస్‌ఆర్టీసి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

04/30/2016 - 08:02

హైదరాబాద్, ఏప్రిల్ 29: రాష్ట్రంలో వర్షాభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల వల్ల అవసరమైన చోట పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్టు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. పాడి, మత్స్య, పశుసంవర్ధకశాఖల మంత్రిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత సంబంధిత శాఖల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

04/30/2016 - 07:58

ధర్మపురి, ఏప్రిల్ 29: కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మునె్నన్నడూ లేని విధంగా తాగునీటికి కలుగుతున్న ఇబ్బందులు వర్ణానాతీతంగా మారాయి. క్షేత్రాన్ని ఆనుకుని ప్రవహించే జీవనది గోదావరి కనీవినీ ఎరుగని రీతిలో ఎండిపోవడం, నీరు గణనీయంగా తగ్గడంతో స్థానికులు, ఇక్కడికి వచ్చే భక్తులు కష్టాలను అనుభవిస్తున్నారు.

04/30/2016 - 07:58

ఖమ్మం, ఏప్రిల్ 29: టిఆర్‌ఎస్ ప్రజలను మోసం చేస్తూ ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు ఆరోపించారు.

04/30/2016 - 07:57

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆరోపించారు. శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై జరిగిన చర్చలో కేశవరావు పాల్గొన్నారు.

04/30/2016 - 07:57

హైదరాబాద్, ఏప్రిల్ 29: దేశంలోనే తెలంగాణ ధనిక రాష్టమ్రని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పలు సార్లు ప్రకటించినా, ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని టి.పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. దీంతో ఈ పథకం మూలన పడే ప్రమాదం ఉందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి 300 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉందన్నారు.

04/30/2016 - 07:56

హైదరాబాద్, ఏప్రిల్ 29: పలు ప్రభుత్వ శాఖల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో నిర్మాణ పనులు సాగుతుండడం వల్ల సిబ్బంది సమస్య తలెత్తింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తాత్కాలిక అవసరాలకు పెద్ద ఎత్తున కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించుకోవాలని నిర్ణయించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ విషయం తెలిపారు.

04/30/2016 - 07:55

హైదరాబాద్, ఏప్రిల్ 29: నీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పనులన్నింటినీ సమన్వయం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. జిల్లాల వారిగా కలెక్టర్లు అధికార యంత్రాంగం అంతటినీ సమన్వయం చేయాలని చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శుక్రవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

04/30/2016 - 07:51

పెళ్లకూరు, ఏప్రిల్ 29: బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ ఆయన స్ఫూర్తితో విద్యనభ్యసించిన తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేస్తున్న తన పట్ల ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీల నాయకులు వివక్ష చూపడం సహేతుకం కాదని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

04/30/2016 - 07:51

హైదరాబాద్, ఏప్రిల్ 29: భారత రైల్వే శాఖ పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టింది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లలో కనీస అవసరాల ఏర్పాట్లు చేపట్టింది. తాగునీరు, మరుగు దొడ్లు, ప్లాట్ ఫాంల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టింది.

Pages