S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2015 - 06:14

నెల్లూరు, డిసెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం జిఓఆర్‌టి నెం 1221 ప్రకారం 2828 మంది ప్రైవేట్ సర్వేయర్లను నియమించి వారిచే విధులు నిర్వహించుకోవాలనే నిర్ణయంపై నిరసన స్వరం వ్యక్తమవుతోంది. మంగళవారం జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సర్వేయర్లంతా నెల్లూరు కలెక్టరేట్‌కు తరలివచ్చి తమ నిరసనలకు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ సర్వేయర్లకు విఘాతంగా మారిన పై జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

12/09/2015 - 06:13

* చంద్రగిరి ఎమ్మెల్యే ధ్వజం
* బెయల్‌పై విడుదలైన చెవిరెడ్డి

12/09/2015 - 06:12

ముత్తుకూరు, డిసెంబర్ 8: చెన్నై వరద బాధితులకు సేవలు అందించేందుకు కృష్ణపట్నం పోర్టు సివిఆర్ ఫౌండేషన్ ద్వారా 500 మందితో కూడిన బృందం పని చేస్తోందని ఓడరేవు యాజమాన్యం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో వరద బాధితులకు అందించిన సేవా కార్యక్రమాలపై సివిఆర్ ఫౌండేషన్ సేవా వివరాలను మంగళవారం విలేఖర్లకు తెలిపింది. సుమారు రెండు రాష్ట్రాల్లో లక్ష ఆహారపొట్లాలను వరద బాధితులకు అందజేశామన్నారు.

12/09/2015 - 06:12

నెల్లూరు, డిసెంబర్ 8: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం నివేదికలపై జిల్లావాసులు ఆశల మోసులు పెట్టుకున్నారు. జిల్లా పరిధిలో 2,554 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు స్థానిక అధికార యంత్రాంగం నివేదికలు పంపించింది. ఈ నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి చేరాయి. నివేదికలకు తుదిరూపుగా నిర్ధారించేందుకు కేంద్ర బృందం తరలిరానుంది.

12/09/2015 - 06:11

రాంచీ, డిసెంబర్ 8: టి-20, వనే్డ ఫార్మెట్స్‌లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఈనెల 10 నుంచి 18వ తేదీ వరకూ జరిగే విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో వరుణ్ ఆరోన్ కెప్టెన్సీలో మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జార్ఖండ్ జట్టులో ధోనీని చేర్చారు.

12/09/2015 - 06:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: సహజంగా బిడ్స్‌లో ఎక్కువ మొత్తాన్ని కోట్ చేసిన వారికే కాంట్రాక్టు లభిస్తుంది. అయితే, రివర్స్ బిడ్ విధానం దీనికి భిన్నంగా ఉంటుంది. ముందుగానే బిడ్స్‌కు గరిష్ట పరిమితిని నిర్ణయిస్తారు. కాంట్రాక్టు కోరుకునే వారంతా అంతకు మించకుండా మొత్తాలను కోట్ చేయాల్సి ఉంటుంది. తక్కువ మొత్తం కోట్ చేసిన వారికే కాంట్రాక్టు దక్కుతుంది.

12/09/2015 - 06:10

లండన్, డిసెంబర్ 8: పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడడం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉందని, తప్పకుండా ఆడి తీరాలన్న నిబంధన ఏదీ లేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జెఫ్ బాయ్‌కాట్ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ వనరులున్న క్రికెట్ బోర్డుగా ఎదిగింది కాబట్టి బిసిసిఐ చెప్పిందే ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో శాసనమవుతుందని వ్యాఖ్యానించాడు.

12/09/2015 - 06:10

* అభ్యర్థులు ఎస్.జగదీశ్వర్‌రెడ్డి, కె.నారాయణరెడ్డిలు

12/09/2015 - 06:09

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరుగుతుందా? లేదా? అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతున్నది. శ్రీలంకలో సిరీస్ ఆడాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఇటీవల నిర్ణయించాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ప్రతిపాదన పంపిన వెంటనే నవాజ్ షరీఫ్ సర్కారు ఆమోద ముద్ర వేసింది. దీనితో ఇప్పుడు బంతి భారత్ కోర్టులో ఉంది.

Pages