S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/24/2019 - 01:34

నేపియర్, జనవరి 23: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో అరుదైన ఘనతను సాధించాడు. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి వనే్డలో కోహ్లీ 45 పరుగులు చేశాడు. వనే్డల్లో మొత్తం 10430 పరుగులు చేయడం ద్వారా వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా రికార్డు (10405)ను అధిగమించాడు. అంతేకాకుండా ప్రపంచ బ్యాట్స్‌మెన్‌లలో ఈ రికార్డు సాధించిన 10వ క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.

01/24/2019 - 01:33

నేపియర్, జనవరి 23: టీమిండియా పేసర్, 28 ఏళ్ల మహమ్మద్ షమీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 6 ఓవర్లలో 19 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో వనే్డల్లో వేగంగా 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా షమీ రికార్డు పుటల్లో చోటుదక్కించుకున్నాడు. కివీస్‌తో జరిగిన 50 ఓవర్ల మ్యాచ్ షమీకి 56వది కావడం గమనార్హం.

01/24/2019 - 01:32

మెల్‌బోర్న్, జనవరి 23: అమెరికా టెన్నిస్ స్టార్, నల్లకలువ, 24వసారి గ్రాండ్ శ్లామ్ టైటిల్ చేజిక్కించుకోవాలని ఉబలాటపడిన ప్రపంచ నెంబర్ 16 క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో నిరాశే ఎదురైంది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో తన సమీప ప్రత్యర్థి, వరల్డ్ నెంబర్ 7 ర్యాంకర్, చెక్ క్రీడాకారిణి కరొలినా ప్లిస్కోవా చేతిలో ఓటమిని ఎదుర్కొంది.

01/24/2019 - 01:28

నేపియర్, జనవరి 23: గత ఏడాది టీ-20 వరల్డ్ కప్ సందర్భంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో చోటుదక్కని భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో ఇపుడు న్యూజిలాండ్‌లో ఆ జట్టు మూడు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు సిద్ధమవుతోంది. గురువారం ఇక్కడి మైదానంలో తొలి వనే్డలో భారత వనే్డ ఇంటర్నేషనల్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ నాయకత్వంలో జట్టు సత్తా చూపాలని ఉవ్విళ్లూరుతోంది.

01/24/2019 - 01:22

ముంబయి, జనవరి 23: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో బుల్న్‌క్రు ఏమాత్రం కొనసాగకపోవడంతో బుధవారం భారీగా నష్టాలను ఎదుర్కొంది. సెనె్సక్స్ ఏకంగా 336.17 పాయింట్లు పతనమై 36,108.75 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఇదే తరహాలో నష్టాలను ఎదుర్కొంది. 91.25 పాయింట్లు పతనం కావడంతో 10,831.50 పాయింట్లకు చేరింది.

01/24/2019 - 01:21

కోల్‌కతాలో బుధవారం ఎస్‌యూవీ ‘కిక్స్’ వాహనాన్ని మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న
నిస్సాన్ ఇండియా ఆపరేషనల్స్ ప్రెసిడెంట్ థామస్ క్యూల్

01/24/2019 - 01:19

చెన్నైలో రెండు రోజుల ‘గ్లోబల్ ఇనె్వస్టర్స్ మీట్’ (జీఐఎం) ప్రారంభోత్సవ కార్యక్రమంలో
ప్రసంగిస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

01/24/2019 - 01:15

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఇటీవల కోల్‌కతలో జరిగిన మహార్యాలీలో విపక్ష పార్టీల డొల్లతనం మరోసారి బహిర్గతమైంది. ఈ ర్యాలీలో నేతల ప్రసంగాల తీరు చూస్తే- ‘బీజేపీ మతతత్వ విధానాలను భరిస్తాం కాని ప్రధాని నరేంద్ర మోదీని సాగనంపే దాకా నిద్రపోం..’ అనే సంకేతాలు ఇచ్చారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా బలమైన అజెండాను ఖరారు చేయడంలో విపక్ష నేతలు విఫలమయ్యారు.

01/24/2019 - 01:13

త్రేతాయుగానికి చెందిన శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా నిలిచినందునే లక్షల సంవత్సరాల తర్వాత కూడా తమకు రామరాజ్యం కావాలని స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న యావత్ ప్రజలు, నాయకులు కోరుకునేవారు. స్వాతంత్య్రం సిద్ధించాక భారతదేశానికి తొలి ప్రధానిగా సర్దార్ వల్లభబాయి పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌లలో ఎవరో ఒకరు బాధ్యతలు చేపడితే బాగుండేదని అలనాడు ప్రజలు కోరుకునేవారు.

01/24/2019 - 01:12

ప్రకృతిని పరిరక్షించే పథకాలు, పరిసరాలను పాడుచేసే పనులు సమాంతరంగా కొనసాగుతుండడం విధానాలలో నిహితమై ఉన్న వైరుధ్యాల ఫలితం. ప్రకృతి పట్ల ప్రత్యేకించి పుడమి పట్ల సహజమైన మమకారం సన్నగిల్లిపోవడం ఇందుకు కారణం. సహజత్వం స్థానంలో కృత్రిమ తత్త్వం గూడుకట్టుకుని ఉంది. అందువల్ల ప్రకృతిని, పరిసరాలను పరిరక్షించాలన్న విధానం నినాదాలకు పరిమితమైపోయింది.

Pages