రుచి

కరివేపాకుతో కమ్మటి వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరివేపాకు ప్రతి కూరలోనూ అవసరమే. శరీరంలో రక్తపుష్టికి దోహదపడుతూ ఎనీమియా, మలబద్ధకం,
అజీర్ణం వంటి అనారోగ్యాలను తగ్గించి కరివేపాకు బలం చేకూరుస్తుంది. మొదటి ముద్దలో కరివేపాకు పొడి వేసుకుని తింటే ఎలర్జీలు, జీర్ణకోశ వ్యాధులు,
విరేచనాలు, గ్యాస్టిక్ ట్రబుల్ తగ్గుముఖం పడతాయ. పోపులకు, పులిహోరలో,
పులుసుల్లో వాడే కరివేపాకు మనకు నిజంగా ఆరోగ్య ప్రదాతే.

పచ్చడి

కావాల్సినవి:
చింతపండు గుజ్జు - 4 కప్పులు
ఉప్పు - 5 చెంచాలుపొడి
కావాల్సినవి:
శుభ్రపరచిన కరివేపాకు - 5 కప్పులు
పుట్నాల పప్పు - 1 కప్పు
ధనియాలు - 1 కప్పు
మినప్పప్పు, శనగపప్పు - 1/2 కప్పు
జీలకఱ్ఱ - 5 చెంచాలు
పొడి చింతపండు - 1/2 కప్పు
ఎండుమిర్చి - కొద్దిగా
నూనె - 1/2 కప్పు
ఉప్పు - 4 చెంచాలు

ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. బాణలిలో నూనె వేసి పోపులు, మిర్చి వేయించి, చివరగా కరివేపాకు, ఉప్పు, చింతపండు వేయించాలి. ధనియాలు, పుట్నాల పప్పు వేయించి అన్నీ కలిపి మిక్సీ పట్టాలి. ఈ పొడిలో వెల్లుల్లి కూడా కొద్దిగా కలుపుకోవచ్చు.

పొడి
కావాల్సినవి:
శుభ్రపరచిన కరివేపాకు - 5 కప్పులు
పుట్నాల పప్పు - 1 కప్పు
ధనియాలు - 1 కప్పు
మినప్పప్పు, శనగపప్పు - 1/2 కప్పు
జీలకఱ్ఱ - 5 చెంచాలు
పొడి చింతపండు - 1/2 కప్పు
ఎండుమిర్చి - కొద్దిగా
నూనె - 1/2 కప్పు
ఉప్పు - 4 చెంచాలు

ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. బాణలిలో నూనె వేసి పోపులు, మిర్చి వేయించి, చివరగా కరివేపాకు, ఉప్పు, చింతపండు వేయించాలి. ధనియాలు, పుట్నాల పప్పు వేయించి అన్నీ కలిపి మిక్సీ పట్టాలి. ఈ పొడిలో వెల్లుల్లి కూడా కొద్దిగా కలుపుకోవచ్చు.

గ్రీన్ పకోడీ
కావాల్సినవి:
పుట్నాల పప్పు పొడి - 2 కప్పులు
సోయా పిండి - 1/2 కప్పు
బియ్యం పిండి - 2 చెంచాలు
కార్న్‌ఫ్లోర్ - 1/2 కప్పు
వేరుశనగపొడి - 1 కప్పు
కరివేపాకు - 2 కప్పులు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
నూనె - 250 గ్రా.
ఉప్పు - 2 చెంచాలు

ముందుగా పుట్నాలపొడిలో బియ్యం పిండి, సోయా పిండి,కార్న్‌ఫ్లోర్ అన్నీ చేర్చి జీలకఱ్ఱ, వేరుశనగ పొడి చేర్చి ఉంచాలి. కరివేపాకు, మిర్చి కలిపి ముందుగా చేసుకున్న మిశ్రమంలో కలపాలి. బాణలిలో నూనె కాచి ఈ ముద్దను పకోడీలుగా వేపాలి.

వడలు
కావాల్సినవి:
కరివేపాకు - 2 కప్పులు
శనగపప్పు - 1 కప్పు
బొబ్బర పప్పు - 1 కప్పు
అల్లం - చిన్న ముక్క
మిర్చి - 12
జీలకఱ్ఱ -1 చెంచా
వేరుశనగ పొడి - 1 కప్పు
నూనె - 250 గ్రా.
రస్కుల పొడి - 1 కప్పు
ఉప్పు - 1 చెంచా
ముందుగా పప్పులు నానబెట్టి మిక్సీ పట్టాలి. దీనికి వేరుశనగ పప్పు, కరివేపాకు, మిర్చి చేర్చి బాగా మిక్సీ పట్టాలి. ఈ పొడిలో కాస్త నీళ్లు పోసి నిమ్మకాయంత సైజులో ఉండలుగా చేసుకుని రస్కుల పొడిలో ముంచి వడలుగా తట్టి నూనెలో వేయించాలి.

పెరుగు పచ్చడి

కావాల్సినవి:
టమాటాలు - 2
కరివేపాకు - 2 కప్పులు
పెరుగు - 2 కప్పులు
బియ్యం పిండి - 1/2 కప్పు
జీలకఱ్ఱ - 1 చెంచా
ఆవాలు - 1 చెంచా
మినప్పప్పు, శనగపప్పు - 2 చెంచాలు
నెయ్యి - 2 చెంచాలు
పచ్చిమిర్చి - 6
ఇంగువ - కొద్దిగా
మెంతులు - 1 చెంచా
ఎండుమిర్చి - 4
నూనె - 2 చెంచాలు
పసుపు - కొంచెం

ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు తొక్కి ఉంచాలి. బాణలిలో ఆవాలు, జీలకఱ్ఱ, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టాలి. తర్వాత బాణలిలో నెయ్యి, మెంతులు, ఇంగువ వేయించాక టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, తొక్కించిన కరివేపాకు కలపాలి. బియ్యం పిండిని నీటిలో కలిపి ఉడకనివ్వాలి. బుడగలు వస్తుండగా దింపి చల్లార్చి ఉప్పు, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ పెరుగు పచ్చడిని ఇడ్లీ, దోశె, అన్నం, చపాతీల్లో వేసుకుని తింటే రుచిగా ఉంటుంది.