S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/14/2018 - 23:43

సత్తుపల్లి, నవంబర్ 14: ఉమ్మడి రాష్ట్రాన్ని 67 ఏళ్ళపాటు పరిపాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల్లో రైతులకు 24గంటలు కరెంటు ఉంటే అది వార్త, కాని 4 ఏళ్ళ తెలంగాణా ప్రభుత్వంలో కరెంటుపోతే వార్త అవుతుందని టీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

11/14/2018 - 23:43

ఖమ్మం, నవంబర్ 14: నామినేషన్ల పర్వం మొదలవగానే అసంతృప్తుల బెడద కూడా అధికమైంది. టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా రెండునెలల ముందే ప్రకటించినప్పటికీ ఇప్పుడు కొందరు అసంతృప్తులు రెబల్‌గా నామినేషన్లు వేయడం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ప్రకటన సమయంలో వైరా, మధిర, సత్తుపల్లి అభ్యర్థులపై వచ్చిన అసంతృప్తిని టిఆర్‌ఎస్ అధినేతలు కలుగజేసుకొని వాటిని సర్దుబాటు చేశారు.

11/14/2018 - 23:42

ఖమ్మం(గాంధీచౌక్), నవంబర్ 14: ప్రజల అభీష్టం మేరకే ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని, ఇకనుంచి ఖమ్మంలోనే ఉండి ప్రజలకు సేవ చేస్తానని ఖమ్మం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఖమ్మం నగరానికి చేరుకున్న ఆయనకు మహాకూటమి శ్రేణులు ఘనస్వాగతం పలికారు. వందలాది వాహనాలతో ఆయనకు ఎదురేగి స్వాగతం పలికి నగరంలోకి తీసుకువచ్చారు.

11/14/2018 - 23:42

వేంసూరు, నవంబర్ 14: జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందిన సంఘటనలు బుధవారం జరిగాయ. ఓ ప్రమాదంలో అక్క తమ్ముడు మృతి చెందగా మరో ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..

11/14/2018 - 23:41

మధిఠ నవంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికలు 60 ఏళ్ళపాటు ప్రజలను క్షోభకు గురిచేసిన ఢిల్లీ కాంగ్రెస్ దొరల అహంకారానికి తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కేటీటిఆర్ పేర్కొన్నారు.

11/14/2018 - 23:40

గార్ల, నవంబర్ 14: చట్ట వ్యతిరేక కార్యకలపాలతో ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కోట్యానాయక్‌తండాకు చెందిన తేజావత్ చందుపై పీడీ యాక్టు నమోదు చేసి వరంగల్ జైలుకు తరలించినట్లు గార్ల, బయ్యారం సీఐ వై రమేష్ తెలిపారు.

11/14/2018 - 23:40

ఖమ్మం(మామిళ్ళగూడెం), నవంబర్ 14: ఎన్నికల నామినేషన్ల దాఖలుకు మూడవరోజైన బుధవారం జిల్లాలో మొత్తం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. మధిర టిఆర్‌ఎస్ అభ్యర్థిగా లింగాల కమలరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులతో కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు.

11/14/2018 - 23:39

ఖమ్మం(గాంధీచౌక్), నవంబర్ 14: టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకురాలు రాయల లత బుధవారం నామా ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఖమ్మం మహాకూటమి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో ఎంపీటీసీగా ఎన్నికై తెలుగుదేశం పనిచేశారు. తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం నుండి టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరిన సమయంలో ఆమె కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.

11/14/2018 - 23:38

న్యూఢిల్లీ, నవంబర్ 14: మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటికే ఐదుసార్లు గోల్డ్‌మెడల్స్ కైవసం చేసుకున్న భారత స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్ గురువారం నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న ప్రపంచ టోర్నమెంట్‌లో మరో గోల్డ్‌మెడల్ సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈనెల 15 నుంచి 24 వరకు ఏఐబీఏ మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్న 10వ ఈ టోర్నీకి దేశ రాజధాని న్యూఢిల్లీ రెండోసారిగా వేదిక కానుంది.

11/14/2018 - 23:38

నేలకొండపల్లి, నవంబర్ 14: పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా కందాల ఉపేందర్‌రెడ్డి అధిష్టానం ఎంపిక చేసింది. కందాల ఉపేందర్‌రెడ్డి 9జనవరి 1960సంవత్సరంలో రాజ్‌పేట గ్రామంలో నర్సింహరెడ్డి మోహినిదేవి దంపతులకు జన్మించాడు. కందాల ఉపేందర్‌రెడ్డి సైఫాబాద్ సైన్స్ కళాశాలలో బిఎస్సీని పూర్తి చేశారు. కందాలకు బార్య విజయ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

Pages