మంచి మాట

ధన ప్రాశస్త్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాభారత సంగ్రామంలో జగత్ప్రసిద్ధమైన కర్ణుడి మరణాన్ని జీర్ణించుకోలేక ధర్మరాజు వేదన చెందాడు. అశాంతితో తల్లిడిల్లినాడు. తల్లి కుంతీదేవి, సోదరులు ఎంత ఊరడించినా ధర్మజుని మనస్సు శాంతించలేదు. అర్జునునితో ధనంజయా! పూజ్యుడు, జ్యేష్ఠభ్రాతయైన కర్ణునీ, సకల బాంధవులనూ యుద్ధంలో చంపి మహా పాపంచేశాను.
మంచి పనులు చేయడంవలన, పశ్చాత్తాపం, దానం, తపస్సులచేత నివృత్తి మార్గాన్ని పొందడంవలన, తీర్థసేవ చేత, చేసిన పాపమును అందరికీ ప్రకటించడంవలన, శ్రుతి-స్మృతుల పారాయణంవలన పాపం నశిస్తుందని శాస్తవ్రచనం గదా! త్యాగం చేసినవాడు తిరిగి పాపం చేయలేడు అని వేదవాక్యం. త్యాగవంతుడు అనగా సకల కర్మలను త్యాగం చేసినవాడు జనన మరణాలు పొందడని శ్రుతివాక్యం. కావున సన్మార్గాన్ని పొందినవాడు, నిశ్చితమైన బుద్ధి కలవాడు- ద్వంద్వాలకు అతీతమైనవాడు- జ్ఞానవంతుడు అయిన బ్రహ్మను పొంది ముక్తుడౌతాడు. కావున నేను మీ అందరివద్దనుండీ సెలవు తీసికొని, మమకారం విడిచి- ఎచటికైనా వెళ్లిపోతాను.
ధనభోగాది సంచయంగలవాడు- పరిగ్రహంగలవాడు ధర్మాన్ని పూర్తిగా పొందజాలడు అని వేదం చెప్పింది. కావున ఈ సమస్త రాజ్యాన్నీ, సుఖభోగాలను త్యజించి వెళ్లిపోను. ఈ రాజ్యాన్ని అంతా నీవే పాలించు అని ఆవేదనతో అర్జునునికి తెలుపగా అన్నగారి మాటలు ఆలించి ప్రశాంతంగా అర్జునుడు రాజధర్మాన్నీ, ధన మహత్మ్యాన్ని వివరిస్తూ సోదరా! యుద్ధరంగంలో శత్రు సంహారం చేసి, సంపాదించిన ఈ రాజ్యాన్ని విడిచివేయాలని ఎందుకు అనుకుంటున్నావు? అలా చేస్తే అది నీమూఢత్వమే అవుతుంది. ఉత్తమ రాజవంశంలో పుట్టి మూఢత్వంతో ధర్మార్థాలను విడువరాదు. పవిత్రమైన రాజధర్మాలను అసాధువులు నీవు లేకపోవడంవలన నాశనం చేస్తారు. ఆ పాపం నీకే తగులుతుంది. అన్నీ వదులుకొని ఏమీ లేకుండా ఉండడం మునుల ధర్మం. అది క్షత్రియ ధర్మంగాదు.
ఎవరైనా ఇతరుల ధనాన్ని హరించారంటే వారు వారి ధర్మానే్న హరించారని అర్థం. అనేక మార్గాల ద్వారా ధనాన్ని పొంది, వృద్ధి చేసుకున్నచో అన్ని పనులూ సక్రమంగా సాగిపోతాయి. ధర్మమూ, కామమూ, స్వర్గమూ కూడా ఈ ధనం ఉంటేనే లభిస్తాయి. అర్థం (్ధనం) లేకపోతే ఈ ప్రపంచంలో ప్రాణయాత్ర సాగదు. అల్పబుద్ధి గల మానవుడు తాను తలపెట్టిన పనులన్నీ వేసవిలో నదులవలె తెగిపోతాయి. విచ్ఛిన్నములౌతాయి.
ఎవనికి ధనం ఉంటుందో వానికే మిత్రులు- బంధువులు ఉంటారు. ఏదైనా ఒక ప్రయోజనాన్ని సాధించాలనుకొనే నిర్థనుడు ఆ ప్రయోజనాన్ని సాధించలేడు. అర్థాలచేతనే అర్థాలను పట్టుకోవచ్చును. ధనంవల్లనే కులం ఉచ్ఛస్థితిలో వుంటుంది. ధర్మం వృద్ధి చెందుతుంది. ధనం లేనివానికి ఇహ పరములు ఉండవు, లభించవు. ధనం కృశిస్తే అన్నీ కృశించినట్లే. వేదాల ద్వారా పండితులు బోధించినట్లు రాజులు నిత్యము మూడు వేదాలను అధ్యయనం చేసి పండితులుగా మారాలి. పలు విధాలుగా ధనం సంపాదించాలి. యజ్ఞాలు చేయాలి. దేవతా పూజాదికాలు నిర్వహించాలి. రాజులు పరులనుండి ధనం తీసికొంటున్నారంటే అది పూర్తిగా మంచి పనే. పరులకు అపకారం జరగకుండా ధనం సంపాదించడమనేది లోకంలో ఎక్కడా చూడము. రాజులు ఈ దృష్టితోనే పృథివిని జయిస్తూ వుంటారు. జయించి, పుత్రులు తండ్రి ధనాన్ని నా ధనం అన్నట్లు ఇది నా ధనం అంటారు. పూర్వం స్వర్గానికి వెళ్లిన రాజర్షులు చెప్పిన ధర్మం కూడా ఇదే. రాజు అనుసరించవలసిన శాశ్వతమైన మార్గం- అంటూ అర్జునుడు మహాభారతంలో శాంతి పర్వంలో ధర్మరాజుకు ధన ప్రాశస్త్యాన్ని, ధర్మవిశిష్టతనూ రాజధర్మాన్ని అన్నగారికి తెలిపి చెడు మార్గంలో పయనించవద్దనీ, అది ధర్మం కాదనీ వేడుకున్నాడు వినమ్రుడై.
‘ధనమే అన్నిటికీ మూలం’ అని తెలిపాడు తన సందేశంలో అర్జునుడు.