Others

ఎడారిలో కోయిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల సుందర శ్రీరంగనాధ్ ‘పంతులమ్మ’ చిత్రంలో ఎడారిలో కోయిల అనే పాటలో నటిస్తున్నాడు. భవిష్యత్ అంతా అలానే ఉండబోతుందన్న విషయం అప్పటికి ఆయనకి తెలియదు. కళ్లమందు సినిమా అవకాశాలు, కార్లు, బంగళాలు, విలాసవంతమైన జీవితం- ఇవన్నీ వర్థమాన నటుడికి కళ్లముందు కన్పించే అంశాలు. ఒక్కొక్క సినిమా హిట్టవుతుంటే ఒక్కో కల నెరవేరుతుంది. కానీ ఇవన్నీ రంగనాథ్‌కు కనపడలేదు. తన జీవితం సాఫీగా సాగిపోయే ఓ బండిలానే ఆయన ఊహించుకున్నాడు. ప్రేక్షకులు మీరు ఎక్కువ సినిమాల్లో నటించాలి అని అభ్యర్థించినా, నాలో నటుణ్ణి, నా వ్యక్తిత్వం వెనకపడేస్తుంది అన్న తాత్వికతనే చెప్పాడు. ఔను, రంగనాథ్ ఓ మంచి తాత్వికుడు. మంచి కవి. మృదుస్వభావి. పసిపిల్లాడి మనస్తత్వం. అందుకే 25 ఏళ్లు వచ్చాక ఉద్యోగరీత్యా దూరమైన స్నేహితుడి కోసం ఆత్మహత్యాయత్నం చేసిన అమాయకుడు. కళ్లముందు రంగులకల కదలాడుతున్నా, చీకట్లోనే శ్వాసించడం నేర్చుకున్నాడు. ఎటువంటి భేషజాలకు పోకుండా తనకు నచ్చిన దారిలోనే ప్రయాణాన్ని సాగించాడు.
రంగనాథ్ జీవితంలో బోలెడన్ని మలుపులు. దాదాపుగా 60 చిత్రాల్లో హీరోగా, 300 చిత్రాల్లో ప్రతి నాయకుడిగా, సహాయ నటుడిగా.. చేసిన పాత్రలన్నీ ఆయన చుట్టూ పరిభ్రమించేవే. ఇందులో ఏ ఒక్కవిధంగానైనా ప్రవర్తించమని చెప్పేవి. కానీ, ఏ ప్రోద్భలానికి లొంగిపోలేదు. తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని, అది ఎప్పటికీ మారదని రుజువుచేశాడు. టాటా వీడికోలు అనే పాటనుండి ప్రారంభమైన ప్రస్థానం అనేక అనుభవాలలో పడి జీవితంలో వున్న ఎగుడు దిగుడులన్నీ చూసింది. నటుడిగా మారడం అనేది తన తల్లి కోరిక కనుక ఆ విధంగా నటిస్తున్నానని చెప్పేవాడు. చదువు పూర్తయిన వెంటనే రైల్వే డిపార్ట్‌మెంట్‌లో టికెట్ కలెక్టర్‌గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం ఎన్ని మలుపులు తిరిగినా అదే వేగం, అదే నిబద్ధత. తొలినాళ్ళల్లో వీణాపాణి ఆర్ట్స్ సంస్థ అనే సమాజాన్ని స్థాపించి దర్శకుడిగా అనేక నాటకాలు వేసిన అనుభవం వుంది. కానీ, జీవిత నాటకాన్ని రసవత్తరంగా పండించుకోవాలన్న వాంఛ లేదు. భార్య నిర్మలా చైతన్య మంచానికి పరిమితమైతే, ఆమెకి భర్తలా కాకుండా తల్లిగా సేవ చేశానని చెప్పాడు. ఆమె అనారోగ్యంతో ఉన్న దాదాపు ఆరేళ్లపాటు సినిమా అవకాశాలు వదిలేసి కంటికిరెప్పలా కాపాడాడు. భర్త అనే పదానికి పూర్తి డిఫినిషన్ ఇచ్చాడు. అనేక కవితలతో కవులను ఆకట్టుకున్న ఆయన అక్షర సేద్యానికి నిలువెత్తు దర్పణంగా నిలుస్తుంది -అక్షర సాక్ష్యం. టెన్నిస్ అంటే ఇష్టపడే ఆయన ఎరుగని క్రీడలు లేవు. అయినా కానీ తనకు నచ్చిన ఆటవైపే మొగ్గేవాడు. వ్యక్తిగా అందరికీ దగ్గరయ్యాడు. కానీ ఒంటరి కోయిలగా భార్యా వియోగంతో మిగిలిపోయాడు. పిల్లలపై ఏనాడూ ఆశ పెట్టుకోలేదు. తన జీవితానికి తానే కర్త అయ్యాడు. ఎడారిలో కోయిల ఎన్ని రాగాలు తీసినా ఎవరికీ వినిపించని రీతిలోనే, తన మనసులో ఎన్ని విలాపాగ్నులు, విరహగీతాలు పాడినా ఏ వసంతం ఆయన దరి చేరలేదు. చివరికి హీరో అన్న మాటనుండి మనిషి అన్న మాటకి వొదిగిపోయినా, బెట్టు సడలని ఆత్మవిశ్వాసంతో తన దారి తాను చూసుకున్నాడు. ఒంటరి కోయిలకు నేపథ్య సంగీతాన్ని అందించేదెవరు? రంగనాథ్ ఆత్మావలోకనాన్ని ఆచి తూచి చూసేదెవరు? వెనె్నల్లో సముద్రం ఎంతందంగా వున్నా, గర్భంలో పేలుతున్న అగ్నిపర్వతాల లావా వేడి ఎంత వుంటుంది అని గుర్తించగలిగితే, రంగనాథ్ మనసులోని మాటలను అర్థం చేసుకోగలమేమో! ఇప్పటికింతే.. రంగనాధ్!!

- జి.రాజేశ్వర్‌రావు