S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/15/2016 - 07:35

చౌటుప్పల్, జనవరి 14: పల్లె‘టూర్’ ప్రశాంతంగా సాగింది. హైదరాబాద్ - విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారికి సంక్రాంతి తాకిడి పెరిగింది. సంక్రాంతి సంబరాలలో పాల్గొనేందుకు రాజధాని నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వాహనాలలో తరలివెళ్లడంతో హైవే కిక్కిరిసిపోయింది. సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 17 వేల వాహనాలు వెళ్తుండగా పండుగ సందర్భంగా రెట్టింపయ్యాయి. అడుగడుగునా ట్రాఫిక్ స్తంభించింది.

01/15/2016 - 07:23

సూర్యాపేట, జనవరి 14: సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ ప్రత్యేకంగా నడుపుతున్న బస్సులు ఖాళీగా తిరిగి వెళ్తున్నాయి. పండుగను తమతమ స్వస్థలాల్లో జరుపుకునేందుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యంకోసం హైదరాబాద్ నుంచి వందల సంఖ్యలో బస్సులను విజయవాడ, రాజమండ్రి, ఖమ్మం, భద్రాచలం తదితర ప్రాంతాలకు నడిపారు.

01/15/2016 - 07:09

హైదరాబాద్, జనవరి 14: హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు వీలుగా తిరుగు ప్రయాణంలో మరిన్ని రైళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రైల్వే బోర్డు చైర్మన్ ఎకె మిట్టల్‌ను కోరారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను ఈ నెల 16, 17 తేదీల్లో నడపాలని రైల్వే బోర్డు చైర్మన్‌కు సూచించారు.

01/15/2016 - 07:08

హైదరాబాద్, జనవరి 14: జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో వేడి పెరిగింది. కాంగ్రెస్ అగ్రనేతలు ఒక్కొక్కరుగా రంగంలో దిగి టిఆర్‌ఎస్‌పై ముప్పేట దాడిని ముమ్మరం చేశారు. గురువారం కేంద్ర మాజీ మంత్రులు ఎస్ జైపాల్ రెడ్డి, రేణుకా చౌదరి వేరు వేరుగా మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నమ్మవద్దని, కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలని ఓటర్లను కోరారు.

01/15/2016 - 07:07

హైదరాబాద్, జనవరి 14 : రాష్ట్ర ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రాంతంలోని అర్చకులు, మతపరమైన ఆలయ సిబ్బంది (రిలీజియస్ ఎంప్లాయిస్) నిరాశకు గురవుతున్నారు. ఆలయాల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (ఇఓ), ఆ పైస్థాయి ఉద్యోగుల తరహాలో తమకు కూడా ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్న ప్రధాన డిమాండ్‌తో గత ఏడాది కాలంగా ఏదో ఒకరకమైన ఆందోళన చేస్తూనే ఉన్నారు.

01/15/2016 - 07:06

తిరుమల, జనవరి 14 : శ్రీవారి ఆలయంలో పని చేసే సిబ్బంది నేరుగా ఆలయంలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ ప్రవేశ మార్గం గుండా ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు గురువారం ఆలయంలోకి ప్రవేశించారు. డ్రైవర్లు ఖాకీ డ్రస్సు వేసుకోవడంతో భద్రతా సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. అయితే సిసి కెమేరాలు వాళ్లను పట్టించాయి. సిసి కెమేరాలను పర్యవేక్షించే సిబ్బంది అప్రమత్తమై డ్రైవర్లను పడికావలి వద్ద ఆపేశారు.

01/15/2016 - 07:19

హైదరాబాద్, జనవరి 14: అంతర్జాతీయ పంతగుల పోటీకి ఈసారి హైదరాబాద్ వేదికైంది. గురువారం ఆగాఖాన్ అకాడమీలో పర్యాటక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ పోటీలను ప్రారంభించారు. అంతర్జాతీయ పతంగుల పోటీలను తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. గతంలో ఈ పోటీలను గుజరాత్‌లో మాత్రమే నిర్వహించే వారని, హైదరాబాద్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి అని మంత్రి అన్నారు.

01/15/2016 - 06:52

న్యూఢిల్లీ,జనవరి 14: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కరువు సహాయం కింద 791 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ వైపరీత్యాల సహాయ నిధి (నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్) నుండి ఈ మేరకు సాయం అందించాలని నిర్ణయించారు.

01/15/2016 - 06:50

విజయవాడ, జనవరి 14: హైదరాబాద్ ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణ కోసం, ఆ ప్రాంత అభివృద్ధి కోసం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. గురువారం ఉదయం తన నివాస గృహం నుంచి హైదరాబాద్‌కు చెందిన తెలుగుదేశం ప్రముఖులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

01/15/2016 - 06:45

హైదరాబాద్, జనవరి 14:జిహెచ్‌ఎమ్‌సి ఎన్నికల్లో విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అధికార తెరాస తొలి జాబితాపై కసరత్తు మొదలు పెట్టింది. ఎవరికి టికెట్ దక్కుతుంది..ముఖ్యంగా తొలి జాబితాలో ఎవరికి చోటు లభిస్తుందన్న ఉత్కంఠ నేపథ్యంలో పలు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Pages