S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/19/2016 - 18:15

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్‌ మంజూరైంది. యలమంచిలి రాము, భవానీ శంకర్‌, దూడల రాజేశ్‌లకు విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

01/19/2016 - 16:36

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారంనాడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 291 పాయింట్లు లాభపడి 24,479 వద్ద ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 7,435 పాయింట్ల వద్ద ముగిసింది.

01/19/2016 - 16:29

హైదరాబాద్: భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీపై ఏపీలోని అనంతపురం జిల్లా కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్‌ను ఇవాళ న్యాయమూర్తి ఉపసంహరించుకున్నారు. ధోనీ న్యాయవాది విజ్ఞప్తి మేరకు గతంలో కోర్టు జారీ చేసిన వారెంట్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు.

01/19/2016 - 16:23

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హెచ్ సీయూ విద్యార్థి వేముల రోహిత్ మృతిపై విచారణ జరిపించాలని మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి హెచ్ఆర్సీలో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హెచ్ఆర్సీ స్పందించింది.

01/19/2016 - 16:21

పనాజీ ‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్‌పారికర్‌లను చంపుతామంటూ గోవా రాష్ట్ర సెక్రటేరియట్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. పోస్టు కార్డు మీద రాసిన ఈ లేఖలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ సంతకం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

01/19/2016 - 16:12

పాకిస్థాన్ : పాకిస్థాన్‌లోని షోర్కోట్ చెక్కర కర్మాగారంలో బాయిలర్ పేలి 8మంది కార్మికులు మృతిచెందారు. గ్యాస్ లీకేజీ కారణంగా బాయిలర్ పేలిందని, దీంతో పైకప్పు కూలటంతో శిధిలాల కింద కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటనలో 15మంది కార్మికులు గాయపడ్డారు.

01/19/2016 - 16:11

న్యూఢిల్లీ :పంజాబ్ పఠాన్‌కోట వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఎస్పీ సల్వీందర్ సింగ్‌కు జాతీయ దర్యాప్తుసంస్థ అధికారులు లైటిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్‌ను అనుమానితునిగా భావించి అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.

01/19/2016 - 16:11

హైదరాబాద్ : రోహిత్ ఆత్మహత్య తనను తీవ్రంగా కలిచివేసిందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారంనాడు రోహిత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ రోహిత్ ఆత్యహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే వీసీ పరామర్శించాలని అవసరం లేదా అని ప్రశ్నించారు. వీసీని తప్పించాలని డిమాండ్ చేశారు.

01/19/2016 - 16:10

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ తల్లిని, కుటుంబ సభ్యులను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మంగళవారంనాడు పరామర్శించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు.

01/19/2016 - 16:09

హైదరాబాద్ :సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ మృతిపై విచారణ జరిపేందుకు కేంద్రబృందం ఢిల్లీ నుంచి వచ్చింది. ఈ బృందం సభ్యులు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రశ్నించారు. మరో వైపు సెంట్రల్ యూనివర్శిటీకి విద్యార్థిసంఘాలు, మానవ హక్కుల సంఘాలు పోటెత్తటంతో ఉద్రక్తిత కొనసాగుతోంది.

Pages