S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/14/2016 - 23:19

కల్వకుర్తి, ఏప్రిల్ 14: గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఓత్తిడికి ఉద్యమిద్దామని టిజెఎసి రాష్ట్ర చైర్మన్ కోదండరాం అన్నారు.

04/14/2016 - 23:18

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 14: దళితులు విద్యాపరంగా, ఆర్థికంగా బలపడినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

04/14/2016 - 23:15

నల్లగొండ, ఏప్రిల్ 14: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీల రిజర్వేషన్లను ఖరారు చేయడంతో ఆశావాహుల్లో ఉత్సాహాం మొదలైంది. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తు జిల్లాలోని 19వ్యవవసాయ మార్కెట్‌లలో ఏడు మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులను మహిళలకు రిజర్వ్ చేశారు.

04/14/2016 - 23:14

నల్లగొండ, ఏప్రిల్ 14: భారత రత్న, రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా సంబరంగా సాగాయి. నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, దేవరకొండ, కోదాడ, హుజూర్‌నగర్, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు తదితర పట్టణాలు, మండలాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా జరుపుకున్నారు.

04/14/2016 - 23:13

భువనగిరి, ఏప్రిల్ 14: రాష్ట్రంలో 33వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని దేశంలోని 29రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతంగా నిలుస్తుందని రాష్ట్ర హోం శాఖా మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి తెలిపారు. గురువారం భువనగిరి పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

04/14/2016 - 23:12

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 14: ఈ నెల 18వ.తేది నాటికి బాల ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేసి దేవస్ధానానికి అప్పగిస్తామని వైటి డి ఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు తెలిపారు. గురువారం యాదాద్రి క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. బాల ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.ప్రధాణ ఆలయం మాదిరిగానే బాల ఆలయం లోపల అదే మాదిరిగా స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు.

04/14/2016 - 23:11

కలెక్టరేట్(నల్లగొండ), ఏప్రిల్ 14: శ్రీరామనవమి వేడుకలకు తెలంగాణ రెండో భద్రాద్రిగా ప్రఖ్యాతినొందిన నల్లగొండ రామగిరి ర

04/14/2016 - 23:08

ఇండియన్ ప్రీమియర్ లీగ్-ఐపిఎల్-మహారాష్టల్రో నిర్వహించ తలపెట్టిన క్రికెట్ ఆటల పోటీలను ఇతర ప్రాంతాలకు తరలించాలని ముంబయి హైకోర్టు ఆదేశించడం నీటి కొరత తీవ్రత గురించి పాలకులకు మరోసారి గుర్తుచేస్తోంది. ఇలా తరలించడంవల్ల మహారాష్ట్ర ప్రాంతపు మంచినీటి సమస్యకు సమగ్ర పరిష్కారం లభించబోదని హైకోర్టు స్పష్టం చేయడం కూడ ప్రభుత్వాలకు లభించిన న్యాయాభిశంసన.

04/14/2016 - 23:07

జవహర్‌లాల్ యూనివర్శిటీ, హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ, శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలను అనుసంధానిస్తున్న అంశం ఏమై ఉంటుంది? రాజ్యాంగంపై వల్లమాలిన ప్రేమతో కాకుండా సరైన దృక్కోణంలోంచి చూసిన వారికి అదేమిటో ఇట్టే బోధపడుతుంది. నిరసన తెలియజేసే హక్కు, విభేదించే హక్కుల ముసుగులో ఈ విశ్వవిద్యాలయాలు జాతి వ్యతిరేక శక్తులకు నిలయాలుగా మారుతున్నాయి.

04/14/2016 - 23:00

దేశంలోను రాష్ట్రంలోను విద్యాశాఖ వింత వింత విచిత్ర వాతావరణంలో మగ్గిపోతోంది. మన రాష్ట్రంలో విద్యాశాఖ తీవ్ర గందరగోళంలో ఉంది. పాలకులు ఏదో చేసేద్దామని ఎడమ చెయ్యి తీసి కుడి చెయ్యి కుడి చెయ్యి తీసి ఎడమ చెయ్యి పెట్టి తమాషాలు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో విద్యాశాఖ ఒక అనవసర ఖర్చు శాఖ వలెనే కనిపిస్తున్నది తప్ప ఇది దేశ నిర్మాణంలోను జాతి నిర్మాణంలోను వెన్నుముక వంటి భావన అనేది లేనే లేదు.

Pages