S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/24/2015 - 11:00

* నోటిఫికేషన్ జారీచేసిన ఎక్సైజ్‌శాఖ ఇన్‌చార్జి డిసి బాబ్జీరావు

06/24/2015 - 11:00

* సింగ్‌పూర్ ప్రతినిధులకు వివరించిన కమిషనర్ వీరపాండియన్

06/24/2015 - 10:56

న్యూఢిల్లీ, జూన్ 23: భారత దేశాన్ని రెడ్‌టేప్ నుంచి రెడ్ కార్పెట్ దిశగా సంస్కరణ పథంలో పరుగులు పెట్టించాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో సంస్కరణల అమలు వేగం పెరగాలని ఇటు కార్పొరేట్లను అటు పౌరులను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగడమే వీటి ఉద్దేశమని వెల్లడించారు.

06/24/2015 - 10:54

న్యూఢిల్లీ, జూన్ 23: మాజీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ తప్పుడు డిగ్రీలకు సంబంధించి తనకు ముందస్తుగా సమాచారం లేదని, అవి బూటకపు డిగ్రీలన్న సంగతే తనకు తెలియదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశంలో తోమర్ డిగ్రీల వ్యవహారం దుమారం రేపిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. బిజెపి సభ్యులు ఈ అంశంపై అసెంబ్లీలో రాద్దాంతం సృష్టించారు.

06/24/2015 - 10:54

న్యూఢిల్లీ, జూన్ 23: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడిఎంకె అధినేత్రి జయలలితను నిర్దోషిగా హైకోర్టు తీర్పును కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో జయలలిత మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మే 11న జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళ, ఆమె ఇద్దరు బంధువులు విఎన్ సుధాకరన్, ఎలవారసిలను హైకోర్టు నిర్దోషులుగా తీర్పునిచ్చింది.

06/24/2015 - 10:53

న్యూఢిల్లీ, జూన్ 23: యోగాను వ్యతిరేకించేవారు భారత్‌లో ఉండే హక్కులేదని, అలాంటివారు పాకిస్తాన్ వెళ్లివచ్చంటూ విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వీ ప్రాచీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్‌బి) యోగాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో విహెచ్‌పి స్పందించింది. ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీపైనా సాధ్వీ విమర్శలు గుప్పించారు.

06/24/2015 - 10:45

లాస్‌ఏంజెల్స్ : ప్రముఖ హాలీవుడ్ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత జేమ్స్ హూర్నర్ విమాన ప్రమాదంలో మృతిచెందారు. ప్రఖ్యాత సినిమా టైటానిక్‌కు ఆయన సంగీతం సమకూర్చారు. ఈసినిమాకు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. అలాగే అవతార్, ఏ బ్యూటీఫుల్ మైండ్ సినిమాలకు ఆయన సంగీతం సమకూర్చారు.

06/24/2015 - 10:36

హైదరాబాద్, జూన్ 23: ఇరవై సంవత్సరాల తర్వాత నీటి తీరువాను పెంచాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు నీటి తీరువాను ఏమేరకు పెంచాలో ప్రతిపాదనలు సిద్ధమై ఆర్థిక శాఖకు చేరాయి. భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద ఉండే ఆయకట్టు రైతుల నుంచి నీటి తీరువాను ప్రభుత్వం వసూలు చేస్తోంది. గతంలో 1996లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నీటి తీరువాను పెంచింది.

06/24/2015 - 10:35

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణలో లారీల యజమానులు సమ్మె సైరన్ మోగించారు. డిమాండ్ల పరిష్కారంపై లారీ యజమానుల సంఘం నేతలు మంగళవారం ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. లారీ యజమానులు ముందుంచిన డిమాండ్లను పరిష్కరించేందుకు వారం గడువుకావాలని ప్రభుత్వం కోరింది. ఇందుకు లారీ యజమానులు అంగీకరించపోవడంతో ముందుగా ప్రకటించినట్లుగానే మంగళవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నామని వారు స్పష్టం చేశారు.

Pages