S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/20/2015 - 23:30

గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న అందాల భామ సమంతా ఇప్పుడు ఓ లేడీ
ఓరియెంటెడ్ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం తెలుగులో
మహేష్ సరసన ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటిస్తున్న ఈమె తమిళంలో సూర్య
సరసన ‘24’, విక్రం సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమాల తరువాత విక్రం కుమార్

12/20/2015 - 23:28

అనుమానాస్పద స్థితిలో మరణించిన నటుడు రంగనాథ్‌కు తెలుగు చలనచిత్రసీమ, అభిమానులు అంతిమవీడ్కోలు పలికారు. అశ్రునివాళి అర్పించారు. శనివారం ఆయన ఆత్మహత్య పాల్పడిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన మృతదేహాన్ని ఫిలింనగర్‌లోని ఫిలింఛాంబర్‌లో ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచారు. అనంతరం బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు.

12/20/2015 - 23:23

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ‘డిక్టేటర్’ చిత్రం ఆడియోఫంక్షన్‌ను
ఆదివారం సాయంత్రం అట్టహాసంగా నిర్వహించారు. బాలకృష్ణ, అంజలి
జంటగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
వీరంతా బస్సుల్లో హైదరాబాద్‌నుంచి అమరావతికి వెళ్లారు. మార్గం
అంతటా బాలకృష్ణ బృందానికి అభిమానులు నీరాజనాలు పలికారు.

12/20/2015 - 22:20

నవీన్ సంజయ్, తనిష్ తివారి, తన్వి మల్హర్ ముఖ్య పాత్రలో ప్రేమరాజ్ దర్శకత్వంలో బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై మురళి బొమ్మకు నిర్మిస్తున్న ‘శరణం గచ్చామి’ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. హీరో హీరోయిన్స్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇవ్వగా, బొమ్మకు లక్ష్మి నరసమ్మ స్విచ్ ఆన్ చేయగా సానా యాదిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించాడు.

12/20/2015 - 22:19

సువర్ణ క్రియేషన్స్ పతాకంపై పి.డి.రాజు ప్రధాన పాత్రలో టి.సుధాకర్ రూపొందిస్తున్న చిత్రం ‘తొలి కిరణం’. జె.జాన్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం సారధి స్టూడియోలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ప్రపంచానికి వెలుగు చూపిన ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.

12/20/2015 - 22:16

శే్వతామీనన్ ప్రధాన పాత్రలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు రూపొందిస్తున్న ‘షీ’ (ఈజ్ వెయిటింగ్) చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో ఫారెస్ట్ లొకేషన్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశంపై రమ్య క్లాప్ ఇవ్వగా, అనూప్‌సింగ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పూరి జగన్నాథ్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

12/20/2015 - 22:04

శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ‘ఎక్స్‌ప్రెస్ రా జా’ చిత్రం సూపర్‌హిట్ కావాలని హీరో ప్రభాస్ ఆకాంక్షించాడు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ప్రభాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ సీడీని, ఆడియో సీడీని ఆవిష్కరించారు.

12/20/2015 - 07:28

ఏలూరు, డిసెంబర్ 19: జిల్లాలోని గోపాలపురం మండలం సంజీవపురం గ్రామాన్ని జనవరి 5వ తేదీన పర్యటిస్తానని ఆనాటికల్లా నిర్ధేశించిన ప్రగతి లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం సంజీవపురం గ్రామ పంచాయతీలో అభివృద్ధి సంక్షేమ పధకాల అమలు తీరుపై వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు.

12/20/2015 - 07:27

ఆకివీడు, డిసెంబర్ 19: రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ ఈనెల 25వ తేదీన ఆకివీడు మండలం అయిభీమవరం గ్రామానికి రానున్న సందర్భంగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. అయిభీమవరం రోడ్డు నుండి గ్రామనడిబొడ్డు వరకు ఆర్‌అండ్‌బి రహదారికి మరమ్మతులు ప్రారంభించారు. అలాగే అయిభీమవరం రోడ్డులో ఆదర్శ కానె్వంట్ ఎదురుగా ఉన్న విశాలమైన ప్రాంగణంలో మూడు హెలిప్యాడ్‌లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

12/20/2015 - 07:26

దేవరపల్లి, డిసెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల ఉనికిని దెబ్బతీయడానికి అప్రజాస్వామిక విధానాన్ని అవలంబిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. శనివారం ఆయన దేవరపల్లిలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజాపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం సమంజసం కాదన్నారు.

Pages