S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/29/2016 - 07:02

గుంటూరు, మార్చి 28: రాజధాని అమరావతిలో 1002 ఎకరాల అసైన్డ్ భూములకు చెక్కులు పంపిణీ చేసినప్పటికీ ఇంకా 933.38 ఎకరాలకు నగదు చెల్లింపులు జరగాల్సి ఉంది. రాజధాని ప్రాంతంలో 2 వేల ఎకరాలు అసైన్డ్భూములు ఉన్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం చెక్కుల పంపిణీలో జాప్యం చేస్తుందన్న విమర్శ వినిపిస్తోంది.

03/29/2016 - 06:59

ఖమ్మం, మార్చి 28: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. సోమవారం జడ్పీ మీటింగ్ హాలులో ప్రజావాణిని పురస్కరించుకొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ప్రజలు అందించే ప్రతి ఫిర్యాదుకి జవాబుదారితనం అవసరం అన్నారు.

03/29/2016 - 06:57

కర్నూలు, మార్చి 28: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం వారి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి హామీ అమలు నిబంధనల ప్రకారం కూలీలకు పని కల్పించిన ప్రదేశంలో కనీస వసతులు కల్పించడం లేదని కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదులు సైతం అందుతున్నాయి.

03/29/2016 - 06:55

నెల్లూరుసిటీ, మార్చి 28: ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోరాటానికి సిద్ధం కావాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు భవానీ నాగేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం ఇందిరాభవన్‌లో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉడతా వెంకట్రావు ఆధ్వర్యంలో నగర కమిటీని నియమించారు.

03/29/2016 - 06:53

ఒంగోలు,మార్చి 28:రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్‌టిఆర్ వైద్యసేవల పథకానికి నిధుల గ్రహణం పట్టింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఎన్‌టిఆర్ వైద్యసేవలు అందిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులతోపాటు, చిన్నస్థాయి ఆసుపత్రుల యజమానులు ప్రభుత్వం నుండి నిధులు సక్రమంగా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

03/29/2016 - 06:51

శ్రీకాకుళం(రూరల్), మార్చి 28: బిసిలంతా ఐక్యంగా ఏర్పడి హక్కులను కాపాడుకోవాలని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. బడుగు సంగ్రామ సమితి (బిఎస్‌ఎస్) సమావేశాన్ని సోమవారం స్థానిక హోటల్‌లో నిర్వహించారు.

03/29/2016 - 06:48

విశాఖపట్నం, మార్చి 28: జీతాలు చెల్లించుకోలేని దుస్థితిలో ఉన్నాం. మీరు పన్నులు చెల్లిస్తేనే మేము సిబ్బందికి జీతాలిచ్చేది. ఇప్పటికిప్పుడు బకాయిలు చెల్లించండంటూ ధర్నాలకు దిగుతున్న జివిఎంసి రెవెన్యూ అధికారులు, సిబ్బంది తీరు విమర్శలకు దారి తీస్తోంది.

03/29/2016 - 06:46

విజయనగరం (్ఫర్టు), మార్చి 28: మున్సిపాలిటీలో నిధులు పుష్కలంగా ఉన్నా పనులలో ఏమాత్రం పురోగతి కనిపించడంలేదని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణతోపాటు పాలకవర్గసభ్యులు రొంగలి రామారావు, ముద్దా డ చంద్రశేఖర్ అన్నారు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అధ్యక్షతన సోమవారం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభివృద్ధి పనులు నత్తనడకగా సాగుతున్నాయంటూ ఇంజనీరింగ్ అధికారులపై మండిపడ్డారు.

03/29/2016 - 06:44

ఏలూరు, మార్చి 28: సముద్రం పాలవుతున్న వేల టిఎంసిలు... ఒకప్రక్క ఎండిపోతున్న ఆయకట్టు... మరోప్రక్క సాగునీటి కోసం అల్లాడుతున్న రైతాంగం... పోలవరం భారీ ప్రాజెక్టు అయినా ఇంకా అందనంత దూరంలోనే నిల్చుంది... ఈపరిస్ధితుల్లో చంద్రబాబు ప్రభుత్వం తలపోసిన పట్టిసీమ ఎత్తిపోతల పధకం తొలిదశలో ఎన్నో అనుమానాలకు, అంతకుమించిన విమర్శలకు కారణమైంది... విపక్షం నుంచి తీవ్రస్ధాయి ఆరోపణలు, సవాళ్లు కూడా తప్పలేదు...

03/29/2016 - 06:41

నిజామాబాద్, మార్చి 28: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా నిలుస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అనేక కారణాలతో నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నందున, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

Pages