కృష్ణ

ఓఎన్జీసీ ప్లాంట్ సందర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : కేంద్ర రసాయన, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం కృష్ణాజిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం గ్రామంలోని ఓఎన్‌జీసీ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించి గ్రూప్ గేదరింగ్ స్టేషన్‌ను ప్రారంభించారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌లతో కలిసి ఒఎన్‌జీసీ ప్లాంట్‌ను సందర్శించిన ఆయన ఆయిల్, గ్యాస్ వెలికితీత వివరాలను ఒఎన్‌జీసీ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలుత ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ - 2 మోహన్ కుమార్, బందరు ఆర్డీవో ఖాజావలి, ఒఎన్‌జీసీ రాజమండ్రి ఎస్సెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌పి పటేల్ తదితరులు ఉన్నారు.