S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2016 - 00:35

గార్ల, ఏప్రిల్ 29: మండలం పరిధిలోని గోపాలపురం గ్రామంలో నూతన ఆలయం, శ్రీలక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. గ్రామస్తులు ఐక్యంగా విరాళాలు సేకరించి భూసేకరణ గావించటంతో పాటు ఎంతో ఆధునాతనంగా ఆలయాన్ని నిర్మించి సుందరమూర్తులైన లక్ష్మీతిరుపతమ్మ, గోపయ్య విగ్రహాలను తెప్పించి వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయంలో ప్రతిష్ఠించారు.

04/30/2016 - 00:33

కర్నూలు అర్బన్, ఏప్రిల్ 29:ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్‌లో ప్రవేశం కోసం నిర్వహించిన ఎంసెట్-2016 పరీక్ష శుక్రవారం జిల్లా కేంద్రంలో సజావుగా జరిగింది. ఉదయం 16 కేంద్రాల్లో జరిగిన ఇంజినీరింగ్ పరీక్షలో 7,656 మందికి గానూ 7,312 మంది హాజరు కాగా 344 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

04/30/2016 - 00:32

కర్నూలు, ఏప్రిల్ 29 : జిల్లా వ్యాప్తంగా వరుసగా రెండవ రోజు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే వడగాలుల ప్రభావం కారణంగా వేడి ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. నంద్యాల పట్టణంలో శుక్రవారం గరిష్టంగా 43డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా కర్నూలులో 42, ఆదోనిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో సగటున 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు.

04/30/2016 - 00:32

మంత్రాలయం, ఏప్రిల్ 29: శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ధార్మిక అధికారిగా శుక్రవారం గుంజల్లి శ్రీపతాచార్ పదవి బాధ్యతలు చేపట్టినట్లు మఠం మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. గతంలో మఠం మేనేజర్‌గా, జోనల్ మేనేజర్‌గా పనిచేసిన శ్రీపతాచార్ కొద్ది కాలం క్రితం పదవీ విరమణ పొందారు. అయితే మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థుల ఆదేశానుశారం ఒప్పందం ఉద్యోగిగా పదవీ బాధ్యతలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

04/30/2016 - 00:31

ఆదోనిటౌన్, ఏప్రిల్ 29: రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్‌బోర్డు పరిధిలో ఉన్న 67 వేల ఎకరాల భూమిని, ఇతర ఆస్తులను, స్థలాలను పరీరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అక్రమంగా అనుభవిస్తున్న వారిపై చట్ట పరమైన అన్ని విదాల చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మైనార్టీ కమిషనర్, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సిఎఓ షేక్‌మహ్మద్ ఇగ్బాల్ స్పష్టం చేశారు.

04/30/2016 - 00:31

పెద్దకడబూరు, ఏప్రిల్ 29: అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపి, వాటిని పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేస్తున్నామని డిఐజి రమణకుమార్ వెల్లడించారు. శుక్రవారం పెద్దకడబూరులోని పోలీసు స్టేషన్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, క్రైం రేటుపై ఆరాతీశారు. అనంతరం డిఐజి విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.

04/30/2016 - 00:30

కర్నూలు సిటీ, ఏప్రిల్ 29:కర్నూలు నగరం వేగవంతంగా అభివృద్ధి చెందనుంది. నగర అభివృద్ధి కోసం రూ. 167.77 కోట్లు మంజూరు అయ్యాయని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికే కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా)గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘కుడా’ పరిధిలోకి కర్నూలు గ్రామీణ, కల్లూరు, గూడూరు, ఓర్వకల్లు, కోడుమూరు, వెల్దుర్తి, నందికొట్కూరు వస్తాయి.

04/30/2016 - 00:30

కర్నూలు, ఏప్రిల్ 29:గ్రామాల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం నిర్ధేశించిన కార్యక్రమాలను అమలుచేయడంలో ఎంపిడిఓలు కీలకపాత్ర వహించి లక్ష్యాలను త్రికరణశుద్ధితో పూర్తి చేసేందుకు సంసిద్దులు కావాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో శుక్రవారం ఉపాధి హామీ, వాటర్‌షెడ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

04/30/2016 - 00:29

ఎమ్మిగనూరు, ఏప్రిల్ 29: రాబోవు రోజుల్లో కాంగ్రెస్‌దే రాజ్యమని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం పట్టణంలో కాంగ్రెస్ నాయకుడు పరందమప్ప ఇంటో జరిగిన పెళ్లికి కోట్ల హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

04/30/2016 - 00:28

ఓర్వకల్లు, ఏప్రిల్ 29: జిల్లాలో శుక్రవారం వడదెబ్బతో ఐదుగురు మృతిచెందారు. అందులో ఓర్వకల్లు మండల పరిధిలోని గుట్టపాడు గ్రామానికి చెందిన ఉపాధి కూలీ పెద్ద పెద్దయ్య(58) వడదెబ్బ సోకి శుక్రవారం మృతిచెందాడు. పెద్దయ్య ఉదయానే్న గ్రామానికి చెందిన కూలీలతో కలిసి ఉపాధి పనికి వెళ్లాడు. 10 గంట ల సమయంలో తల నొప్పిగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయని తోటి కూలీలతో చెప్పి సృహ తప్పి పడిపోయాడు.

Pages