AADIVAVRAM - Others

సర్దుబాటు -- సండే గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు పదాలు ఒకేలా కన్పిస్తాయి. కానీ రెండూ వేరు. అవి రాజీ, సర్దుబాటు.
రాజీపడటం అంటే ఓడిపోయినట్టుగా చాలామంది భావిస్తారు. అది కొంత వాస్తవం కూడా. కానీ సర్దుబాటు అలా కాదు.
సర్దుబాటు అనేది కుటుంబ వ్యవస్థలో అత్యంత అవసరమైనది. సంతోషానికి అది తాళంచెవి లాంటిది.
మన కుటుంబంలోని వ్యక్తులని బాగా ప్రేమిస్తేనే మనం సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎదుటి వ్యక్తులకి గౌరవం ఇవ్వడం లాంటిది సర్దుబాటు. మరో విధంగా చెప్పాలంటే స్వార్థం తగ్గించుకోవడం. స్వార్థం ఎక్కువగా ఉన్నప్పుడు సర్దుబాటు చేసుకోవడం అంత సులువు కాదు. సర్దుబాటు చేసుకోవడం వల్ల కుటుంబంలో, మనం పనిచేసే చోట కొంత ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సర్దుబాటు చేసుకోక పోవడం వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం పెరిగి అది అగాధంగా మారే అవకాశం ఉంది.
సర్దుబాటు అనేది కష్టమైన పనే. మన మనస్సు అందుకు అంగీకరించకపోవచ్చు. కానీ సర్దుబాటు అనేది ఈ విశ్వంలో ఉంది. ప్రతి జీవి అంతో ఇంతో సర్దుబాటు చేసుకుంటుంది. ఈ విశ్వంలో ఎంతోమంది వున్నారు. మరెన్నో జీవాలు వున్నాయి. ఆ మనుషులతో, ఆ జీవాలతో ఎంతో కొంత సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.
మనం ఎంతమేరకు సర్దుబాటు చేసుకోవాలన్న విషయం మనలని బట్టి, అక్కడున్న పరిస్థితిని బట్టి ఉంటుంది. మనం సర్దుబాటు చేసుకోనప్పుడు విసుగూ, నిరాశ, ఒంటరితనం ఏర్పడుతాయి. సంతోషం ఎదుటివాళ్లకు కలుగజేస్తే మనకు కూడా సంతోషం కలుగుతుంది. మనం సర్దుబాటు చేసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తులకి సంతోషం కలుగుతుంది. దానివల్ల మనకూ సంతోషం కలుగుతుంది.
మన కోసం ఇతరులే సర్దుబాటు చేసుకోవాలని అన్పించవచ్చు. కానీ అది సరైంది కాదు.
ఒక్క విషయం తప్పక గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ మనమే సర్దుబాటు చేసుకుంటే ఇతరుల దృష్టిలో చులకన అవుతాం. ఇది దృష్టిలో పెట్టుకొని మనం మెదలాల్సి ఉంటుంది.
మనం చాలామందిని ప్రేమించాలంటే మనం సర్దుబాటు చేసుకోవాలి.
మనం సంతోషంగా ఉండాలంటే సర్దుబాటు చేసుకోవాలి.
సర్దుబాటుకి, రాజీకి భేదం ఉంది. రాజీ పడటం అంటే ఓడిపోవడమే.
సర్దుబాటు అంటే సంతోషాన్ని ఇవ్వడం.
సంతోషాన్ని పొందడం.