S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2016 - 06:43

కోల్‌కతా, ఏప్రిల్ 29: పశ్చిమబెంగాల్‌లో శనివారం అయి దో దశ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ జరుగనున్న 53 నియోజకవర్గాలలో సుమారు 90వేల మంది కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలను మోహరించనున్నారు. నేరశిక్షాస్మృతిలోని సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు అమలు చేయనున్నారు.

04/30/2016 - 06:40

వాషింగ్టన్, ఏప్రిల్ 29: అమెరికా పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించడం ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి జరుపుకునే కృషికి మరింత జవసత్వాలను అందిస్తుందని అధికార, ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంటు సభ్యులు ముక్తంఠంతో అభిప్రాయ పడ్డారు.

04/30/2016 - 06:38

పోర్ట్ మోరెస్‌బి, ఏప్రిల్ 29: అసహనం, తీవ్రవాదం జాడ్యాలతో సతమతమవుతున్న ప్రపంచానికి నేటికీ మహాత్మాగాంధీ బోధనల ఆవశ్యకత ఎంతయినా ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ బోధించిన శాంతియుత సహజీవనం, పరస్పర గౌరవం వంటి నిజమైన విలువలు నేటికీ అనుసరణీయమని ఆయన అంతర్జాతీయ సమాజానికి గుర్తుచేశారు.

04/30/2016 - 06:35

ముంబయి, ఏప్రిల్ 29: మహారాష్టల్రోని ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో శుక్రవారం బాంబే హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. 31 అంతస్తుల భవనాన్ని కూల్చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను న్యాయస్థానం ఆదేశించింది. దక్షిణ ముంబయిలోని కొలాబా ప్రాంతంలో కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికుల కోసం ఆదర్శ హౌసింగ్ సొసైటీలో ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించారు.

04/30/2016 - 03:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29:ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా, హార్థికంగా కేంద్రం ఆదుకుంటున్నందున ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరీభాయి చౌదరి తేల్చి చెప్పారు.

04/30/2016 - 03:16

దాచేపల్లి, ఏప్రిల్ 29: ‘రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్ పెద్దలు మనల్ని కట్టుబట్టలతో బయటకు పంపించారు. నిధులు లేవు. రాజధాని లేదు. కొత్తగా వచ్చిన కేంద్ర ప్రభుత్వం అయినా మనల్ని ఆదుకుంటుందని ఆశించాం. కాని కేంద్రం సహకరించటం లేదు.

04/30/2016 - 06:28

గుంటూరు, ఏప్రిల్ 29: కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి హక్కుపరంగా రావాల్సిన వాటాను ఎన్ని అవరోధాలు ఎదురైనా సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. భూగర్భజలాల పెంపుదల, నీరు-ప్రగతి, పంట- సంజీవని, జలవనరుల సంరక్షణకు సంబంధించిన అంశాలపై శుక్రవారం సీఎం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

04/30/2016 - 03:04

విజయవాడ, ఏప్రిల్ 29: హైదరాబాద్ నుంచి ఉన్నపళంగా అమరావతికి వెళితే ఇళ్ళు ఎక్కడ వెతుక్కోవాలి? ఆగస్టులోగా తరలిరావడానికి సిద్ధమవుతున్న ఉద్యోగుల్ని వెంటాడుతున్న భయమిదే. అయితే ఆ భయం వారికి అక్కర్లేదు. వారికోసం అమరావతిలో అద్భుతమైన ఇళ్లు తయారవుతున్నాయి. జూన్‌లో అమరావతికి వచ్చే ఉద్యోగుల కోసం ఇళ్ళను సిద్ధం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది.

04/30/2016 - 02:39

హైదరాబాద్, ఏప్రిల్ 29:ఈసారి వర్షపాతం బాగుంటుందని 106శాతం వర్షపాతం ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్లచంద్రశేఖర్‌రావు తెలిపారు. మే 15న మరోసారి వాతావరణ అధ్యయన నివేదిక వెలువడిన తరువాత మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.

04/30/2016 - 02:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి అర్హతా పరీక్ష (నీట్) నిర్వహణపై ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలంటూ కేంద్రం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.

Pages