హైదరాబాద్

ఈవీఎంలపై సందేహాలు తీర్చేందుకు సిబ్బంది రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, అక్టోబర్ 21: ఓటర్ల జాబితా, ఈవీఎంలపై నెలకొన్న సందేహాలను తీర్చేందుకు సిబ్బంది అందుబాటులో ఉన్నారు. 2014కంటే ప్రస్తుతం పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల సరిహద్ధులతోపాటు జిల్లాల సరిహద్ధుల్లో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి నగదు తరలించాలంటే కేవలం రూ.50వేలు మాత్రమే ఉండాలని, అంతకంటే ఎక్కువగా నగదు తరలిస్తే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు భద్రత సిబ్బందికి తెలియజేయాల్సి ఉంటుంది. నగదుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయని పక్షంలో ఎన్నికల కమీషనర్‌కు అందజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తులు మొదలు పెట్టింది. ఇప్పటికే మొదటి దశలో సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించడంతోపాటు ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల్లో మొత్తం 112రెవెన్యూ గ్రామాలతోపాటు మిగతా గ్రామాల్లో 242పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు పనులు మొదలుపెట్టారు. ఓటర్ల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో కొత్తగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాలు చేస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన పక్కా భవనాల్లో పోలింగ్ కేంద్రాలు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు షాద్‌నగర్ ఆర్‌డీఓ ఎం.కృష్ణ వివరించారు. శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ భవనాల స్థానంలో ప్రైవేట్ భవనాలను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అక్టోబర్ 25వ తేది నాటికి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తుది ఓటర్ల జాబితాను అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆర్‌డీఓ తెలిపారు. ఈ జాబితా అధారంగానే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని సరిచేసి జాబితాలో పేర్లు నమోదు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో జరనుగనున్న ఎన్నికలను పకడ్బంధీగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు.