నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. అంతరిక్షంబు వలన దిగంతరములు
వెలుఁగ జనుదెంచు నాతని విమల దీప్తి
సూచి సద్గుణములు గడుఁ జోద్యమంది
రురుతరద్యుతి యిది యేమి యొక్కొ యనుచు
భావం: యయాతి ఇంద్రునితో మాట్లాడే సమయంలోతాను చేసిన తపస్సును చెబుతూ ఆ తపస్సు ఇతరుల తపస్సుకన్నా గొప్పది అని చెప్పడంతో యయాతిలో పెరిగిన గర్వాన్ని చూచిన ఇంద్రుడుకోపించాడు. యయాతి నీవు సంపాదించిన పుణ్యము క్షీణించుట చేతను, గర్వాంధుని అవడం వలననూ యయాతి తిరిగి అధోలోకాలకు వెళ్లమని అన్నాడు. దాంతో గర్వం నశించిన యయాతి ఇంద్రుడిని క్షమించమని అడిగి నేను తిరిగి మానవలోకానికి వెళ్లలేను. దయచేసి నక్షత్రలోకంలో ఉండేవిధంగా నన్ను అనుగ్రహించు అని వేడుకోగా యయాతిని నక్షత్రలోకంలో ఉండుమని ఇంద్రుడు ఆదేశించిన కారణంగా యయాతి ఓ నక్షత్రంలోకంలో ఉన్నాడు. అపుడక్కడ ప్రకాశిస్తున్న కాంతిని చూచి - ఆకాశం దెస దిక్కుల మధ్యభాగాలు ప్రకాశింపగా వచ్చే యయాతి యొక్కనిర్మలమైన కాంతి చూచి అధికమైన ఈ కాంతిఏమోకదా! అంటూ నక్షత్రగణాలు ఆశ్చర్యాన్ని పొందాయి.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము