తెలంగాణ

రగులుతున్న అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాపై అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ రాష్ట్ర పార్టీ నాయకత్వంపై చిందులు తొక్కారు. పార్టీ టికెట్లు అమ్ముకున్నారనడానికి ఇదే నిదర్శనమంటూ ఆడియో టేపును కూడా విడుదల చేసి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త శరణ్‌దాస్ తన కుమారుడి ద్వారా చేసిన వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ఈ ఆడియోలో ఎంత నిజమున్నా లేకున్నా క్యామ మల్లేష్ ప్రత్యేకంగా ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటుచేసి అసంతృప్తిని వెల్లగక్కుతూ పార్టీ చేస్తున్న తప్పిదాలను ఎండకట్టిన తీరు పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా పనిచేస్తూ అహర్నిశలు ప్రజాసేవలో నిమగ్నమై పార్టీ పరువును నిలబెట్టేందుకు కృషిచేస్తున్న తనకు పార్టీ అన్యాయం చేసిందని రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ టికెట్టును ఆశించి భంగపడ్డ మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్టీక్‌రెడ్డి ఏకంగా పార్టీకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ టికెట్ ఇస్తారా లేక తన రాజీనామా ఆమోదిస్తారా? అంటూ పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు జారీచేశారు. తనకు న్యాయం చేయకుంటే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని వివరించారు. సమావేశం అనంతరం ఆయన అనుచరగణం ఏకంగా పార్టీ జెండా దిమ్మెలను పగలగొట్టి హంగామా చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకుని అసలైన నాయకత్వానికి అన్యాయం చేసారంటూ పార్టీ వర్గాల్లో రోజురోజుకూ పెరుగుతున్న అసంతృప్తి పార్టీ మనుగడను దెబ్బతీసే ప్రమాదాలు చోటుచేసుకున్నాయంటూ పార్టీ వర్గాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పార్టీ నాయకులు భిక్షపతి యాదవ్, జంగయ్య యాదవ్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్, జానారెడ్డిలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు టికెట్లను పంచుకున్నారని విమర్శించారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన యాదవ, కురుమ సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 40 ఏళ్లుగా తామంతా కాంగ్రెస్ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేశామని, తమ డబ్బు, వయస్సును కాంగ్రెస్‌కు అంకితం చేస్తే తమకిచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడ్డారు. పార్టీ అధికారానికి దూరమై కష్టకాలంలో పార్టీకి అండదండగా ఉన్న బీసీ నేతల పట్ల నిర్లక్ష్య వైఖరి వహించారన్నారు. కాంగ్రెస్ కంటే టీఆర్‌ఎస్ యాదవుల పట్ల కొంత సానుకూల దృక్పథాన్ని చూపుతోందని చెప్పారు. కాంగ్రెస్ పెద్దలు నగరానికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద హోటళ్లలో ఉంటారని, పార్టీ కోసం నిజంగా కష్టపడే వారికి కలిసే అవకాశం లేకుండా పోతుందని అన్నారు. రాహుల్, సోనియా గాంధీ అభిమతానికి విరుద్ధంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తూ యాదవులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. యాదవ ఓట్లు కాంగ్రెస్‌కు అవసరం కానీ సీట్లు మాత్రం ఇవ్వరని మండిపడ్డారు. 40 ఏళ్లుగా పార్టీ అభ్యున్నత లక్ష్యంగా పనిచేస్తున్న తనకు సీటు కోసం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ కొడుకు ద్వారా మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, దీనికి సంబంధించిన ఆడియో టేపులను విడుదల చేశారు. రెండు రోజులు వేచిచూస్తానని, అప్పటికీ కాంగ్రెస్ నుంచి స్పందన రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచి తీరుతానని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్‌లకు ఇక్కడ జరుగుతున్న వ్యవహారం తెలియాలనే మీడియా ముందుకు వచ్చినట్టు స్పష్టం చేశారు.