S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/21/2019 - 02:30

విజయవాడ (ఎడ్యుకేషన్), ఏప్రిల్ 20: ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, మెడికల్‌లో కొన్ని విభాగాలకు సంబంధించి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు జిల్లాలో శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శనివారం ప్రారంభమైన పరీక్షలు ఈనెల 24వరకు జరగనున్నాయి. పరీక్షలకు నిర్వహణకు గాను జిల్లాలో మొత్తం 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

04/21/2019 - 02:30

విజయవాడ, ఏప్రిల్ 20: రబీ పంట సాగులో రైతు పండించిన చివరి ధాన్యపు బస్తా వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. శనివారం బాపులపాడు మండలం బండిపాలెం, నందిగామ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.

04/21/2019 - 02:29

విజయవాడ, ఏప్రిల్ 20: క్రీస్తును స్తుతిస్తూ శనివారం ఉదయం విజయవాడ బిషప్ హజరయ్య స్కూల్ ప్రాంగణం నుంచి రన్ ఫర్ జీసస్ (ఏసు కోసం పరుగు) కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. తొలి సంధ్యావేళలో వేలాది మంది క్రైస్తవులు రన్ ఫర్ జీసస్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

04/21/2019 - 02:28

ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 20: ఇంద్రకీలాద్రిపై శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలు సందర్భంగా 6వ రోజైన శనివారం రాత్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామికి పవళింపుసేవ ఘనంగా జరిగింది. స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో ఋత్వికులు దేవస్ధానం ఈవో వీ కోటేశ్వరమ్మ దంపతుల చేత శ్రద్ధతో ఈకార్యక్రమాన్ని చేయించారు.

04/21/2019 - 02:28

విజయవాడ, ఏప్రిల్ 20: రైతుల సందడితో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఊపందుకుందని నేటి వరకు సుమారు 39వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ డా. కృతికా శుక్లా అన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణపై శనివారం పౌర సరఫరాల అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ నగరంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

04/21/2019 - 02:26

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం దుర్గమారణ్యాలతో నిండి ఉంటుంది. ఇక్కడ అనాదిగా ఆదివాసీలు జీవిస్తున్నారు. క్రైస్తవ మిషనరీలు మత పరివర్తనలకు ఇలాంటి ప్రాంతాలనే ఎంచుకున్నాయి. చైనా ప్రేరేపిత ఉగ్రవాదులకు ఈ అడవులపై మంచి పట్టు ఉంది. దంతెవాడ, సుకుమా వంటి ప్రాంతాల్లో వేలకొద్ది మావోయిస్టులు ఉన్నారు. ఇక్కడ రహస్యంగా గంజాయి సాగు జరుగుతూ ఉంటుంది.

04/21/2019 - 02:23

మ నిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఆధారం భూమి మాత్రమే. గాలి, నీరు, అగ్ని, నేల, ఆకాశం అనే పంచభూతాల వల్లే మానవ జాతి మనుగడ సాధ్యమవుతుంది. వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం స్తంభించక తప్పదు. భూమి సారవంతంగా, సస్యశ్యామలంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ, అగ్రరాజ్యాల అంతులేని ఆధిపత్య దాహమే భూమండలం కాలుష్యానికి చిరునామాగా మారింది.

04/21/2019 - 02:21

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అలాగని ప్రజలు విచ్చలవిడితనంతో వ్యవహరించేందుకు వీల్లేదు. ముందుగా ఏర్పరచుకున్న నియమాలు- నిబంధనలు, మర్యాదలు- మన్ననలను ఆదరించాలి. అప్పుడే దానికి అర్థం.. ప్రజాస్వామ్యానికి పరమార్థం. దీనే్న బాధ్యత అంటారు. నేనొక్కడినే ఓటేయకపోతే ఏమవుతుందన్నట్టుగానే నేనొక్కడినే బాధ్యతను నిర్వర్తించకపోతే ఏమవుతుంది? నేనొక్కడినే క్రమశిక్షణను పాటించకపోతే, నిబంధనలు అతిక్రమిస్తే ఏమవుతుంది?

04/21/2019 - 02:18

మహేశ్వరం, ఏప్రిల్ 20: ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొనగా అందులో ప్రయాణిస్తున్న ఏనిమిదికి తీవ్ర గాయాలైనాయి. చికిత్స నిమిత్తం రెండు అంబులెన్సుల్లో శంషాబాద్ ఆసుప్రతికి తరలించినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రమాదం హైదారాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై అవేర్‌గేటు వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.

04/21/2019 - 02:17

హైదరాబాద్: మహానగరంలో చినుకు పడితే చాలు సామాన్యులకు అన్నీ చిక్కులే. మెట్రోరైలుకు రోడ్డు విస్తరణ చేపట్టి వదిలేసిన ప్రాంతాలు, వివిధ ప్రాంతాల్లో వాటర్, డ్రైనేజీ పైప్‌లైన్ల కోసం తవ్వి వదిలేసిన గుంతలతో ద్విచక్ర వాహనదారులు వర్షం పడుతున్నపుడు ముందుకు కదలటం గగనంగా మారింది.

Pages