నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ‘నను నీవు సేయు ప్రశ్నము
జన సన్నుత వేద శాస్త్ర సారాంశంబై
ఘనమగు హరిగుణ కథనము
వినుమని, వినిపింప ఁ దొడంగె వేడ్క దలిర్పన్
భావం: సచ్చరిత్రా! నీవు వేసిన ప్రశ్న వేదశాస్తమ్రుల సారాంశమైనది. ఘనమైనది అటువంటి శ్రీహరి గుణ కథనాన్ని వినవలసింది అని వేడుక చిగురించగా వినిపించటం మొదలు పెట్టాడు. అతి చంచలమైన మనస్సును కేవలం పద్మనాభునిపైన నిలుపటం అంటే సామాన్యులకు చేతకాని పని కదా. మరి అటువంటప్పడు ఎలాగున లక్ష్మీనాథుడిని, రమావల్లభుడిని మనసున నిలుపుకోవడం అనే అడిగే పరిక్షీత్తుకు శుక మహర్షి అతిసులభోపాయాన్ని విశదం చేశాడు. ఎంత చంచలమైన మనస్సు అయనా కథలయందు బహుప్రీతి ని కలిగి ఉంటుంది. కనుక తప్పక విష్ణుకథలను వింటూ ఉంటే ఆ మనస్సే విష్ణువు పైనే కేంద్రీకృతమవుతుంది అన్నాడు.

పోతన భాగవతము - ఏకాదశ స్కంధము