S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/13/2016 - 00:56

అనంతపురం సిటీ, ఏప్రిల్ 12: జిల్లాలోని ఆధార్ లేని నేతన్నలు ఆధార్ కార్డు తప్పనిసరిగా పొందాలని కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డ్వామా హాల్‌లో హ్యాండ్లూమ్, పవర్‌లూమ్స్ సంబంధించిన టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కల్గిన నేతన్నలందరికీ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ త్వరలో జరుగనున్నదన్నారు. అయితే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు.

04/13/2016 - 00:56

అనంతపురం సిటీ, ఏప్రిల్ 12: జిల్లాలో 2012 సంవత్సరంకంటే ముందు చోటుచేసుకున్న కేసులను త్వరితగతిన పరిష్కారం చేసి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఎస్‌వి.రాజశేఖర్‌బాబు ఆదేశించారు. మంగళవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

04/13/2016 - 00:55

అనంతపురం సిటీ, ఏప్రిల్ 12 : జిల్లాలో భానుడి భగభగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ భానుడు తన ప్రతాపం ఎక్కువగా చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఉదయం నుంచే బయటకు రావడానికి భయపడుతున్నారు. జిల్లాలో 42.1 డిగ్రీల సెల్సియస్ సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా జిల్లా కేంద్రంలో 40.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.

04/13/2016 - 00:54

రామగిరి, ఏప్రిల్ 12: సమాజ సేవలో పరిటాల కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని మంత్రి సునీత, ఎంపినిమ్మల, చీఫ్‌విప్ కాలవ, పలువురు ఎమ్మెల్యేలు కొనియాడారు.

04/13/2016 - 00:53

హిందూపురం టౌన్, ఏప్రిల్ 12 : ఆస్తి, నీటి పన్నుల వసూళ్లకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ముందస్తుగా చేసిన కసరత్తు ఫలించింది.

04/13/2016 - 00:53

అనంతపురంటౌన్, ఏప్రిల్ 12: పిఎబిఆర్ తాగునీటి పైపులైను పథకం ఉన్నా అనంత నగర ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పటం లేదు. అప్పుడు ఇప్పుడు నేతల కనుసన్నలలోనే పిఎబిఆర్ పైపులైను పథకానికి తూట్లు పొడిచి గ్రామ పంచాయతీలకు అక్రమంగా తాగునీటి కనెక్షన్లను ఇప్పించారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. పిఎబిఆర్ తాగునీటి పథకంపై అనధికార కనెక్షన్ల ప్రభావంతో నగరంలోని ట్యాంకులు నిండని పరిస్థితి నెలకొంది.

04/13/2016 - 00:47

వేములవాడ, ఏప్రిల్ 12: శ్రీరామనవమి భక్తులకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా మెరుగైన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు సిరిసిల్ల ఆర్డీవో బిక్షునాయక్ తెలిపారు. మంగళవారం ఆలయ ధర్మకర్తల మండలి సమావేశ మందిరంలో ఇవో రాజేశ్వర్‌తో కలసి వివిధ శాఖల అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

04/13/2016 - 00:46

జగిత్యాల, ఏప్రిల్ 12: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజల్లో సంతృప్తి లేదని,సామాజిక తెలంగాణ రాష్ట్రంగా మారినప్పుడే ప్రయోజనం ఉంటుందని సిఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల పట్టణంలోని 14వ వార్డులోని మోతె మాల వార్డులో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

04/13/2016 - 00:45

భీమదేవరపల్లి, ఏప్రిల్ 12: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని మహిళా స్వకృతి డెయిరీని ట్రైనీ కలెక్టర్ల బృందం పట్నాయక్, బి.పి.గౌతమ్, ముషరఫీ, అలీఫరూక్, సందీప్ కుమార్ చా, కృష్ణాదిత్యలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజులుగా తెలంగాణలోని అన్ని జిల్లాలు తిరిగి సహకార సంఘాలను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం చొప్పదండి మార్కెట్‌ను, ధర్మపురి ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు.

04/13/2016 - 00:45

చొప్పదండి, ఏప్రిల్ 12: నియోజకవర్గ కేంద్రంలోని చొప్పదండి వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం శిక్షణ పొందిన ఐఎఎస్‌లు మొక్కజొన్న కొనుగోలు మార్కెఫెడ్ ఆద్వర్యంలో ఎలా కొనసాగుతున్నాయో పరిశీలించారు. ఈ మేరకు శిక్షణ ఐఎఎస్‌లు గౌతమ్, ముష్రాఫ్‌ఫరేఖ్, సందీప్‌జా, సిక్రుపత్రాయక్, క్రిష్ణ ఆదిత్యలు మార్క్‌ఫెడ్ నిర్వహించే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల తీరుపై ఆరా తీసారు.

Pages