సబ్ ఫీచర్

వధువు చెబితే వినాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వెయ్యి అబద్ధాలాడైనా పెళ్లి చేయాలన్న’ది ఒకప్పటి మాట. అయితే, మగపెళ్లివారు ఒక్క అబద్ధం చెప్పినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వధువు తాళి కట్టించుకునేందుకు ‘ససేమిరా’ అనడంతో వివాహవేడుక రద్దయ్యింది. వరుడి విద్యార్హతల గురించి తనకు అబద్ధం చెప్పారని తెలియడంతో పెళ్లికుమార్తె ఈ నిర్ణయం తీసుకుంది. గణితానికి సంబంధించి తాను వేసిన చిన్న ప్రశ్నకు వరుడు తప్పుడు సమాధానం ఇవ్వడంతో ఆమె విస్మయం చెందడమే గాక ‘ఏ మాత్రం తెలివితేటలు లేని వాడితో తాళి కట్టించుకునే ప్రసక్తే లేద’ని తెగేసి చెప్పింది. వినడానికి వింతగా ఉన్నా ఈ సంఘటన ఇటీవల కాన్పూర్ జిల్లా (యుపి) రసూలాబాద్‌లో జరిగింది. పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో పెళ్లికి ఆ యువతి ‘సరే’ అంది. వరుడి చదువు గురించి తెలుసుకోవాలన్న ఉబలాటంతో ఆమె పెళ్లి ముహూర్తానికి ముందు చిన్న ప్రశ్న వేసింది. ‘15+6 అంటే ఎంత?’ అని ఆమె ప్రశ్నించగా వరుడు ఏ మాత్రం తడుముకోకుండా ‘పదిహేడు’ అని జవాబిచ్చాడట. వరుడి చదువు గురించి మగపెళ్లివారు అబద్ధం చెప్పారని తెలియడంతో ‘ఈ పెళ్లే వద్దు’ అంటూ ఆమె ధైర్యంగా చెప్పింది. తల్లిదండ్రులు ఎంతగా బతిమాలినా ఆమె తన పంతం వీడకపోవడంతో చివరకు పెళ్లి రద్దయ్యింది. పెళ్లి పందిట్లో గొడవ జరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. నిశ్చితార్థం సందర్భంగా ఉభయ పక్షాలు ఇచ్చిపుచ్చుకున్న నగలు, కట్న కానుకలు, ఇతర లాంఛనాలు వాపసు చేసుకునేలా పోలీసులు ఒప్పందం కుదిర్చారు. యుపిలోనే ఇలాంటి సంఘటన గత నెలలో జరిగిందని పోలీసులు గుర్తుచేస్తున్నారు. వరుడి ఆరోగ్యం గురించి వాస్తవాలు దాచడంతో ఆగ్రహించిన వధువు పెళ్లి మండపం నుంచి బయటకు వచ్చేసింది. అనుకోని రీతిలో మరో యువకుడితో ఆమెకు పెళ్లి జరిగింది. ఓ గ్రామంలో పెళ్లి ముహూర్తానికి ముందు మూర్ఛ రావడంతో వరుడు జుగల్ కిశోర్ స్పహతప్పి కిందపడిపోయాడు. పెళ్లికి వచ్చిన బంధువులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ సంగతి తెలిశాక వధువుఇందిర (23) ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు’ అని అందరి సమక్షంలో ధైర్యంగా ప్రకటించింది. ఆమె నిర్ణయంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆందోళన చెందారు. అయితే, పెళ్లికి వచ్చిన సమీప బంధువు హర్పాల్ సింగ్‌తో అదే ముహూర్తానికి ఇందిరకు పెళ్లి చేశారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం పెళ్లి మండపానికి చేరుకున్న వరుడు జుగల్ కిశోర్ అక్కడి పరిస్థితి చూసి నిశే్చష్టుడయ్యాడు. తాను చేపట్టవలసిన వధువుకు మరో యువకుడితో పెళ్లి జరిగిందని తెలుసుకుని ఇక చేసేదేమీ లేక ఇంటిముఖం పట్టాడు.