S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/18/2018 - 04:55

* 29నాటికల్లా ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులకు ఆదేశం

10/18/2018 - 02:15

ఆదోని, అక్టోబర్ 17: కర్నూలు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన నిలిపిన టాటాఏస్ వాహనాన్ని ఢీకొన్న లారీ అక్కడే నిద్రిస్తున్న వారిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరంతా కర్నూలు నగరవాసులు. దర్గాలో పిల్లల పుట్టెంట్రుకలు తీసేందుకు వెళ్తూ ప్రమాదం బారిన పడ్డారు.

10/18/2018 - 04:58

బొబ్బిలి (రూరల్), అక్టోబర్ 17: టీడీపీ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఆ పాలనకు చరమగీతం పలకాలని ప్రజలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అధికారంకోసం ఏ పార్టీతోనైనా పొత్తుపెట్టుకునేందుకు సిగ్గుపడని చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.

10/18/2018 - 07:09

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్సులో భాగంగా డిజైన్ చేసిన కొన్ని కీలకమైన పనుల ప్యాకేజీలు మరుగున పడ్డాయి. నేవిగేషన్ చానల్స్, ట్విన్ టనె్నల్స్ సకాలంలో పూర్తయితేనే లక్ష్యం మేరకు నీరందించడానికి అవకాశంవుంది. ఎంతసేపూ స్పిల్, స్పిల్ ఛానల్, గేట్లు, కాఫర్ డ్యామ్‌లే తప్ప అనుబంధ ట్విన్ ఛానల్స్, నేవిగేషన్ లాక్స్, నేవిగేషన్ ఛానల్స్ పనులను మర్చిపోయారు. ఈ ప్యాకేజీల్లో కొన్ని రీటెండర్లు పిలిచారు.

10/18/2018 - 02:11

ఆదోని, అక్టోబర్ 17: విజయదశమి రోజు జరిగే కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని గట్టుమల్లయ్య కొండల్లో వెలసిన శ్రీ మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవం సందర్భంగా భక్తులు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీ. స్వామివారి ఉత్సవమూర్తులకు రక్షణగా కొత్తపేట, నెరణికి, నెరణికి తండావాసులు కర్రలు, కాగడాలతో ముందుకుసాగుతారు.

10/18/2018 - 02:00

* హైకోర్టు ఆదేశాల అమలును పరిశీలించిన ప్రభుత్వం

10/18/2018 - 05:11

* ఢిల్లీలో సీనియర్ నేతలతో కుంతియా, ఉత్తమ్ భేటీ

10/18/2018 - 05:45

హైదరాబాద్, అక్టోబర్ 17: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే ప్రకటించలేదు, అలాంటప్పుడు తామేలా కాపీ కొడుతామని టీఆర్‌ఎస్‌లో ముఖ్య నాయకుడు, ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రశ్నించారు. తాము కూడా రైతుబంధు, రైతు బీమా పథకాలను కొనసాగిస్తామంటున్న కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూడా కొనసాగిస్తామని చెబితే బాగుండేదని ఎద్దేవా చేసారు.

10/18/2018 - 07:10

హైదరాబాద్: దసరా పండుగ పర్వ దినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయ దశమి రాష్ట్ర ప్రజానీకానికి ఆనందకర జీవితాన్ని ప్రసాదించాలని, రాష్ట్రం మరింత పురోగతి సాధించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు తమ శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు.

10/18/2018 - 01:53

నాగార్జునసాగర్, అక్టోబర్ 17: రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మాజీ సిఎల్పీ నేత, సాగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కుందూరు జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా సాగర్‌లోని ఆయన నివాసంలో బుధవారం జానారెడ్డి సమక్షంలో త్రిపురారం మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Pages