S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

,
09/17/2019 - 04:12

వరంగల్, సెప్టెంబర్ 16: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట శివారు కడిపికొండలో విషాద వాతావరణం నెలకొంది. విహార యాత్ర విషాద యాత్రగా మారి పడవ మునకతో 9 మంది గల్లంతు కాగా అందులో సోమవారం ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. వారిలో బస్కే అవినాష్, బస్కే రాజేందర్ మృతదేహాలకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించారు.

09/17/2019 - 04:07

మాచారెడ్డి, సెప్టెంబర్ 16: విద్యుత్ షాక్ ముగ్గురు రైతులను పొట్టన బెట్టుకుంది. బోరు బావి నుంచి కాలిపోయన సబ్‌మెర్సిబుల్ మోటార్ పంపుసెట్టు బయటకు తీస్తుండగా పైన ఉన్న 11 కేవీఏ విద్యుత్ లైన్‌కు పైపు తగిలి ముగ్గురు రైతుల అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వెల్పుగొండ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.

09/17/2019 - 04:04

శ్రీశైలం ప్రాజెక్టు, సెప్టెంబర్ 16: జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం పూర్తిగా తగ్గడంతో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని వదులుతున్న వరద గేట్లను సోమవారం ఉదయం మూశారు. సోమవారం సాయంత్రం సమయానికి జూరాల విద్యుత్ కేంద్రం ద్వారా 22,082 క్యూసెక్కులు, సుంకేసుల డ్యాం నుంచి 17,916 క్యూసెక్కులు, మొత్తం 39,916 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు వస్తున్నది.

09/17/2019 - 04:02

హాలియా: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం సమీపంలో గోదావరి నదిలో జరిగిన లాంచీ ప్రమాదంలో నల్లగొండ జిల్లా అనుముల మండలానికి చెందిన సురభి రవీందర్, పాశం తరుణ్‌రెడ్డి గల్లంతయ్యారు.

09/17/2019 - 03:58

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 16: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ శ్రీశైలం నుండి వస్తున్న వరద నీరు తగ్గిపోవడంతో సాగర్ డ్యాం క్రస్టు గేట్ల ద్వారా విడుదల చేస్తున్న నీటిని పూర్తిగా నిలిపివేశారు. దీంతో సాగర్ డ్యాం క్రస్టు గేట్లు మూతపడ్డాయి. గత నాలుగు రోజులుగా సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరగడంతో క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

,
09/17/2019 - 03:55

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 16: తెలంగాణ ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన నాటి నిజాం నవాబు, రజాకార్లకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన సాయుధ పోరాట ఫలితంగానే హైద్రాబాద్ సంస్థానం భారత్ యూనియన్‌లో విలీనమైందని, ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలలో భాగంగా చేపట్టిన బస్ జాత సోమవారం నగరానికి చేరుకుంది.

09/17/2019 - 03:51

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 16: గత మూడు నాలుగు నెలల నుండి నల్లమల అటవీ ప్రాంతం ఆందోళనలకు నిలయంగా మారగా అసెంబ్లీ తీర్మానంతో ఆ ఉద్రిక్తతలు సమసిపోనున్నాయ. యురేనియం తవ్వకాలు జరుగుతాయని అధికారులు హడావిడి చేయడంతో ప్రజలు వాటిని అడ్డుకునేందుకు నల్లమల పరిరక్షణ సమితి పేరిట ఆందోళనలకు దిగారు. నల్లమల బంద్‌కు పిలుపునివ్వడం వంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది.

09/17/2019 - 03:51

వనపర్తి, సెప్టెంబర్ 16: ఓటరు పరిశీలన కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల 15 వరకు పౌరులు వారి వివరాలను పరిశీలించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ తె లిపారు. ఓటరు పరిశీలన కార్యక్రమంపై సోమవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

09/17/2019 - 03:50

సూర్యాపేట, సెప్టెంబర్ 16: సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న నియంతృత్వ, నిరంకుశ విధానాల వల్ల అధికార టీఆర్‌ఎస్‌లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి బద్ధలై త్వరలోనే ఆ పార్టీలో భారీ విస్ఫోటం జరగనుందని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

09/17/2019 - 03:50

విజయవాడ, సెప్టెంబర్ 16: రాష్ట్రంలోని వివిధ పట్టణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు 146.69 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఫెర్ఫార్మెన్సు గ్రాంట్‌గా ఈ నిధులు విడుదల చేస్తూ పాలనామోదాన్ని తెలియచేసింది. ఈ నిధులను ఆయా పట్టణ స్థానిక సంస్థలకు కేటాయించాలని పురపాలక శాఖను ఆదేశించింది.
టెక్నికల్ ప్రాజెక్టుల సలహాదారుగా లోకేశ్వరరెడ్డి

Pages