భక్తి కథలు

శ్రీ వేంకటేశ్వర వైభవం - 22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారిలో కొందరు బ్రహ్మ గొప్పవాడని వాదించగా, ఇంకొందరు కాదు విష్ణువే గొప్పవాడనీ ఇంకొందరు పరమశివుడే గొప్పవాడనీ వాదులాడనారంభించారు. ఇంతలో కొందరు విజ్ఞులు, ‘‘ఇలా మనలో మనం వాదులాడుకోవడం వల్ల కాలం వ్యర్థం కావడం తప్ప, మన సమస్యకు పరిష్కారం దొరకదు. దీనికి ఒకటే మార్గం.
మనలో అత్యంత శక్తిమంతడు ముల్లోకాలకూ వెళ్లి సత్యశోధన చేస్తే విషయం తేటతెల్లమవుతుంది. మన యజ్ఞం సార్థకమవుతుంది’’ అన్నారు. ఐతే, ‘‘మరో అత్యంత శక్తివంతులెవరున్నారు’’ అని ఆలోచించిన ఆ ఋషులకు అందరిలోకీ భృగుమహర్షి ఉత్తమునిగా, అక్కడున్నవారందరిలోకీ శక్తివంతునిగా కనిపించాడు. త్రిమూర్తులను పరీక్షించి వారిలో సత్వగుణ సంపన్నుడెవరో నిశ్చయించాల్సిన బాధ్యత అలా ఆ భృగు మహర్షిపై పడింది. అందరూ ఏకగ్రీవంగా భృగు మహర్షిని ముల్లోకాలకూ వెళ్లి సత్యశోధన
చేయడానికి పంపాలని
నిశ్చయించారు. అందరూ తనపై పెట్టిన బృహత్తర బాధ్యతను భయపడుతూనే స్వీకరించి భృగు మహర్షి వారినుంచి సెలవు తీసుకున్నాడు నిజానికి, నారదుడు అక్కడ మరి కాస్సేపు ఉండి ఉంటే ఎంతో సంతోషించేవాడు. అందువల్ల అతనికీ భృగు మహర్షి పెట్టే పరీక్ష గురించి తెలియదు.

భృగు శోధన
బ్రహ్మ, విష్ణు మహేశ్వరుడు ముగ్గురూ ముగ్గురే. ‘‘నా సత్యశోధన ఎవరితో మొదలుపెడితే బాగుంటుందీ? అని ఆలోచించాడు భృగు మహర్షి. ‘‘సత్యానికి ఆదిమూలం సత్యలోకమే! కాబట్టి, నా సత్యశోధన బ్రహ్మదేవునితోనే ఆరంభిస్తాను. ఆయన దగ్గరకు పోతాను. ఆయన్ను పరీక్షిస్తాను. నా సత్వపరీక్షలో గనక ఆయన నెగ్గితే యజ్ఞ్భోక్త ఇక ఆయనే కదా!’’ అని అనుకున్నవాడై, సత్యలోకానికి బయలుదేరాడు భృగుమహర్షి.

సత్యలోకంలో భృగుమహర్షి
అది సత్యలోకం. అక్కడ మహాసభ జరుగుతోంది. చతుర్ముఖుడైన బ్రహ్మ, ఆయన భార్య వీణాపాణి సరస్వతీదేవి సుఖాసీనులై ఉన్నారు. సభ మిరుమిట్లు గొలుపుతోంది. సభలో రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు, దేవతలు, యక్షులు, గరుడ, గంధర్వులు, కిన్నర, కింపురుషాదులు- ఇలా ఎందరో ఆసీనులై ఉన్నారు. సృష్టి విజ్ఞాన సంపన్నమైన రహస్యాలను ఎన్నిటినో సభాసదులకు బ్రహ్మ బోధిస్తూ ఉండటం కనిపించింది.
భృగుమహర్షి బ్రహ్మదేవుని సభలో ప్రవేశించాడు. బ్రహ్మ వైపు, సరస్వతీదేవి వైపూ చూశాడు. సరస్వతీదేవి చక్కని వీణానాదంలో మునిగిపోయి ఉన్నారంతా. సభలో రెండు వైపులా ఆసీనులై ఉన్న సభాసదులనూ పరికించాడు. ఎవరూ భృగుమహర్షిని పలకరించలేదు. బ్రహ్మకు నమస్కరించినా లాభం లేదు. ఎందుకంటే, అసలే తాను వచ్చింది సత్వగుణ సంపన్నుడెవరే సత్యశోధనకు. అందువల్ల, నేరుగా వెళ్లి అక్కడ ఒక ఆసనంలో కూచున్నాడు. సభాసదులకు భృగుమహర్షి వచ్చిన దానివల్ల కలిగిన ఆనందంకన్నా, ఆయన నేరుగా సభకు వచ్చి కూర్చున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది.
‘‘సభామర్యాదలను ఉల్లంఘించి, ఇలా నేరుగా వచ్చి సభలో కూచోవడం ఏమన్నా మర్యాదగా ఉందా? ఏమిటీ నీ వింత ప్రవర్తన? ఈ సభలో ఉండేవారికన్నా నీవు గొప్పవాడివా? త్రిమూర్తులనే తన పుత్రులుగా చేసుకొన్న అనసూయాదేవి భర్తయైన అత్రి కంటే గొప్పవాడివా నీవు? లేక ఇంద్రుడినే శపించిన గౌతముని మించిన వాడవా? వినయశీలిగా ఉండే మహా తపస్సంపన్నుడు జమదగ్ని కన్నా మించినవాడివా? .....
- ఇంకాఉంది