S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/13/2016 - 00:44

కరీంనగర్, ఏప్రిల్ 12: కరవుతో కర్షకుడు కుదేలవుతున్నాడు. జిల్లాలో గత రెండేళ్లుగా నెలకొన్న వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బావుల్లో ఉన్న కొద్దిపాటి నీళ్లతో ఎంతోకొంత మేర పంటలు పండుతాయనే ఆశతో పంటలు సాగు చేశారు. ఓ వైపు వర్షాభావం..మరోవైపు ఎండదెబ్బ వెరసి బావుల్లో ఉన్న కొద్దిపాటి నీళ్లు కూడా అడుగంటగా, ఊట కూడా మాయమైంది. ఫలితంగా పంట పొలాలు ఎండిపోతున్నాయి.

04/13/2016 - 00:40

జనగామ టౌన్, ఏప్రిల్ 12: కరవు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోకపోతే ఆందోళన తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామంలో ఎండిన పంటలను బుధవారం చాడ వెంకట్‌రెడ్డి పరిశీలించారు.

04/13/2016 - 00:39

వరంగల్, ఏప్రిల్ 12: ఎస్సై ప్రిలిమినరీ వ్రాత పరీక్ష రోజున ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు అధికారులను ఆదేశించారు. ఈ నెల 17వ తేదీన వరంగల్ నగరంలో నిర్వహించబడే ఎస్సై ప్రిలిమినరీ వ్రాత పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను మంగళవారం పోలీస్ కమిషనర్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

04/13/2016 - 00:38

ఆత్మకూరు, ఏప్రిల్ 12: వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టిసారించాలని కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కోరారు.

04/13/2016 - 00:38

వర్థన్నపేట, ఏప్రిల్ 12: ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం కృషి చేస్తానని వర్ధన్నపేట శాసన సభ్యుడు అరూరి రమేష్ అన్నారు. మంగళవారం రోజు మల్లికార్జున స్వామి దేవస్థాన ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జాతర ప్రాంగణాన్ని పరిశీలించారు.

04/13/2016 - 00:37

జనగామ టౌన్, ఏప్రిల్ 12: కరవు ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు.

04/13/2016 - 00:37

కేసముద్రం, ఏప్రిల్ 12: మానుకోట ఎమ్మెల్యే మంగళవారం ఉదయం కేసముద్రం మార్కెట్‌ను ఆకస్కిక తనిఖీ చేయగా 10 గంటల వరకు కూడా రెగ్యులర్ ఉద్యోగులెవరూ విధులకు హాజరు కాలేదన్న ఘటనపై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు విధుల పట్ల అలక్ష్యం చూపుతున్నారనే కారణంతో మార్కెట్ సూపర్‌వైజర్ క్రిష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు డిడి శ్రీనివాస్ మంగళవారం ప్రకటించారు.

04/13/2016 - 00:36

వర్థన్నపేట, ఏప్రిల్ 12: వేసవి తీవ్రత ఒక రైతు ప్రాణాల్ని బలితీసుకుంది. వర్ధన్నపేట మండల కేంద్రానికి చెందిన రైతు సంకూరి వెంకటేశ్వర్లు(47) సోమవారం రాత్రి చనిపోయాడు. వివరాల్లోకి వెళితే... తనకు ఉన్న వ్యవసాయ బావి వద్దకు ఉదయం వెళ్లి పనులు చేసుకుంటు సాయంత్రం వరకు పనిలో నిమగ్నమయ్యాడు.

04/13/2016 - 00:36

ములుగు, ఏప్రిల్ 12: మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఉదయం ములుగులోని టిఆర్‌ఎస్ కార్యాలయంలో ఏటూరునాగారం ఐటిడిఎ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అక్కడి నుండి మండలంలోని అన్నంపల్లి గ్రామశివారులోని తొర్రుకుంట చెరువుకు రూ.

04/13/2016 - 00:35

వరంగల్, ఏప్రిల్ 12: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ విడత కార్యక్రమాన్ని మంగళవారం వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం బోజెరువు చెరువులో పనులను ప్రారంభించారు. ముందుగా నర్సంపేట డిఎస్పీ మురళీధర్, టిఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్దిసుదర్శన్‌తో కలిసి బోజెరువు చేరుకున్న ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝాకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.

Pages