S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2015 - 02:28

హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని ఆదుకునేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.137 కోట్లు నిధులు అందించే ఏర్పాట్లు చేశామని తెలంగాణ రవాణ శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి అన్నారు. రూ.150 కోట్ల వ్యయంతో 500 కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు సిఎం కెసిఆర్ అనుమతి ఇచ్చారని అన్నారు.

11/21/2015 - 02:25

హైదరాబాద్, నవంబర్ 20: నీటిపారుదల ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నిర్మాణంలోవున్న ప్రాజెక్టులతోపాటు కృష్ణానదిపై పాలమూరు, డిండి, గోదావరిపై కాళేశ్వరం, ప్రాణహిత, దుమ్ముగూడెం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతుకు సాగునీరు అందించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.

11/21/2015 - 02:23

హైదరాబాద్, నవంబర్ 20: ప్రభుత్వ కార్యాలయాల్లో, అధికారిక కార్యకలాపాల్లో దుబారా అరికట్టాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో ఈ అంశంపై సిఎం చర్చించారు. ఆదా మొత్తాన్ని అభివృద్ధి, సంక్షేమానికి వినియోగించాలని సూచించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా దీన్ని గుర్తించాలని, గతంతో పోలిస్తే పరిస్థితిలో మెరుగుదల కనిపించాలన్నారు.

11/21/2015 - 02:09

తిరుపతి, నవంబర్ 20: చిత్తూరు మేయర్ అనూరాధ దంపతుల హత్యాకాండలో తాము ముందుగా అంచనా వేసినట్లుగా ప్రధాన నిందితుడు కఠారి మోహన్ మేనల్లుడు చింటూనేనని, అతనితోపాటు రెడ్డి అలియాస్ జయప్రకాష్‌రెడ్డి, మరో ముగ్గురు పాల్గొన్నారని వీరిలో చింటూ, వెంకటేష్ పారిపోగా జయప్రకాష్‌రెడ్డి, వెంకటాచలపతి, మంజునాథ్ పోలీసులకు లొంగిపోయారని చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.

11/21/2015 - 02:06

బైరెడ్డిపల్లె, నవంబర్ 20: బంధువుల వివాహ మహోత్సవానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తూ ఐదు నిమిషాల్లో గమ్యం చేరనున్న నేపథ్యంలో చిత్తూరు నుండి కుప్పంకు వెళ్తున్న బస్సును, బైరెడ్డిపల్లె గ్రామంలోకి వెళ్తున్న కారు ఢీకొన్న సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఈరోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందడంతో మృతుల స్వగ్రామమైన మిట్టకురపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

11/21/2015 - 02:04

విజయవాడ, నవంబర్ 20: ప్రపంచం మెచ్చే స్థాయిలో కొత్త రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాల నిర్మాణాలు జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. దేశంలో తొలిసారి ప్రభుత్వ విభాగాలు, పథకాలు, కార్యక్రమాలన్నింటినీ ఆన్‌లైన్ చేసి ఆధునిక పరిపాలనకు రూపాంతరం చెందామని, కొత్త రాజధానిలో ప్రభుత్వ సముదాయాలు దానికి తగినట్టుగా అత్యంత ఆధునికంగా ఉండాలని సూచించారు.

11/21/2015 - 02:02

న్యూఢిల్లీ, నవంబర్ 20: జిఎస్టీ అమలుతో రాష్ట్రాలకు వివిధ రూపాల్లో ఎదురయ్యే నష్టాల భర్తీకి నష్టపరిహారాల చెల్లింపు నిధి ఏర్పాటు చేసి తీరాలని ఆంధ్రప్రదేశ్ కరాఖంఢిగా చెప్పింది. నిధి ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేసి బిల్లులో పొందుపర్చి తీరాలన్న తమ డిమాండ్‌ను ఆమోదించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

11/21/2015 - 02:00

నెల్లూరు/ వెంకటగిరి/ కడప, నవంబర్ 20: భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులు అధైర్యపడాల్సిన పని లేదని, అన్ని విధాలా ఆదుకుంటామని సిఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. శుక్రవారం కడప, నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. పండ్లతోటలకు ఎకరాకు పదివేలు, దెబ్బతిన్న చేనేత మగ్గాలకు తక్షణం పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల్లో దెబ్బతిన్న ప్రాంతాలను యుద్ధప్రాతిపదికను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.

11/21/2015 - 01:58

బమాకో (మాలీ), నవంబర్ 20: ఇస్లామిక్ మిలిటెంట్లు మళ్లీ పేట్రేగిపోయారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో మారణకాండ సృష్టించి వారం తిరక్క ముందే పశ్చిమాఫ్రికా దేశమైన మాలిపై విరుచుకు పడ్డారు. మాలి రాజధాని బమాకో..ఇస్లామిక్ ఉగ్రవాదుల నరమేధానికి వేదికగా మారింది. రాడిసన్ బ్లూ అనే హోటల్‌పై శుక్రవారం ఉదయం తెగబడ్డ ఉగ్రవాదులు 170మందిని బందీలుగా చేజిక్కించుకున్నారు. 22మందిని హతమార్చారు.

11/21/2015 - 01:16

కిటికీ తెరిస్తే.. .. ..
విహారి కథానికలు
వెల: రు.110/-
ప్రతులకు: 1) చినుకు పబ్లికేషన్సు
గరికపాటి వారి వీధి
గాంధీనగర్, విజయవాడ- 520 003
2) జె.యస్.మూర్తి
16-11-310/12/ఎ/1/1
గణపతి గుడి బజారు
మలక్‌పేట, హైద్రాబాదు- 500 036
సెల్: 98480 25600

Pages