S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/27/2016 - 02:40

చాలా మంది స్టార్ క్రికెటర్లకు ఈసారి వేలంలో అవకాశమే దక్కలేదు. అలాంటి వారిలో ఆస్ట్రేలియా టి-20 కెప్టెన్ ఆరోన్ ఫించ్, న్యూజిలాండ్‌కు చెందిన హార్డ్ హిట్టర్ మార్టిన్ గుప్టిల్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జార్జి బెయిలీ, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఆటగాళ్లు మహేల జయవర్ధనే, మైఖేల్ హస్సీ, బ్రాడ్ హాడిన్ తదితరులు ఉన్నారు.

03/27/2016 - 02:39

గత ఏడాది ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక ధరతో రికార్డు సృష్టించిన యువరాజ్ సింగ్‌కు ఈసారి నిరాశ తప్పలేదు. 2015 వేలంలో అతనిని 16 కోట్ల రూపాయలకు ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేసింది. అంతకు ముందు ఏడాది కూడా యువీకే అప్పట్లో రికార్డు ధర లభించడం విశేషం. వరుసగా రెండు సంవత్సరాలు అత్యధిక మొత్తాలను సంపాదించిన యువీకి ఈసారి నిరాశే మిలిగింది. అందరి కంటే ఎక్కువ మొత్తం అతనికే లభిస్తుందని విశే్లషకులు అంచనా వేశారు.

03/27/2016 - 02:36

షేన్ వాట్సన్, యువరాజ్ సింగ్‌తోపాటు రెండు కోట్ల బేస్ ప్రైస్‌గల వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు 5.5 కోట్ల రూపాయలు లభించాయి. చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆడిన మరో పేసర్ మోహిత్ శర్మ కనీస ధర 1.5 కోట్ల రూపాయలుకాగా, అతనికి నెహ్రా కంటే యాభై లక్షల రూపాయలు అధికంగా దక్కాయి. అతనిని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 6.5 కోట్లకు దక్కించుకోగా, నెహ్రాను సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది.

03/27/2016 - 02:34

* ఐపిఎల్‌లో ఓటమి లేకుండా ఎక్కువ వరుస విజయాలను సాధించిన జట్టుం కోల్‌కతా నైట్ రైడర్స్. గత ఏడాది వరుసగా 11 మ్యాచ్‌లను కోల్‌కతా గెల్చుకుంది. 2013 సీజన్ చివరిలో, తిరిగి 2014 సీజన్ ఆరంభంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఎనిమిది, 2011లో తిరిగి 2013లో చెన్నై సూపర్ కింగ్స్‌తోపాటు రాజయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఏడేసి పర్యాయాలు వరస విజయాలు అందుకున్నాయ.

03/27/2016 - 02:23

హైదరాబాద్, మార్చి 26: తెలంగాణలో మాదిరి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలు త్వరలో పెరగనున్నాయి. ఆ ప్రకారం మంత్రులు, విప్‌లు, ఇతర పదవుల్లో ఉన్న వారి వేతనాలు కూడా భారీగా పెరగనున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం కనీసం రెండు లక్షలకు పెంచాలని ఎమినిటీస్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు అసెంబ్లీ హాలులో సమావేశమైన ఎమినిటీస్ కమిటీ సిఫార్సులు చేసింది.

03/27/2016 - 02:22

హైదరాబాద్, మార్చి 26: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రోహిత్ తల్లి రాధిక, సోదరుడు వేముల రాజా చైతన్యలను భద్రతా సిబ్బంది మెయిన్‌గేట్ వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రోహిత్ తల్లి భద్రతా సిబ్బందితో వాగ్యుద్ధానికి దిగారు. తమను లోపలికి అనుమతించాల్సిందేనని రాధిక వాదించారు. ఈ క్రమంలో ఆమె సొమ్మసిల్లిపడిపోయారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

03/27/2016 - 02:21

హైదరాబాద్, మార్చి 26: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంఘటనలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని బిజెపితో కుమ్మక్కు అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. విద్యార్థుల ఉద్యమం ద్వారానే తెలంగాణ సాకారం అయిందని, అలాంటి దళిత విద్యార్థులకు సెంట్రల్ యూనివర్సిటీలో అన్యాయం జరిగితే ప్రభుత్వం దళితుల పక్షాన నిలబడుతుందని ఆశిస్తే అలా జరగలేదని బిజెపి ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.

03/27/2016 - 02:20

హైదరాబాద్, మార్చి 26: ఫైబర్ గ్రిడ్ అంశంపై శనివారం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టును ముఖ్యమంత్రి తన సన్నిహితుడు, బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్ వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు ఇచ్చారని జగన్ ధ్వజమెత్తారు. అయితే ఆయన దొంగ కాదు... త్యాగశీలి అంటూ చంద్రబాబు కితాబిచ్చారు.

03/27/2016 - 02:15

హైదరాబాద్, మార్చి 26: కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత ఓరుగల్లును వశపర్చుకున్న తుగ్లక్ కుమారుడు, మహ్మద్ బీన్ తుగ్లక్ హయాంలో చెలామణి అయిన అరుదైన బంగారు నాణ్యాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు టిఆర్‌ఎస్‌ఎమ్ ఫౌండేషన్ బహుకరించింది. పురాతన నాణాలను సేకరించే అలవాటు ఉన్న టిఆర్‌ఎస్‌ఎమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తక్కెళ్లపల్లి దేవేందర్‌రావు శనివారం శాసనసభ ఆవరణలో ముఖ్యమంత్రిని కలిశారు.

03/27/2016 - 02:12

హైదరాబాద్, మార్చి 26: ఉద్యోగుల బదిలీలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే నెల నుంచి బదిలీల ప్రక్రియ జరుగనుందని టిఎన్‌జివో నేతలు వెల్లడించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు శనివారం ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగుల బదిలీ అంశాన్ని చర్చించారు. ఈ సందర్భంగా వచ్చే నెల నుంచి బదిలీలకు ముఖ్యమంత్రి అంగీకరించినట్టు వారు తెలిపారు.

Pages