S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/30/2016 - 13:47

హైదరాబాద్: కరవు పరిస్థితులపై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో బుధవారం రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి మధ్య వాగ్వివాదం జరిగింది. ప్రభుత్వం ఏమీ చేయలేదన్నట్లు జీవన్‌రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని తలసాని ధ్వజమెత్తారు. రైతుల గురించి తెలియని వారు కరవుపై మాట్లాడడం వింతగా ఉందని జీవన్‌రెడ్డి అన్నారు.

03/30/2016 - 13:46

హైదరాబాద్: స్టాంప్ డ్యూటీలో అవకతవకల వల్ల ఎపి ప్రభుత్వానికి సుమారు 10 కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగినట్లు ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను బుధవారం ఎపి అసెంబ్లీకి ప్రభుత్వం సమర్పించింది. రవాణా శాఖకు 7 కోట్లు, భూమిశిస్తుకి సంబంధించి 76 కోట్ల మేరకు నష్టం జరిగింది.

03/30/2016 - 13:46

కరీంనగర్: ఇక్కడి బైపాస్ రోడ్డులో బుధవారం ఉదయం ఓ మహిళపై కొందరు ఆగంతకులు ఆకస్మికంగా దాడి చేసి సుమారు 30 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

03/30/2016 - 13:45

విజయనగరం: టిడిపి సీనియర్ నాయకుడు, ప్రముఖ వ్యాపారా గురాన సాధూరావు అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. ఆయకు కుమార్తె మీసాల గీత ప్రస్తుతం విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. గురాన మరణం పట్ల టిడిపి నేతలు సంతాపం ప్రకటించారు.

03/30/2016 - 13:45

విజయవాడ: ఓ యువతిని సెల్‌ఫోన్‌లో నగ్నంగా చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే మండలి రవికాంత్ అనే యువకుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి, మిగతా నిందితుల కోసం ఆరా తీస్తున్నారు.

03/30/2016 - 12:08

హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులపై ఎపి సర్కారు బుధవారం నాడు అసెంబ్లీలో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికను సమర్పించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల తాజా పరిస్థితులను నివదేకలో పొందుపరిచారు. 2014-15లో రెవెన్యూ లోటు రూ.24,194 కోట్లు, ద్రవ్యలోటు రూ.31,717 కోట్లు, మొత్తం 6.10శాతం లోటు నమోదైందని కాగ్‌ నివేదిక వెల్లడించింది.

03/30/2016 - 12:06

బ్రస్సెల్స్: భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా బెల్జియంలో పర్యటిస్తున్నారు. బుధవారం ఆయనకు బ్రస్సెల్స్‌లో ఘన స్వాగతం లభించింది. బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖేల్‌తో ద్వైపాక్షిక చర్చల్లోను, ఇండియన్ యూరోపియన్ యూనియన్ సదస్సులోను ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత మోదీ అమెరికా, సౌదీ అరేబియాల్లో పర్యటించి వచ్చే నెల 3న భారత్‌కు చేరుకుంటారు.

03/30/2016 - 12:05

శంషాబాద్: ఔటర్ రింగురోడ్డుపై తోండుపల్లి వద్ద ఔటర్ రింగు రోడ్డుపై బుధవారం ఉదయం ఓ భారీ వాహనం బోల్తాపడి డ్రైవర్ మరణించాడు. వెంటనే పోలీసులు వాహనాన్ని తొలగించి, డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

03/30/2016 - 12:05

గుంటూరు: ఓ స్కూల్ బస్సు పొలాల్లోకి బోల్తాపడి విద్యార్థుల స్వల్ప గాయాలకు గురైన సంఘటన చెరుకుపల్లి మండలం కామినేనివారి పాలెం వద్ద బుధవారం ఉదయం జరిగింది. క్షతగాత్రులకు సమీప ఆస్పత్రిలో చికిత్స అందజేశారు.

03/30/2016 - 12:05

రంగారెడ్డి: పెళ్లి బృందంతో వెళుతున్న వ్యాన్ రంగారెడ్డి మండలం పరిగి వద్ద బుధవారం ఉదయం బోల్తాపడగా అయిదుగురు మరణించారు. 25 మంది గాయపడ్డారు. సంఘటన స్థలంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా ముగ్గురు మృతి చెందారు. క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వికారాబాద్ మండలం ద్యాచారం నుంచి వీరు మహబూబ్‌నగర్ జిల్లా ఉత్తరాసుపల్లి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

Pages