జాతీయ వార్తలు

భళా.. బాహుబలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: తెలుగు సినిమా జాతీయ ఉత్తమ పురస్కారాన్ని సాధించడానికి బాహుబలమే అవసరమైంది. దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు ఎన్నో మకుటాయమానమైన సినిమాలకు పుట్టినిల్లుగా నిలిచిన తెలుగు సినిమాకు దక్కని జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును తొలిసారిగా బాహుబలి సాధించింది. ఇది నిజంగా తెలుగు సినిమాకు సరికొత్త జాతీయ వెలుగు. తెలుగు సృజనకు కట్టిన పట్టం. తెలుగు దర్శకత్వ నైపుణ్యానికి చెక్కిన జాతీయ నగిషీ. ఇప్పటి వరకూ జాతీయ స్థాయిలో లభించిన ప్రాంతీయ అవార్డులకే పరిమితమైన తెలుగు సినిమా ఇప్పుడు జాతీయ వెలుగు దివ్వెగా మారింది. ఉత్తమ జాతీయ చిత్రంగానే కాకుండా స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డునూ బాహుబలి సొంతం చేసుకుంది. అలాగే కంచె చిత్రమూ 63వ జాతీయ చలన చిత్ర అవార్డుకు ఎంపికైంది. సోమవారం ప్రకటించిన ఈ అవార్డుల్లో బాలీవుడ్ అగ్ర తాంబూలాన్ని అందుకుంది. పికూ చిత్రానికి గాను అమితాబ్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆయన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఇది నాలుగో జాతీయ ఉత్తమ పురస్కారం. విలక్షణ పాత్రల్ని ఎంపిక చేసుకంటూ నటిగా కొత్త పుంతలు తొక్కుతున్న కంగనా రనౌత్ వరుసగా రెండోసారీ ఉత్తమ నటి పురస్కారాన్ని దక్కించుకుంది. తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రంలో ఆమె నిరుపమాన అభినయానికి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. అమితాబ్‌తో పాటు తనకు ఈ అవార్డు లభించడం తన జీవితంలో మరపురాని రోజని రనౌత్ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. చారిత్రక శృంగార రసాశంతో కూడిన ‘బాజీరావు మస్తానీ’ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ఉత్తమ దర్శకుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఏ మాత్రం మనసులు కలవని జంట ఇతివృత్తాన్ని అత్యంత హృద్యంగా వెండితెరకెక్కించిన ‘దమ్ లగాకే హైసా’ చిత్రానికి ఉత్తమ హిందీ చిత్రం పురస్కారం లభించింది. సంపూర్ణ వినోదాత్మక చిత్రంగా సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగి భాయ్‌జాన్’ఎంపికైంది. ఉత్తమ జాతీయ జనరంజక చిత్రంగా ‘బజరంగి భాయ్‌జాన్’కు జాతీయ అవార్డు లభించడం తమ కృషికి లభించిన గౌరవంగా దర్శకుడు కబీర్ ఖాన్ పేర్కొన్నారు. నిజజీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘తల్వార్’ చిత్రానికి ఉత్తమ మాతృ స్క్రీన్ ప్లే అవార్డు (అడాప్టెడ్) లభించగా, ఉత్తమ మాతృ స్క్రీన్ ప్లే, సంభాషణల పురస్కారాన్ని జుహి చతుర్వేది (పికూ), హిమాంశు శర్మ (తను వెడ్స్ మను రిటర్న్స్) దక్కించుకున్నారు. జాతీయ సమగ్రతకు సంబంధించిన అంశాలకు ఇచ్చే నర్గీస్ దత్ అవార్డు ‘నానక్ షా ఫకీర్’ సొంతం చేసుకుంది. గత ఏడాది దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ బ్లాక్ బ్లస్టర్లు నిర్మితం కావడంతో వీటిలో ఉత్తమంలోకెల్లా ఉత్తమ సినిమాలను జాతీయ అవార్డులకు ఎంపిక చేయడం జ్యూరీ సభ్యులకు కష్ట సాధ్యమే అయింది.

నటుడు: అమితాబ్ బచ్చన్ (పికూ)
నటి: కంగనా రనౌత్ (తను వెడ్స్ మనూ రిటర్న్స్)
చిత్రం: బాహుబలి
దర్శకుడు: సంజయ్ లీలా బన్సాలీ
(బాజీరావు మస్తానీ)
జనరంజక చిత్రం: బజరంగి భాయ్‌జాన్
తెలుగు చిత్రం: కంచె
తమిళ చిత్రం: విసారానాయ్
ఒరియా చిత్రం: పహాడా ర లుహ
హిందీ చిత్రం: దమ్ లగాకే ఐసా
బెంగాలీ చిత్రం: శంకాచిల్
నేపథ్య సంగీతం: ఇళయరాజా
(తరాయ్ తప్పట్టాయ్)
తొలి దర్శకుడు: నీరజ్ ఘయావాన్
(ఇందిరా గాంధీ అవార్డు)