S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/15/2015 - 11:37

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెంలో మంగళవారం తెల్లవారుజామున ఓ ఇంటి గోడ కూలి దంపతులు మరణించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

12/15/2015 - 11:37

విజయవాడ: ఇక్కడ కాల్‌మనీ పేరిట అక్రమాలకు పాల్పడుతున్న వడ్డీ వ్యాపారుల అరాచకాలు బయటపడటంతో ఎ.పి. పోలీసులు రాష్టవ్య్రాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లపై మంగళవారం ఉదయం దాడులు ప్రారంభించారు. విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో వ్యాపారుల ఇళ్లల్లో భారీ ఎత్తున ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

12/15/2015 - 11:36

తిరుమల: తిరుమల దేవస్థానంలో దాతలకు అందించాల్సిన సుమారు 60 వేల లడ్లను టిటిడి ఉద్యోగి ఒకరు కాజేసి బ్లాక్‌లో విక్రయించినట్లు నిఘా విభాగం గుర్తించింది. ఏడాది కాలంగా ఈ అక్రమం జరుగుతున్నట్లు తేలడంతో డోనర్ సెల్‌లో పని చేస్తున్న వెంకటరమణ అనే ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఇవో ఆదేశాలు జారీ చేశారు.

12/15/2015 - 11:36

పాట్నా: బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల మంగళవారం ఉదయం సుమారు 10 సెకన్లపాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బీహార్‌లోని గయ, జుమాయి, జార్ఖండ్‌లోని ధన్‌బాద్, తదితర ప్రాంతాల్లో భూమి కంపించటంతో జనం ఇళ్ళల్లోంచి బయటకు పరుగులు తీశారు.

12/15/2015 - 11:35

దిల్లీ: దిల్లీ సచివాలయంలో మంగళవారం ఉదయం సిబిఐ అధికారులు ఆకస్మికంగా దాడులు జరిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన ముఖ్య కార్యదర్శి ఛాంబర్‌లో కూడా సోదాలు జరిగాయి. రాజకీయ కక్షతోనే ప్రధాని మోదీ సిబిఐ దాడులు జరిగేలా ఆదేశించారని దిల్లీ సి.ఎం. కేజ్రీవాల్ ఆరోపించారు.

12/15/2015 - 11:35

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

12/15/2015 - 11:34

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవోపేతంగా జరిగింది. ఈ నెల 21న జరిగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 500 మంది సిబ్బందితోపాటు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు ఉదయం 11 గంటల వరకు శ్రీవారి దర్శనాన్ని రద్దు చేశారు.

12/15/2015 - 04:48

డ్యునెడిన్, డిసెంబర్ 14: శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌ని న్యూజిలాండ్ 122 పరుగుల భారీ తేడాతో సొంతం చేసుకుంది. మ్యాచ్ నాలుగోరోజు, ఆదివారం ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడగా, చివరి రోజున అదే పరిస్థితి ఉంటుందేమోనని ఆశించిన లంకకు నిరాశ తప్పలేదు. 405 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక ఆదివారం ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది.

12/15/2015 - 04:37

విజయవాడ, డిసెంబర్ 14: ఆధ్యాత్మిక, సాంస్కృతిక, విద్య, వినోద, విజ్ఞాన, ఆహార ఫెస్టివల్స్ లాంటి 9 మెగా ఫెస్టివల్స్‌ను 9 ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల్లో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పర్యాటక శాఖ ప్రగతిని సమీక్షిస్తూ అన్నారు. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్, సింగపూర్ ఫెస్టివల్ తరహాలో ఏటా భారీగా వేడుకలు నిర్వహించాలని సూచించారు.

12/15/2015 - 04:30

త్రిచూర్, డిసెంబర్ 14: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో బిజెపి అధికారంలోకి రాగలదన్న ధీమాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న కాంగ్రెస్, సిపిఎం సారథ్యాల్లోని రెండు ఫ్రంట్‌ల ఆధిపత్యాన్ని బిజెపి అధిగమిస్తుందని, ప్రస్తుతం చాలా బలమైన శక్తిగా మూడో స్థానంలో ఉందని మోదీ తెలిపారు. ఈ మూడో శక్తిని శివుని మూడో కన్నుతో పోల్చారు.

Pages