S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/27/2016 - 05:31

వరంగల్, మార్చి 26: ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. శనివారం కలెక్టర్ తన చాంబర్‌లో ఎండ తీవ్రత అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృత ప్రచారం, రైతు సంఘాల బలోపేతంపై స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

03/27/2016 - 05:28

వరంగల్, మార్చి 26: వరంగల్ ప్రజలకు ఉగాది కానుకగా రోజు విడిచి రోజు తాగునీరు అందించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని నగర మేయర్ నన్నపనేని నరేందర్ అన్నారు. శనివారం మున్సిపల్ కౌన్సిల్‌లో మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

03/27/2016 - 05:28

మొహాలీ, మార్చి 26: బ్యాటింగ్ విభాగం కీలకమైన పాత్ర పోషిస్తుందని, వెస్టిండీస్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో తమ బ్యాట్స్‌వి మెన్ రాణిస్తారన్న నమ్మకం తనకు ఉందని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నది. మహిళల టి-20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరాలంటే, విండీస్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాలి. ఆ మ్యా చ్‌ని చేజార్చుకుంటే టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమిస్తుంది.

03/27/2016 - 05:27

వరంగల్, మార్చి 26: కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో మెరుగైన వైద్య సేవలు అందించి వరంగల్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో సిహెచ్‌సి, సూపరింటెండెంట్‌లు, గైనకాలజిస్టులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

03/27/2016 - 05:32

మియామీ, మార్చి 26: మియామీ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ విక్టోరియా అజరెన్కా మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఇటీవల జరిగిన ఇండియన్ వెల్స్ టోర్నీ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి సంచలనం సృష్టించిన ఆమె రెండో రౌండ్‌లో 6-2, 6-4 తేడాతో మోనికా పగ్‌పై విజయం సాధించింది.

03/27/2016 - 05:23

నిజామాబాద్, మార్చి 26: జిల్లా పర్యటనలకు హాజరైన సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీల అమలుపై కలెక్టర్ యోగితారాణా శనివారం సమీక్ష జరిపారు. స్థానిక ప్రగతిభవన్‌లో వివిధ శాఖల అధికారులతో సిఎం హామీల అమలుపై చర్చించారు. సిఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ తొలిసారిగా 2014 ఆగస్టు 7వ తేదీన జిల్లా పర్యటనకు హాజరయ్యారు.

03/27/2016 - 05:23

నిజామాబాద్, మార్చి 26: ఎండలు మండుతూ, వేడి గాలుల తీవ్రత నానాటికీ తీవ్రమవుతున్న దృష్ట్యా వడదెబ్బ తాకిడికి లోనవకుండా తగు జాగ్రత్తలు పాటించేలా ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అధికారులకు సూచించారు. వడదెబ్బ కారణంగా జిల్లాలో ఏ ఒక్క కుటుంబానికి కూడా నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆమె పేర్కొన్నారు.

03/27/2016 - 05:22

నిజామాబాద్, మార్చి 26: తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం కింద జిల్లాలో ఎంపిక చేసిన మండలాల్లో రెట్టింపు వేగంతో అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అధికారులకు సూచించారు. ఇతర మండలాలతో పోలిస్తే పల్లె ప్రగతి మండలాల్లో రెండింతలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా చొరవ చూపాలని ఆదేశించారు. శనివారం స్థానిక ప్రగతిభవన్‌లో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

03/27/2016 - 05:20

నిజామాబాద్, మార్చి 26: వేసవి సీజన్ ఆరంభంలోనే భానుడు తన భుగభుగలతో నిప్పుల కొలిమిని రాజేస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వడదెబ్బ ధాటికి లోనై భీమ్‌గల్ మండలంలో ఓ ఉపాధి హామీ కూలీ మృతి చెందగా, ప్రతిరోజు పదుల సంఖ్యలో బడుగు జీవులు అస్వస్థత బారినపడుతున్నారు.

03/27/2016 - 05:18

నల్లగొండ టౌన్, మార్చి 26: ఆదర్శగ్రామం రెడ్లరేపాక గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఎంపి బూర నర్సయ్యగౌడ్ స్థానిక గ్రామ కార్యాలయంలో సంసద్ గ్రామయోజన కింద దత్తత తీసుకున్న గ్రామం ఎడ్లరేపాకలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత జిల్లా అధికారులతో శనివారం సమీక్షాసమావేశం నిర్వహించారు.

Pages