S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/07/2015 - 11:52

చిత్తూరు: చిత్తూరు మేయర్ అనూరాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూకు సహకరించిన నలుగురు యువకులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. చింటూకు వీరు వాహనాలు, తుపాకులు సమకూర్చినట్టు పోలీసులు తెలిపారు.

12/07/2015 - 11:51

దిల్లీ: సిపిఐ సీనియర్ నాయకుడు ఎ.పి.బర్దన్ అస్వస్థతకు గురవడంతో ఆయనను సోమవారం ఉదయం ఇక్కడి రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు.

12/07/2015 - 11:50

హైదరాబాద్: తాను తెరాసలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఐతే ఆ పార్టీ నేతలు తనను ఆహ్వానించిన మాట నిజమేనని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ సోమవారం స్పష్టం చేశారు. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తాను కష్టపడి కృషి చేస్తానని చెప్పారు. గ్రేటర్ ఎన్నికలపై మంగళవారం కార్యకర్తలతో సమావేశం జరుగుతుందని చెప్పారు.

12/07/2015 - 11:50

విజయవాడ: ఎ.పి. రాజధాని అమరావతి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనేందుకు మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో రాష్ట్ర మంత్రి పరిటాల సునీత సోమవారం ఉదయం గృహ ప్రవేశం చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో మంత్రి రావెల కిషోర్‌బాబు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మరి కొందరు మంత్రులు తమకు అనువైన ఇళ్ల కోసం గాలిస్తున్నారు.

12/07/2015 - 11:50

ఖమ్మం: అశ్వారావుపేటలోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అనుమానితులను ప్రశ్నించి 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

12/07/2015 - 11:49

విజయవాడ: టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించే జన చైతన్య యాత్రలో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత, ఎ.పి. సి.ఎం. చంద్రబాబు సోమవారం ఉదయం విజయనగరం చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. టిడిపి యువనేత లోకేష్ విశాఖ జిల్లాలో జన చైతన్య యాత్రలో పాల్గొంటున్నారు.

12/07/2015 - 11:49

శ్రీనగర్: అనంతనాగ్ జిల్లా బిజ్‌బిహారా ప్రాంతంలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు సిఆర్‌పిఎఫ్ జవాన్ల వాహనాలపై ఆకస్మికంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.

12/07/2015 - 11:48

విజయవాడ: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని అభిషేకాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భీమవరంలోని సోమేశ్వరాలయం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, పాలకొల్లు, అమరావతి, తెలంగాణలోని వేములవాడ, కీసర, కాళేశ్వరం, భద్రాచలం తదితర ఆలయాల్లో భక్తులు పోటెత్తారు.

12/07/2015 - 11:47

కరీంనగర్: పెద్దపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం వరంగల్ జిల్లా చిట్యాలకు చెందిన ప్రశాంత్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

12/07/2015 - 11:47

చెన్నై: భారీ వర్షాలతో కొద్దిరోజులుగా అతలాకుతలమైన చెన్నై నగరం క్రమంగా కుదుటపడుతోంది. వర్షం తెరిపిచ్చి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో రోడ్లపై జన సంచారం పెరిగింది. విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థలను పునరుద్ధరిస్తున్నారు. ఐతే ఎక్కడ చూసినా బురద, చెత్తకుప్పలు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. సుమారు 5,500 పునరావాస కేంద్రాల్లో బాధితులకు సహాయక చర్యలు అందిస్తున్నారు.

Pages